Saturday, November 23, 2024
Homeహెల్త్Floral treatment: చర్మం సాగకుండా మాయ చేసే పూలు

Floral treatment: చర్మం సాగకుండా మాయ చేసే పూలు

చమోలి మాస్క్ వేసిన ఐదు నిమిషాలు తర్వాత చూస్తే.. మీ చర్మం ఎంతో సాఫ్ట్ గా, అందంగా, క్లీన్ గా ఉంటుంది

అందమైన పూల సోయగాలను .. అపూర్వమైన వాటి పరిమళానికి మైమరిచిపోని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే .. పూలు అందంగా , ఆకర్షణీయంగా ఉండి సువాసనలను వెదజల్లడమే కాదు అద్భుతాలను కూడా చేస్తాయి. స్త్రీల సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేయడంలో పూలను మించిన ఆయుధం ఈ ప్రపంచంలో మరోటి లేదు. అందుకే, సువాసన గల పూలని కాస్మెటిక్స్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. పౌడర్‌తో పాటు అనేక బ్యూటీ ప్రొడక్ట్స్‌లో పూలను ఉపయోగించడం వల్ల మంచి సువాసన వస్తుంది. ఆయుర్వేదంలో పూలని ఐదు వేల నాటి సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఎలా అయితే మూలికలు ఆయుర్వేదంలో పని చేస్తాయో అలానే పూలు కూడా మనకి బెనిఫిట్స్ కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. పూలలో యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయని అంటున్నారు. ఈ రోజుల్లో చాలా బ్యూటీ ప్రొడక్ట్స్‌లో సహజసిద్ధమైన పదార్థాలని వాడుతున్నారు. దీంతో, పూల వినియోగం కూడా ఎక్కువైంది. పూలను ఉపయోగించడం వల్ల చర్మానికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. మాయిశ్చరైజర్ కూడా అందుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.అంతేకాదు చర్మం సాగకుండా అడ్డుపడతాయి.
బటర్‌ ఫ్లై పీ లేదా అపరాజి
సాధారణంగా ఈ పూలను అపరాజిత అంటారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. చర్మం సాగిపోకుండా చూస్తుంది. అదే విధంగా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. స్కిన్ సమస్యలు తొలగిస్తుంది. చర్మంపై ఎరుపుదనం కలిగినా కూడా ఇది పోగొడుతుంది. అదే విధంగా చర్మం పొడిబారి పోయినా కూడా ఇది ఉపయోగ పడుతుంది. ఇరిటేషన్‌లాంటివి కూడా సులువుగా ఈపూలు పోగొడతాయి.
చర్మం మాయిశ్చర్‌గా ఉండేటట్టు ఇది చూస్తుంది. ఈ పూలలో హెర్బల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదే విధంగా మంచి పోషక పదార్థాలు కలిగి ఉంటాయి. అయితే దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే… ముందుగా ఒక టేబుల్ స్పూన్ అపరాజిత పొడిని తీసుకుని దానిలో కెలెన్‌ క్లేఒక టేబుల్ స్పూన్ తీసుకుని కలపాలి. దీనిలో కొద్దిగా రోజ్ వాటర్ కూడా వేసి ఒక మెత్తని పేస్ట్ లాగ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసుకుని పది నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత ముఖం కడిగేసుకుంటే చాలు. ఏ చర్మం వాళ్లకి అయినా సరే ఇది సూట్ అయిపోతూ ఉంటుంది. మంచి క్లెన్సింగ్‌తో పాటు చర్మం ఎంతో అందంగా ఉంటుంది.

- Advertisement -


బంతి పూలు
బంతి పూల వల్ల మంచి సువాసన కూడా వస్తుంది. భారతదేశంలో వీటిని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. చర్మానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. దీనిని క్యాలెండ్యూలా అని కూడా అంటారు. చలి కాలంలో దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. క్యాలెండ్యూలా ఆయిల్‌ని కూడా తయారు చేస్తూ ఉంటారు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.చర్మానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. చర్మానికి మంచి బెనిఫిట్స్ కలగాలంటే.. అర కప్పు బంతి పూలను తీసుకుని ఒకటిన్నర కప్పు నీళ్లలో వేసి మరిగించాలి. ఆ తర్వాత వచ్చే నీళ్ళని తీసేసి ఆ రేఖలని పిల్లలకి స్నానం చేయించడానికి వాడొచ్చు. ఒక వేళ ఏమైనా కీటకాలు కుట్టిన దానికి ఇది బాగా సహాయం చేస్తుంది. ఆ పూరేకులతో మెత్తని పేస్ట్ చేసి ముఖానికి పట్టించి మాస్క్ వేసుకుంటే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. సాగిపోయిన ముఖం కూడా టైట్ అవుతుంది.
మల్లె పూలు
మల్లె పూలలో మంచి సువాసన ఉంటుంది. నిజంగా మల్లెల వాసనకి ఎవరైనా ఫిదా అవుతారు. కాస్మెటిక్స్ వంటి వాటిల్లో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫేస్ క్రీమ్స్, బాడీ లోషన్, సబ్బులు, ఆయిల్స్ మొదలైన వాటిలో కూడా దీనిని ఎక్కువగా వాడతారు.ఇంట్లోనే జాస్మిన్ స్ప్రేని సులువుగా తయారు చేసుకోవచ్చు కూడా. కొద్దిగా మల్లె పూలు తీసుకొని మినరల్ వాటర్‌లో వేసి ఆ తరువాత వాటిని వడగట్టి స్ప్రే బాటిల్‌లో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచి… దానిని ప్రతి రోజు వాడొచ్చు. ఇలా ముఖానికి దానిని స్ప్రే చేస్తూ ఉంటే ఆ తర్వాత చర్మంలో కలిగే మార్పు గుర్తించండి.


పాన్సే
ఒక కప్పు ఈ పూలని మరియు కొద్దిగా ఆకుల్ని తీసుకుని ఒక లీటర్ నీళ్ల లో వేసి మరిగించాలి ఆ తర్వాత వీటిని అన్నిటినీ వడకట్టుకోవాలి. ముఖంపై పింపుల్స్ ఎక్కువగా ఉంటే వీటిని పేస్ట్ చేసుకుని అప్లై చేసుకోండి. దీంతో మీకు చల్లగా అనిపిస్తుంది, మంచి రిలీఫ్ కూడా ఉంటుంది. ఇలా ఈ పూలని ఉపయోగించి మంచి రిలీఫ్ పొందొచ్చు.
చమోలి
చమోలిలో కూడా మంచి అద్భుతమైన గుణాలు ఉంటాయి. . చమోలిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మరియు యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మం మీద ఎరుపు మచ్చలున్నా .. చర్మ సమస్యలున్నా తగ్గిస్తుంది. చమోలి ఎక్కువగా ఇది పౌడర్ రూపంలో లభ్యమవుతుంది. దానిని మీరు డైరెక్టుగా అప్లై చేసుకోవచ్చు. ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే చమోలి టీ చేసి నాలుగు చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ దానిలో వేసి కాటన్ ప్యాడ్‌ని ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి వాడొచ్చు. చమోలి మాస్క్ వేసిన ఐదు నిమిషాలు తర్వాత చూస్తే.. మీ చర్మం ఎంతో సాఫ్ట్ గా, అందంగా, క్లీన్ గా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News