Friday, September 20, 2024
Homeహెల్త్Eat this for hair growth: ఇవి తింటే మీ జుట్టు పట్టే

Eat this for hair growth: ఇవి తింటే మీ జుట్టు పట్టే

ప్రొటీన్, జింకు, సల్ఫర్, ఐరన్, సెలెనియం, ఎలిమెంట్స్

శిరోజాలు ఊడిపోతున్నాయా? వెంట్రుకలు పెరగాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఏమీ ఆందోళన పడకండి. జుట్టు పెరగడానికి ఉపయోగపడే ఫుడ్స్ మనకు ఎన్నో ఉన్నాయి. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోతే మీ జుట్టు ఆరోగ్యంగా ఉండదు. కేరట్, గుడ్లు , ఆకుకూరలు వంటివి
మీ జుట్టును హెల్దీగా, సిల్కీగా ఉంచుతాయి.

- Advertisement -

కెరటిన్ ఒక ప్రొటీన్ . దీని వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి. డైట్ ద్వారా ప్రొటీన్ ను సరైన పాళ్లల్లో నిత్యం తీసుకుంటే మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా, పట్టులా తయారవుతుంది. పైనాపిల్ కూడా వెంట్రుకలకు ఎంతో మంచిది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సమతులాహారం. ప్రొటీన్లు దీంట్లో ఎక్కువగా
ఉంటాయి. అలాగే ఎసెన్షియల్ మినరల్స్త్, విటమిన్లు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఈ పండు జుట్టు పెరగడానికి తోడ్పడడమే కాకుండా జుట్టు రాలిపోకుండా కూడా సంరక్షిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పట్టులాంటి వెంట్రుకలు కావలనుకునేవారంతా ఈ పండును తినొచ్చు.


చేపలు కూడా జుట్టు పెరుగుదలకు ఎంతో తోడ్పడతాయి. వీటిల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. సాల్మన్, మకెరల్, ట్యునా, సార్డినెస్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండడమే కాదు ఇవి మీకు సహజసిద్ధమైన నూనెను శరీరానికి, మాడుకు అందిస్తాయి. అంతేకాదు జుట్టును పట్టులా కనిపించేట్టు చేస్తాయి. ఆల్మండ్స్, వాల్ నట్స్, హేజల్ నట్స్, జీడిపప్పులు, గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ గింజలు, అవిశె గింజల్లో ఒమేగా 3 ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్ లో విటమిన్ ఇ, బయొటిన్ లు సైతం పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టును సూర్యకాంతి ప్రభావానికి లోనుకాకుండా కాపాడతాయి. అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని పరిరక్షించుకోవడానికి సన్ స్క్రీన్ రాసుకుంటాం. మరి వెంట్రుకలకు ఎలా అనే సందేహం చాలామందికి సహజంగానే వస్తుంది.

వాల్ నట్స్ లో ఉండే బయొటిన్ జుట్టు రాలిపోకుండాvనిరోధిస్తుంది. అంతేకాదు వాల్ నట్స్ లో కాపర్ ఉంటుంది. ఇది వెంట్రుకల సహజసిద్ధమైన రంగును కాపాడడమే కాకుండా వెంట్రుకలను మెరిసేలా చేస్తుంది కూడా. ఆకుకూరలు, కూరగాయలు జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకుకూరలు, పిస్తోచి, వైట్ బీన్స్, సోయా, నట్స్, ఆప్రికాట్స్, అత్తిపళ్లు వంటి వాటిల్లో ఐరన్ బాగా ఉంటుంది. ఇవి జుట్టు రాలకుండా, వెంట్రుకలు చిట్లకుండా సంరక్షిస్తాయి. అందుకే వీటిని కూడా మీ డైట్ లో ఉండేట్టు జాగ్రత్తపడాలి. అలాగే కారట్లు అనగానే కళ్లకు ఎంతో మంచిది అని అందరం గుర్తుచేసుకుంటాం. కానీ కారట్లు వెంట్రుకల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. కారట్లలో బీటాకెరొటెనె ఎక్కువగా ఉంటుంది.


మీ శరీరంలోని ఏ కణం కూడా విటమిన్ ఏ లేకుండా పనిచేయదు. అందుకే మీ డైట్ లో తప్పనిసరిగా విటమిన్ ఎ ఉండేట్టు చూసుకోవాలి. విటమిన్ ఎ లోపం వల్ల జుట్టు బాగా రాలిపోతుంది. పలచబడుతుంది. బట్టతల సమస్య కూడా తలెత్తుతుంది. పండ్లు, కూరగాయలు కాకుండా విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న వాటిల్లో చిలకడదుంపలు, గుమ్మడి కాయ, మామిడిపండ్లు, అత్తిపళ్లు కూడా ఉన్నాయి. గుడ్లు తినడం
ఎంతో ఆరోగ్యకరం. వీటిల్లో జింకు, సల్ఫర్, ఐరన్, సెలెనియం వంటి ముఖ్యమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆరోగ్యకరమైన శిరోజాలకు ఇవి ఎంతైనా అవసరం. గుడ్లల్లో విటమిన్ బి7, బయొటిన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును బాగా పెరిగేలా చేస్తాయి.

లీన్ మీట్, పౌల్ట్రీ, ఓస్టెర్స్ లో కూడా ఇవి పుష్కలంగా ఉంటాయి. శిరోజాల సమస్యలకు పెరుగు బాగా పనిచేస్తుంది. ఇందులో బి12, ప్రొటీన్, ఐయొడిన్, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. ప్రొబయొటిక్ పెరుగు వల్ల ఒత్తైన, నల్లని నిగనిగలాడే వెంట్రుకలు మీ సొంతమవుతాయి. లో స్కిమ్డ్ మిల్క్, కాటేజ్
చీజ్, లో ఫ్యాట్ చీజ్, పెరుగులు జుట్టు కుదుళ్లను గట్టిగా ఉండేలా మెరుగుపరుస్తాయి. పెరగును వెంట్రుకలకు రాసుకోవడం లేదా మజ్జిగ లాగ తాగడం రెండూ కూడా శరీరానికి ఎంతో మంచి చేస్తాయి. జుట్టు వేగంగా పెరగడానికి కూడా పెరుగు ఎంతో దోహదపడుతుంది. అందుకే నిత్యం మీ డైట్ లో పెరుగు ఉండేలా చూసుకోవాలి. బెర్రీలు కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని బాగా కాపాడుతాయి. ఇందులో విటమిన్
సి పుష్కలంగా ఉంటుంది. బ్లాక్ రాస్పెబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాబినా ఎక్స్ ట్రాక్ట్స్ జుట్టును పెరిగేట్టు చేయడమే కాకుండా వెంట్రుకలు రాలిపోకుండా కూడా పనిచేస్తాయి.

బీన్స్, పప్పులు నిత్యం తినడం వల్ల జుట్టు ఎంతో ఆరోగ్యంగా తయారవుతుంది. బీన్స్, పప్పులు రెండూ ప్రొటీన్ రిచ్ . వీటిల్లో బయొటిన్ బాగా ఉంటుంది. ఇది లోపిస్తే జుట్టు చిట్లుతుంది. జుట్టు పెరుగుదలకు
ప్రొటీన్ డైట్ ఉంటే వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడమే కాదు బాగా పెరుగుతాయి కూడా. జుట్టు పెరగాలంటే రొయ్యలు కూడా తినాలి. రొయ్యల్లో ప్రొటీన్లతో పాటు యాంటాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు వీటిల్లో విటమిన్ బి12, జింకు, ఐరన్ కూడా ఎక్కువే. ఇవి జుట్టు చిట్లకుండా
సంరక్షిస్తాయి. నీళ్లు బాగా తాగడం వల్ల చర్మం, మాడు ఎంతో హైడ్రేటెడ్ గా ఉంటాయి. అలా జుట్టుకు సహజసిద్ధమైన మాయిశ్చర్ ని అందిస్తాయి. మీరు నిత్యం తీసుకునే డైట్ లో ఈ ఆహారపదార్థాలు ఉంటే మీ జుట్టు అందంగా, సిల్కీగా, ఆరోగ్యంగా ఉండి చూపరులను ఇట్టే ఆకర్షిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News