Friday, November 22, 2024
Homeహెల్త్Donkey milk a super food: సూపర్ ఫుడ్ గా గాడిద పాలు

Donkey milk a super food: సూపర్ ఫుడ్ గా గాడిద పాలు

ఆవు పాలకంటే పోషకాలు ఎక్కువ

గాడిదపాలతో అందం…ఆరోగ్యం

- Advertisement -

గాడిదపాలు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇందులో రెటినాల్ అనే పదార్థం ఉంది. ఇది చర్మాన్ని నిత్యయవ్వనంగా ఉంచుతుంది. అందుకే కాస్మొటిక్ ఉత్పత్తుల్లో గాడిదపాల వినియోగం నేడు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. గాడిద పాలలో పోషకాల సాంద్రత సైతం ఎంతో ఎక్కువ. అందుకే తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా చాలామంది గాడిదపాలను వాడుతుండడాన్ని సైతం ఇటీవల
కాలంలో మనం చూస్తున్నాం.

ఆవుపాలలో కన్నా గాడిదపాలలో నాలుగు రెట్లు ఎక్కువ పరిమాణంలో సి విటమిన్ ఉంది. అంతేకాదు విటమిన్ ఇ, అమినో యాసిడ్స్, విటమిన్ బి1, బి6, సి, డి, ఇ, ఒమేగా 3 కూడా గాడిద పాలల్లో ఉన్నాయి. గాడిదపాలల్లో కాల్షియం బాగా ఉంది. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి మనుషుల చర్మాన్ని యవ్వన కాంతితో మెరిసేలా చేస్తూ వయసును కనిపించకుండా చేస్తుంది. చర్మానికి సాంత్వన నిచ్చే గుణం కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లో ఉంది. చర్మంపై ఏర్పడ్డ ముడతలను ఇవి పోగొట్టడమే కాదు దెబ్బతిన్న చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తాయి.

గాడిదపాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల చర్మ సంబంధమైన సమస్యలు సైతం తగ్గుతాయి. గాడిదపాలలోని న్యూట్రియంట్లు, యాంటాక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ లక్షణాలను పెంపొందింపచేస్తాయి. వీటిల్లోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్మరస్, విటమిన్స్, అమినో యాసిడ్స్ వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది. మనదేశంలో, ఆఫ్రికా లాంటి చోట్ల శతాబ్దాలకు పూర్వమే చర్మ సమస్యలకు
సంబంధించిన మందుల తయారీలో గాడిదపాలను వాడేవారని తెలుస్తోంది. గాడిదపాలల్లోని లాక్టిక్ యాసిడ్ కి చర్మాన్ని శుభ్రం చేసే గుణం ఉంది.

పైగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా గాడిదపాల్లో ఉన్నాయి. యాక్నే ప్రోన్ చర్మంలో ఆయిల్ ఉత్పత్తిని గాడిదపాలల్లోని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ క్రమబద్ధీకరిస్తాయి. తరచుగా చర్మానికి గాడిద పాలు రాసుకోవడం వల్ల స్కిన్ యవ్వనంగా, మరెంతో కాంతివంతంగా కనిపిస్తుంది. ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడవు.

అంతేకాదు గాడిదపాలల్లో చర్మాన్ని మ్రుదువుగా చేసే, చర్మానికి తేమను అందించే సుగుణాలు చాలా ఉన్నాయి. గాడిదపాలు స్కిన్ క్లీన్సర్ గా కూడా పనిచేస్తుంది. చర్మంపై పేరుకున్న మురికి, మట్టిలను పోగొట్టి చర్మ సహజ మెరుపు దెబ్బతినకుండా గాడిదపాలు సంరక్షిస్తాయి.

చర్మం పొడారినట్టు, సాగినట్టయినా, ముడతలు పడినా వాటిని తగ్గించడంలో గాడిదపాలు బాగా పనిచేస్తాయి. వయసు కనిపించకుండా మనల్ని నవయవ్వనంగా కనిపించేలా కూడా ఈ పాలు చేస్తాయి. సూర్యరశ్మి బారిన ఎక్కువ పడడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు పడి వయసు మీదపడినట్టు కనిపిస్తాం. గాడిదపాలలోని రకరకాల విటమిన్లు, మినరల్స్ చర్మంపై సూర్యరశ్మి దుష్ఫలితాలు పడకుండా
కాపాడతాయి. యాక్నే, ఎగ్జిమా, ఇతర చర్మ రోగాలు తలెత్తకుండా అడ్డుకొంటూ యవ్వనంగా కనిపించేలా గాడిదపాలు మనల్ని సంరక్షిస్తాయి. గాడిదపాలల్లో సహజసిద్ధమైన హైడ్రైన్ట్ గుణాలు ఉన్నాయి. అందుకే
ఈ పాలు మనలో డీహైడ్రేషన్ తలెత్తకుండా కాపాడతాయి. చర్మం బాగా హైడ్రేటెడ్ గా ఉంటే బ్యూటీ క్రీములు, యాంటీ ఏజింగ్ క్రిములు, మాయిశ్చరైజర్ వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభవాలు మనలో తొందరగా తలెత్తవు.

అంతేకాదు బాగా హైడ్రేటెడ్ గా ఉన్న స్కిన్ మెరుస్తూ ఉంటుంది. చర్మ కణాలు దెబ్బతినడం వల్ల కూడా వయసు మీదపడినవారిలా కనిపిస్తాం. గాడిదపాలల్లోని పోషకాల వల్ల చర్మం అలా అవకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పాలల్లోని న్యూట్రియంట్లు చర్మ కణాలను పునరుద్ధరిస్తాయి. ముందరే చెప్పుకున్నట్టు గాడిదపాలల్లోని రెటినాల్ యాంటి ఏజింగ్ పదార్థంగా పనిచేస్తుంది. గాడిదపాలతో చేసిన ఆర్గానిక్ సోప్స్ కూడా నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిత్యం వాడడం వల్ల ప్రిమెచ్యూర్ ఏజింగ్ బారిన పడము. చర్మం యవ్వన మెరుపును కోల్పోదు కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News