జలుబు వచ్చినప్పుడు ముక్కు కారడం సహజం. ఇలా అయినప్పుడు తుమ్ములు రావడం కూడా మామూలు విషయమే. దీనితో పాటు దుమ్ము, అలెర్జీలు కారణంగా కూడా తుమ్ములు వస్తుంటాయి. మీరు సాధారణంగా తుమ్మినప్పుడు ముక్కు మరియు నోటిని చేతితో మూసుకుంటూ ఉంటారు. ఈ కథనంలో ఇలా చేయడం వలన జరిగే అనర్థమేంటో తెలుసుకుందాం. కరోనా తర్వాత ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రజలు తుమ్మినప్పుడు నోరు, ముక్కును గట్టిగా మూసుకోవడం ప్రారంభించారు. దీని వెనుక మంచి ఉద్దేశ్యమే ఉంది. తుమ్మినప్పుడు తమ చుట్టుపక్కల వారికి ఎలాంటి వ్యాధి వ్యాపించకుండా ఇలా చేయడం ప్రారంభించారు. అయితే ఇది చాలా డేంజర్ అంట.
తుమ్మినప్పుడు ముక్కును టిష్యూ పేపర్ లేదా గుడ్డతో కప్పుకోవడం సర్వసాధారణం. అప్పుడే మీ ముక్కులోని వైరస్‌లు పక్కవారికి సోకకుండా ఉంటుంది. కానీ నిపుణులు అభిప్రాయం ప్రకారం, తుమ్మినప్పుడు మీ ముక్కు, నోటిని ఎప్పుడూ గట్టిగా కప్పుకోకూడదంట. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. తుమ్మినప్పుడు నోటిని మూసుకునే అలవాటు మీకు ఉంటే, వెంటనే అలా చేయడం మానేయండి. ఎందుకంటే ఇలా చేయడం మీ చెవులకు చాలా ప్రమాదకరం. ఇలా చేసినప్పుడు, ముక్కులోని శ్లేష్మం చెవి లోపల చిక్కుకుపోతుంది. ఓ అధ్యయనం దీనిని తెలిపింది.
20 నుండి 55 సంవత్సరాల వయస్సు గల వారు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఇందులో 28 శాతం మంది ప్రజలు తమ చెవులు పగలడానికి ప్రధాన కారణం తుమ్మినప్పుడు నోరు కప్పుకోవడం అని నివేదించారు. తుమ్ములు సహజమైన చర్య అని నిపుణులు అంటున్నారు. దానిని అణచివేయడం లేదా నివారించడం శరీరానికి హానికరం. తుమ్మడం వల్ల ముఖం మీద ఒత్తిడి పడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ ముక్కు మరియు నోటిని కప్పుకుంటే, అది మీ వినికిడి సామర్థ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీన్ని కొనసాగించడం వల్ల మీ వినికిడి శక్తిపై ప్రభావం పడుతుంది. కాబట్టి తుమ్ముతున్నప్పుడు ఎప్పుడూ నోటిని మూసుకోకండి అని నిపుణులు అంటున్నారు.
మీకు చెవి సమస్యలు ఉంటే, అంటే అకస్మాత్తుగా చెవి నొప్పి, చెవిలో ఒత్తిడి, వినికిడి లోపం, ద్రవం లీకేజ్ లేదా చెవి నుండి రక్తస్రావం, లేదా నిరంతర మైకము వంటి సమస్యలు ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కానీ ఇంట్లో నే చికిత్స చేసుకోవడానికి ప్రయత్నించకండి. అలాగే మీ చెవుల్లో నూనె లేదా మరే ఇతర ద్రవాన్ని పోయకండి. అదే సమయంలో, చెవులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. చెవులను దుమ్ము నుండి రక్షించాలి. మీకు ఏవైనా చెవి సమస్యలు ఉంటే, వైద్యుడి సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)