Sunday, November 16, 2025
Homeహెల్త్Walnut: రోజుకు ఎన్ని వాల్ న‌ట్స్‌ను తినాలి..?

Walnut: రోజుకు ఎన్ని వాల్ న‌ట్స్‌ను తినాలి..?

Walnut Eating Tips: వాల్‌నట్స్ సూపర్‌ఫుడ్‌లుగా పరిగణిస్తారు. ఎందుకంటే వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ప్రతి రోజూ కొంత మొత్తంలో వాల్‌నట్స్ తింటే గుండె ఆరోగ్యం నుండి మెదడు పనితీరు వరకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, చాలామందికి వాల్‌నట్స్ ఏ సమయంలో, ఎలా తినాలో కూడా తెలియదు. దీంతో వాల్‌నట్స్ పూర్తి ప్రయోజనాలు లభించవు. అయితే, ఇప్పుడు వాల్‌నట్స్ తినడానికి బెస్ట్ టైమ్ ఏమిటి? ఎలా తినాలో తెలుసుకుందాం.

- Advertisement -

వాల్‌నట్స్ తినడానికి సరైన సమయం

ఉదయం ఖాళీ కడుపుతో వాల్‌నట్స్ తినడం అత్యంత ప్రయోజనకరం. ఇలా తింటే శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది. జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అయితే ఉదయాన్నే వాల్‌నట్స్ తినడానికి రాత్రిపూట 2-3 వాల్‌నట్స్‌ను నానబెట్టుకోవాలి.

నానబెట్టిన వాల్‌నట్‌ల ప్రయోజనాలు

నానబెట్టిన వాల్‌నట్‌లు శరీరంలో బాగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే టానిన్‌లు, ఎంజైమ్‌లు వాటిని జీర్ణం చేస్తాయి. దీనితో పాటు, నానబెట్టిన వాల్‌నట్‌లు తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. మెదడు సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. నానబెట్టడం వల్ల వాటిలో ఉండే పోషకాల శోషణ కూడా మెరుగుపడుతుంది.

Also Read: Papaya: ఖాళీ కడుపుతో బొప్పాయిని తింటే ఏమవుతుంది.?

రాత్రిపూట వాల్‌నట్‌లు ఎలా తినాలి?

రాత్రి పడుకునే ముందు 1-2 వాల్‌నట్‌లు తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, రాత్రిపూట ఎక్కువగా వాల్‌నట్‌లను తినకుండా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

పాలతో వాల్‌నట్స్ తినొచ్చా

వాల్‌నట్‌లను పాలతో కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో ఇలా తినడం ద్వారా శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అయితే, బరువు తగ్గడానికి వాల్‌నట్స్ తింటుంటే ఏమీ లేకుండా ఖాళీ కడుపుతో వాల్‌నట్‌లను తినడం ఉత్తమం.

ఎన్ని వాల్ న‌ట్స్‌ను తినాలి..?

రోజుకు 2 నుండి 4 వాల్‌నట్‌లు తినడం ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ పరిమాణంలో వాల్‌నట్‌లు తినడం వల్ల కేలరీలు పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad