White Rice Side Effects: వైట్ రైస్ ఆసియా దేశాల వారికి ఒక ప్రధాన ఆహారం. ఇందులో అనేక పోషకాలు ఉండటం వల్ల దీనిని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అయితే వైట్ రైస్ ను రోజువారీగా తినడం వల్ల శరీరంలో కలిగే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రౌన్ రైస్‌తో పోలిస్తే వైట్ రైస్‌లో తక్కువ పోషక విలువలు ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వైట్ రైస్‌లో ఉండే ఊక (bran), బీజం (germ) తొలగిస్తారు. వీటిలోనే అధిక శాతం ఫైబర్, విటమిన్ వంటి ఇతర పోషకాలు ఉంటాయి. వీటిని తొలగించడం వల్ల వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్లు మాత్రమే మిలుగుతుంది.
వైట్ రైస్ తినడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి:
1. షుగర్ లెవల్స్ పెరుగుతాయి:
ఆరోగ్యనిపుణుల ప్రకారం, వైట్ రైస్ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు. ఇందులో అధిక శాతం గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్ లెవల్స్‌ను వేగంగా పెంచుతుంది. అంతేకాకుండా టైప్- 2 డయాబెటిస్ కు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. డయాబెటిస్ లేనివారు వైట్ రైస్ తినడం వల్ల చిరాకు, అలసట, ఏకాగ్రత దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
2. విటమిన్ లోపం:
వైట్ రైస్ లో పోషకాలు తక్కువగా ఉంటాయి కాబట్టి విటమిన్ బి, ఫైబర్, మెగ్నీషియం లోపాలు కలుగుతాయి. అంతేకాకుండా దీని వల్ల బెరిబెరి వంటి వ్యాధులకు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి వైట్ రైస్ బదులుగా మీ ఆరోగ్యానికి, శరీరానికి సరిపోయే రైస్‌ను ఎంచుకోవడం మంచిది.
3. అధిక బరువు:
వైట్ రైస్‌లో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల అతి తినాలనిపించే కోరిక పెరుగుతుంది. దీని వల్ల సులభంగా బరువు పెరుగుతారు. బరువు తగ్గాలనుకునేవారు వైట్ రైస్ తక్కువగా తీసుకోవడం మంచిది.
4. జీర్ణ సమస్యలు:
వైట్ రైస్ లో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థత దెబ్బతింటుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు దారి తీస్తుంది. వైట్ రైస్ బదులుగా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే రైస్‌ను ఎంచుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి.
ALSO READ: https://teluguprabha.net/news/these-super-foods-that-repair-your-liver-health/
రోజు వైట్ రైస్ తినేవారు దీనికి బదులుగా బ్రౌన్ రైస్, ఓట్స్, చిరుధాన్యాలు వంటి ఆహారంలో చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో అధికశాతం విటమిన్‌లు, మినరల్స్, ఇతర పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరాని దృఢంగా తయారు చేస్తాయి. అన్నంతో పాటు పప్పు , ఆకుకూరలు, కూరగాయాల కూడా చేర్చుకోవడం మంచిది. దీంతో పాటు ప్రోటీన్ కలిగిన ఆహారపదార్థాలు తినడం ఎంతో మేలు. ముఖ్యంగా చేపలు, గుడ్లు తింటే ప్రోటీన్ కంటెంట్ శరీరానికి లభిస్తుంది.


