Monday, May 20, 2024
Homeహెల్త్Body massage: డిప్రషన్ ని పోగొట్టే మసాజ్

Body massage: డిప్రషన్ ని పోగొట్టే మసాజ్

ట్రిగ్గర్ పాయింట్ మసాజ్

ఆరోగ్యంగా ఉండడానికి ఫిట్ నెస్, మంచి డైట్ , నిద్ర వంటివి ఎంత అవసమరమో శరీరానికి మసాజ్ కూడా అంతే అవసరం. ఇది నరాలకు బలం ఇస్తుంది. మనల్ని వేధించే రకరకాల ఒత్తిడుల నుంచి ఎంతో ఉపశమనం ఇస్తుంది. అంతేకాదు మనల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాంటి మసాజ్ వల్ల పొందే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
 లోషన్, ఆయిల్స్ తో శరీరం మసాజ్ చేసుకోవడం వల్ల చర్మానికి జంటిల్ ఎక్స్ ఫొయిలేషన్ అవుతుంది. ఫలితంగా చర్మంలో కొత్త కణాలు పుట్టడంతోపాటు చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
 శరీరంలో నొప్పులు, టెన్షన్లకు బిగుసుపోయిన కండరాలు కారణం. దీని నుంచి బయటపడడానికి మసాజ్ బాగా పనిచేస్తుంది. శరీరం రిలాక్స్ అయితే నరాలు సేదదీరుతాయి.

- Advertisement -

 నరాలు రిలాక్సింగ్ గా ఉంటే శరీరంలోని హార్మోన్ల ఉత్పత్తి సమతుల్యంగా ఉంటుంది. కోర్టికోస్టరాయిడ్స్ లాంటి స్ట్రెస్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి ఎండార్ఫిన్ లాంటి ‘ఫీల్ గుడ్’ హార్మోన్లు శరీరంలో పెరుగుతాయి.
 మసాజ్ వల్ల స్లీప్\వేక్ సైకిల్ క్రమబద్ధమవుతుంది. బషిష్టులను, రోగనిరోధక కణాలను, బ్లడ్ షుగర్ ను క్రమబద్ధీకరిస్తుంది. ఎంత తినాలి అన్న వాటినీ మసాజ్ క్రమబద్ధీకరిస్తుంది. మసాజ్ వల్ల కండరాలు రిలాక్స్ అవడంతో శరీర క్రియలన్నీ పద్ధతిగా జరుగుతాయి.
 మసాజ్ చేసేటప్పుడు బాడీ స్ట్రెచ్ మూవ్ మెంట్స్ చేస్తే కీళ్లు బాగా పనిచేస్తాయి. మసాజ్ వల్ల కండరాలు, లిగమెంట్ల మీద సరిపడినంత టెన్షన్ పడి ద్రుఢంగా ఉంటాయి.
 మసాజ్ వల్ల ఎముకలకు రక్త సరఫరా మెరుగుపడుతుంది. దీంతో కాల్షియం, ఇతర ఖనిజాలు వాటికి బాగా అంది అవి ద్రుఢంగా తయారవుతాయి.


 మసాజ్ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రవాహంతో పాటు ఆక్సిజన్ బాగా జరిగేలా చేస్తుంది. కార్డియోవాస్క్యులర్ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది.
 ఒత్తిడి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. జీవక్రియ సరిగా జరగదు. మసాజ్ వల్ల శరీరానికంతటికీ ఆహారం, పోషకాలు సరిగా అంది జీర్ణక్రియ బాగా అవుతుంది.
 మసాజ్ చేయడానికి ముందు ఊపిరి లోపలికి బాగా తీసుకోవాలని థెరపిస్టులు చెపుతుంటారు. లోపలికి బాగా ఊపిరి తీసుకోవడం వల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. మసాజ్ తో ఒత్తిడి కండరాలు రిలాక్స్ అయి అవి బిగుసుకుపోవడం తగ్గుతుంది. ఊపిరి కూడా బాగా తీసుకోగలం.
 మసాజ్ వల్ల మైగ్రైన్, తలనొప్పుల్లాంటివి కూడా తగ్గుతాయి. శరీరం మసాజ్ నిత్యం చేసుకోవడం వల్ల జీవనశైలికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు తలెత్తవు.
 మసాజ్ మూడ్ బూస్టర్ కూడా. నరాల వ్యవస్థ రిలాక్సు అవడం వల్ల మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. యాగ్జయిటీ, డిప్రషన్ లాంటి వాటిని సైతం మసాజ్ తగ్గిస్తుంది. వెన్నునొప్పికి కూడా మసాజ్ బాగా పనిచేస్తుంది.

 మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
 స్ట్రెస్ బస్టర్ గా పనిచేస్తుంది.
 ఎప్పుడైతే ఒత్తిడి తగ్గుతుందో అప్పుడు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మెంటల్ క్లారిటీ తో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. బ్రెయిన్ కు రక్తప్రవాహం సరిగా జరిగి మానసిక అలసట పోయి రిలాక్సు అవుతారు.

ఎన్నో రకాలున్నాయి..

మసాజుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకు స్వీడిష్ మసాజ్ వీటిల్లో ఒకటి. ఇది జంటిల్ మసాజ్ టెక్నిక్. ఈ మసాజ్ శరీరాన్ని బాగా రిలాక్స్ చేస్తుంది. ఇది చేసేటప్పుడు థెరిపిస్టు లాంగ్ స్ట్రోక్స్, నెడింగ్, డీపర్ సర్క్యులర్ మూవ్ మెంట్స్ అనుసరిస్తారు. డీప్ మసాజ్ ఇంకొకరకం. లిటిల్ స్ట్రోక్స్ తో కొద్దిగా
ఎక్కువ ప్రెషర్ పెడుతూ దీన్ని చేస్తారు. ఇది కండరాలలోని పొరలపై, టిష్యూల్లోపలికి సైతం ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గాయాలైనపుడు ఈ రకమైన మసాజ్ చేస్తారు. స్పోర్ట్స్ మసాజ్ మరోరకం. ఇది కూడా స్వీడిష్ మసాజ్ లాగే ఉంటుంది.

గాయాల నుంచి తేరుకుంటున్న క్రీడాకారులు, గాయాలు కాకుండా ఉండేందుకు కొందరు ఈ రకమైన మసాజ్ చేయించుకుంటారు. ట్రిగ్గర్ పాయింట్ మసాజ్ ఇంకొకటి. దీన్ని టెన్షన్, టైట్నెస్ లు ఉన్నచోట ఈ మసాజ్ చేస్తారు. దీనిల్ల ఆ భాగాల్లోని ప్రెషర్ పోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News