Saturday, November 23, 2024
Homeహెల్త్Grey hair removal: తెల్లవెంట్రుకలు పోవాలంటే?

Grey hair removal: తెల్లవెంట్రుకలు పోవాలంటే?

ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజసిద్ధమైన టిప్స్

తెల్లవెంట్రుకలను పోగొట్టుకోవడానికి కొన్ని సహజ చిట్కాలు ఉన్నాయి. ఆమ్లా ఉన్న కొబ్బరినూనెతో మాడును మసాజ్ చేసుకుని 45 నిమిషాల పాటు వదిలేస్తే తలలోని తెల్లవెంట్రుకలు తగ్గుతాయి. ఇందుకు మూడు నుంచి ఐదు ఉసిరికాయలు, ఒక కప్పు కొబ్బరినూనె తీసుకోవాలి. ఒక కప్పు కొబ్బరినూనెలో ఈ ఉసిరికాయలను ఉడకబెట్టి చిక్కని నూనెలా తయారుచేయాలి. దీన్ని ఒక జార్ లో భద్రం చేసి రెండు టేబుల్ స్పూన్ల నూనెను తలకు పట్టించుకుంటుండాలి. దీన్ని మాడుపై బాగా మసాజ్ చేయాలి. రోజు మార్చి రోజు రాత్రి నిద్రపోయేముందు ఈ నూనెను రాసుకుని పడుకోవాలి. ఈ నూనెతో 15 నిమిషాలు వెంట్రుకలకు మసాజ్ చేసకున్న తర్వాత మరో అరగంటపాటు వెంట్రుకలను అలాగే వదిలేయాలి. తర్వాత సల్ఫేట్ లేని షాంపుతో తలను రద్దుకొని తర్వాత వెంట్రుకలకు కండిషనర్ పెట్టుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

- Advertisement -

ఒక కప్పు బ్లాక్ టీ తీసుకుని దాన్ని జుట్టుకు పట్టిస్తే కూడా తలలోని తెల్లవెంట్రుకలు తగ్గుతాయి. బ్లాక్ టీలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీరాడికల్స్ వెంట్రుకలను దెబ్బతీయకుండా ఇవి కాపాడతాయి. చిన్న వయసులోనే తెల్లవెంట్రుకల బారిన పడకుండా బ్లాక్ టీ పరిరక్షిస్తుంది. వెంట్రుకలను నిగ నిగలాడేట్టు చేస్తుంది. బ్లాక్ టీ మిమ్మల్ని ఒత్తిడి నుంచి సైతం బయటపడేస్తుంది. దీంతో తెల్లజుట్టు సమస్య తలెత్తదు. ఇది తయారుచేయడానికి రెండు టేబుల్ స్పూన్ల బ్లాక్ టీ, ఒక కప్పు నీళ్లు తీసుకుని తీసుకోవాలి. వీటిని ఉడికించి చల్లారనివ్వాలి. తర్వాత దాన్ని ఒడగట్టి వెంట్రుకలకు, మాడుకు పెట్టుకొని రెండు నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత గంటసేపు వెంట్రుకలను అలాగే వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి సల్ఫేట్ లేని షాంపుతో తలను రుద్దుకొవాలి. చివరలో జుట్టుకు కండిషనర్ పెట్టుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

మాడుకు కరివేపాకు, కొబ్బరి నూనె మిశ్రమాన్ని రాసుకుని 45 నిమిషాలు అలాగే వదిలేసినా కూడా తెల్లజుట్టు తగ్గుతుంది. కరివేపాకు ఆకులు జుట్టు సహజ టోన్ ను పరిరక్షిస్తాయి. జుట్టు తొందరగా తెల్లబడకుండా కాపాడతాయి. కొబ్బరినూనె జుట్టు కుదుళ్ల వరకూ ఇంకి జుట్టును నిగనిగలాడేట్టు చేయడమే కాకుండా వెంట్రుకలు బాగా పెరిగేలా కూడా చేస్తుంది. ఇందుకోసం గుప్పెడు కరివేపాకు ఆకులు, మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె రెడీ పెట్టుకోవాలి. మొదటగా కరివేపాకు ఆకులను కొబ్బరినూనెలో వేసి బాగా ఉడికించి ఆయిల్ సొల్యూషన్ గా చేయాలి. దాన్ని చల్లార్చాలి. చల్లారిన దానిని వడగట్టి మాడుకు దానితో మసాజ్ చేయాలి. జుట్టుకు కూడా దాన్ని పట్టించాలి. పది హేను నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత వెంట్రుకలను అరగంట పాటు వదిలేయాలి. రోజు మార్చి రోజు రాత్రి తలకు ఈ నూనె పెట్టుకుని ఉదయం వరకూ వదిలేయాలి. పొద్దున్న లేచిన తర్వాత మైల్ఢ్ సల్ఫేట్ ఫ్రీ షాంపుతో తలను రద్దుకుని తలకు కండిషనర్ పెట్టుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు పెట్టుకుంటే వెంట్రుకలకు మంచిది.


