Sunday, July 7, 2024
Homeహెల్త్Healthy eating: ఆరోగ్యానికి ఆహారం

Healthy eating: ఆరోగ్యానికి ఆహారం

 క్యాబేజీలో ఉండే రసాయనాలు కడుపులోని అల్సర్ల నివారణకు తోడ్పడతాయి.
 ఎర్ర ఉల్లి శ్వాసనాళాలు సన్నబడకుండా ఉంచుతాయి. ఆస్తమా తగ్తించడంలో కూడా ఎంతగానో ఉపకరిస్తాయి.
 ఎముకలు విరిగిన్పడు, ఆస్టియో పొరాసిస్ నివారించడానికి పైనాపిల్ ఎంతో సహాయపడుతుంది.
 తేనె డిప్రషన్, యాంగ్జయిటీలను తగ్గిస్తుంది.
 భోజనం ప్రారంభంలోనే స్వీట్లను తింటే ఆహారం సరిగా జీర్ణంకాదు.
 పిప్పళ్లు (లాంగ్ పెప్పర్)ను పొడి చేసి తేనెతో కలుపుకుని ఉదయం, రాత్రి భోజనం చేసిన గంట తర్వాత తింటే బానపొట్ట తగ్గుతుంది. దీనివల్ల అధిక బరువు కూడా వేగంగా తగ్గుతారు. పేగుల్లోని పురుగులు నశిస్తాయి. పిప్పళ్ల కషాయం తాగడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. వాపులు ఉండవు. 500 మిల్లీ గ్రాముల పిప్పళ్ల పొడిని టీస్పూను నెయ్యిలో కలిపి తింటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
 ఉదయాన్నే పుదీనా ఆకులను నమిలి మింగితే ఊపిరితిత్తులకు మంచిది.
 భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే ఎసిడిటీ తగ్గుతుంది.

- Advertisement -

 వర్షంలో తడిసి గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు రెండు చెంచాల తులసిరసంలో చెంచా తేనె వేసి కలిపి తీసుకుంటే ఎంతో ఉపశమనాన్ని పొందుతారు.
 రోజూ రెండు ఉసిరికాయలు తింటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
 అత్తిపండ్లు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. చర్మం ఎర్రబారకుండా చేస్తాయి. మొటిమల్ని తగ్గిస్తాయి. అంతేకాదు అంజీర్ లోని పీచుపదార్థాల వల్ల తొందరగా ఆకలి వేయదు. వీటివల్ల అధిక బరువు సమస్య తగ్గుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News