Tea Snacks: వర్షాకాలంలో ఒక కప్పు టీ, పకోడీలు తినడానికి ఎంతో ఇష్టపడుతాం. చల్లటి వాతావరణం కారణంగా ఈ సీజన్ లో తరచుగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ముఖ్యంగా టీతో పాటు పకోడీలు కూడా తింటాం. ఇవి ఎంతో టేస్టీ గా అనిపించినా ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తాయి. టీ, పకోడీలు మాత్రమే కాకుండా టీతో పాటు అనేక ఇతర ఆహారాలను తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో వర్షాకాలంలో టీ తో పాటు తినకూడని 5 ఆహారాల గురించి తెలుసుకుందాం.
టీ, పకోడీలు
టీతో పాటు తినడానికి పకోడీ బెస్ట్ కాంబినేషన్. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా మంది తరచుగా టీ, పకోడీలను తినడానికి ఆసక్తి చూపుతారు. అయితే, ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది. పకోడీలు వేయించిన ఆహారం కాబట్టి టీతో తినడం వల్ల లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీని కారణంగా అనేక చర్మ వ్యాధులు కూడా రావొచ్చు.
Also Read: Shocking Video: జలపాతం దగ్గర లవ్ ప్రపోజ్.. ఆనందపడే లోపే అనుహ్య సంఘటన..
టీ, బిస్కెట్
ఇప్పటివరకు టీ, బిస్కెట్‌లను ఉదయం తినని వారు అంటూ ఎవరు ఉండరు. చాలా మంది ఇది అల్పాహారానికి సరైన ఎంపికగా పరిగణిస్తారు. కానీ ఈ కలయిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దానిలో దాగి ఉన్న శుద్ధి చేసిన చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్ క్రమంగా ఊబకాయం, మధుమేహం వైపు నెట్టివేస్తాయి.
టీ, టోస్ట్
బిస్కెట్లు మాత్రమే కాదు.. చాలా మంది టీతో టోస్ట్ ను కూడా తినడానికి ఇష్టపడతారు. అయితే, ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా హానికరం. ఎందుకంటే టీ, ప్రాసెస్ చేసిన బ్రెడ్ బిపి సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. గరం టీ, టోస్ట్ కలిసి నరాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి.
టీ, బ్రెడ్
టీ-బ్రెడ్ అనేది ఒక సాధారణ కాంబినేషన్. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వీటిని తరచుగా తింటాం. చాలా మంది వీటిని అల్పాహారంగా తింటున్నారు. అయితే, ఈ రెండూ ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. వీటిని కలిపి తినడం వల్ల ఆమ్లత్వం, కడుపు చికాకు కలుగుతుంది.