మాడుకు కొబ్బరినూనె, నిమ్మరసాలను కలిపి రాసుకుని అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల తలలోని తెల్లవెంట్రుకలు పోతాయి. నిమ్మకాయలో విటమిన్ సి బాగా ఉంటుంది. ఇది ఎంతో శక్తివంతమైన యాంటాక్సిడెంట్. ఫ్రీరాడికల్స్ ను ఇది న్యూట్రలైజ్ చేస్తుంది. జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను రెడీ పెట్టుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెలో రెండుటీస్పూన్ల నిమ్మరసం పోసి ఆ మిశ్రమాన్ని రెండు సెకన్లపాటు వేడిచేసి కొద్దిగా గోరువెచ్చగా కాగానే కిందికి దించాలి దానితో మాడు, వెంట్రుకలకు బాగా మాసాజ్ చేయాలి. తర్వాత అరగంటపాటు అలాగే వదిలేయాలి. తర్వాత మైల్డ్ సల్ఫేట్ ఫ్రీ షాంపుతో తలను రుద్దుకుని చివరలో కండిషనర్ ను తప్పకుండా పెట్టుకోవాలి.


ఆముదం, ఆవ నూనెలను కలిపి మాడుకు రాసుకుని 45 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల కూడా తలలో తెల్లవెంట్రుకలు ఉండవు. ఆముదం నూనె కుదుళ్ల వరకూ రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. ఇందులో ఒమేగా6 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ఇవి శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా జుట్టు నల్లగా నిగ నిగలాడేట్టు చేస్తాయి. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ ఆముదం నూనె, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఈ రెండింటినీ బాగాకలిపి రెండు నిమిషాలు వేడిచేయాలి. అది కాస్త గోరువెచ్చగా కాగానే కిందికి దించాలి. ఈ ఆయిల్ మిశ్రమాన్ని మాడుకు, జుట్టు చివళ్లకు బాగా పట్టించాలి. పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత వెంట్రుకలను అరగంట పాటు వదిలేయాలి. తర్వాత సల్ఫేట్ ఫ్రీ షాంపుతో తలను రుద్దుకొని కండిషనర్ పెట్టుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు జుట్టుకు పెట్టుకోవడం వల్ల తెల్లజుట్టు సమస్య పరిష్కారమవుతుంది.


నానబెట్టిన మెంతులను మెత్తగా చేసి ఆ పేస్టును మాడుకు రాసుకుని 45 నిమిషాలు వదిలేయడం వల్ల కూడా తెల్లవెంట్రుకల సమస్య పరిష్కారమవతుంది. మెంతుల్లో బి విటమిన్స్, సపొనిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు రాలకుండా కాపాడుతుంది. అంతేకాదు జుట్టు సహజరంగును సైతం కాపాడుతుంది. చుండ్రును పోగొడుతుంది. వెంట్రుకలను సిల్కీగా ఉంచుతుంది. ఇందుకు రెండు టేబుల్ స్పూన్ల మెంతులు, పావు కప్పు నీళ్లు రెడిగా పెట్టుకోవాలి. పావు కప్పునీళ్లల్లో మెంతులు నానబెట్టి రాత్రంతా వాటిని అలాగే ఉంచాలి. పొద్దున్న నానిన మెంతులను మెత్తగా గ్రైండ్ చేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును జుట్టుకు, మాడుకు బాగా పట్టించి 45 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయాలి.

ఉల్లిపాయ రసం, ఆలివ్ ఆయిల్ రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించి అరగంటపాటు వదిలేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు లో తెల్లవెంట్రుకలు రావు. ఇందుకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్, ఒక చీస్ క్లాత్ తీసుకోవాలి. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా చేసి ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్ తో కలిపి మెత్తగా చేయాలి. ఛీజ్ క్లాత్ ను ఉపయోగించి ఆ గుజ్జు నుంచి రసాన్ని పిండాలి. ఈ రసాన్ని మాడుకు పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత 35 నిమిషాల పాటు జుట్టును అలాగే వదిలేయాలి. తర్వాత మైల్డ్ సల్ఫేట్ ఫ్రీ షాంపుతో తలను రుద్దుకోవాలి. చివర్లో జుట్టుకు కండిషనర్ పెట్టుకోవడం మరవొద్దు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

హెన్నా, కాఫీ హెయిర్ ప్యాక్ ను మాడుకు, వెంట్రుకలకు పట్టించి అలాగే మూడు నుంచి నాలుగు గంటలు వదిలేయడం వల్ల కూడా తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది. హెన్నా రాసుకోవడం వల్ల తెల్లజుట్టు
కనపడదు. హెన్నా వెంట్రుకలకు ఎరుపు రంగు టోన్ ను ఇస్తే, మరో హెయిర్ కలరెంట్ అయిన కాఫీ బ్లాకిష్ బ్రౌన్ టోన్ ను జుట్టుకు ఇస్తుంది. రసాయనాలు లేని హెన్నా పొడిని వాడాలి. ఇందుకు ఐదు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి, ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి, ఒక కప్పు వాటర్ అవసరం అవుతాయి. కప్పు నీళ్లల్లో కాఫీ పొడి వేసి ఉడకబెట్టాలి. అందులో ఐదు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి వేసి ఉండగట్టకుండా మెత్తగా కలపాలి. ఆ పేస్టును మాడుకు, జుట్టుకు పట్టించి మూడు లేదా నాలుగు గంటలపాటు అలాగే వెంట్రుకలను వదిలేయాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తల కడుక్కుని మైల్డ్ సల్ఫేట్ ఫ్రీ షాంపుతో తలను రుద్దుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.


నువ్వుల నూనె, కొబ్బరినూనెలను కలిపి ఆ మిశ్రమంతో మాడును మసాజ్ చేసి 45 నిమిషాలు అలాగే వదిలివేయాలి. ఇలా చేయడం వల్ల కూడా తెల్లజుట్టు సమస్య పరిష్కారమవుతుంది. కొబ్బరినూనె కుదుళ్ల వరకూ ఇంకుతుంది. నువ్వుల నూనె జుట్టును నల్లగా నిగనిగలాడేట్టు చేస్తంది. ఇందుకు రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కావాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేలా వేడిచేయాలి. తర్వాత దాన్ని వెంట్రుకలుకు, మాడుకు పట్టించి పదిహేను నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత వెంట్రుకలకు టవల్ చుట్టి, దాన్ని అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత మైల్డ్ సల్ఫేట్ షాంపుతో తలను రుద్దుకుని చివర్లో కండిషనర్ పెట్టుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది.

అలాగే ఉసిరి, మందార పూవు పేస్టు రెండింటినీ బాగా కలిపి హెయిర్ ప్యాక్ గా వేసుకోవాలి. తర్వాత దాన్ని 45 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఈ మాస్కు జుట్టు కుదుళ్లను ద్రుఢం చేస్తాయి. అంతేకాదు శిరోజాలను బలిష్టంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చిన్నవయసులోనే తెల్లజుట్టు రాకుండా మందారం నిరోధిస్తుంది. దీనికి హెయిర్ కండిషనింగ్ గుణం కూడా ఉంది. దీన్ని తయారుచేయడానికి మూడు టేబుల్ స్పూన్ల మందార ఆకులు, మందార పువ్వులను తీసుకుని మెత్తగా చేయాలి. అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆమ్లా పొడి, నీళ్లు కూడా కావాలి. మందార ఆకులు,పువ్వులు రెండూ కలిపిన గుజ్జు, ఆమ్లా పొడి రెండింటినీ బాగా కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. అవసరమైతే అందులో కొద్దిగా నీరు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని మాడుకు, వెంట్రుకల చివరికంటా పట్టించి అలాగే 45 నిమిషాలు వదిలేయాలి. తర్వాత మైల్డ్ సల్ఫేట్ ఫ్రీ షాంపుతో తలను రుద్దుకోవాలి. చివర్లో వెంట్రుకలకు కండిషనర్ పెట్టుకోవడం మరవొద్దు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News