Friday, September 20, 2024
Homeహెల్త్menopause: మెనోపాజ్ మహిళలూ చర్మ రక్షణకు ఇవి తప్పనిసరి

menopause: మెనోపాజ్ మహిళలూ చర్మ రక్షణకు ఇవి తప్పనిసరి

మెనోపాజ్ లోకి అడుగుపెట్టిన మహిళల్లో ఆరోగ్య పరంగా రకరకాల మార్పులు తలెత్తుత్తుంటాయి. వాటిల్లో బాగా కొట్టొచ్చినట్టు కనిపించే మార్పు శరీరం బరువు తొందరగా తగ్గకపోవడం ఒకటైతే, చర్మంలో మార్పులు కనిపించడం కూడా మరో ముఖ్యమైన విషయం. చర్మం ముడతలు పడడంతో పాటు ముఖంపై గీతలు ఏర్పడతాయి.

- Advertisement -

అంతేకాదు మెనోపాజ్ లోకి ప్రవేశించిన ఆడవాళ్లల్లో తొందరగా వయసు మీదపడ్డట్టు కనిపిస్తారు. అయితే వీళ్లు తమ అందాన్ని కోల్పోయామనో, మెనోపాజ్ లోకి ప్రవేశించామనో డిప్రషన్ కి లోనవసరం లేదు. చర్మం యంగ్ గా కనిపించేందుకు క్యూరేటెడ్ స్కిన్ కేర్ రిజీమ్ అనుసరిస్తే వీళ్లల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీని వల్ల ఆడవాళ్లల్లో వయసు మీద పడిన ఛాయలు కనిపించవు. మెనోపాజ్ దశలో శరీరంలో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల సిరామైడ్, కొల్లేజన్, హైలురోనిక్ ఆమ్లాల ప్రమాణాలు పడిపోతాయి. దీంతో చర్మం దెబ్బతింటుంది. శరీరంలో హైలురోనిక్ ఆమ్లం తక్కువైందంటే శరీరానికి కావలిసినంత హైడ్రేషన్ అందడంలేదని అర్థం. అందుకే మెనోపాజ్ టైములో చర్మం కాంతివిహీనంగా, పొడిగా, పగిలినట్టు, పొడారినట్టు కనిపిస్తుంది. దురదపెడుతుంటుంది. మెనోపాజ్ సమయంలో ముఖంపై అవాంఛిత రోమాలు కూడా వస్తాయి. యాక్నే సమస్య తలెత్తుతుంది. సన్ స్పాట్స్ ఏర్పడతాయి.

ఈ మహిళలు స్కిన్ కేర్ కోసం కొన్ని టిప్స్ పాటిస్తే వీటిని అధిగమించవచ్చు. ఈ దశలో ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలను లేజర్ హెయిర్ రిమూవల్ తో తొలగించుకోవచ్చు. లేదా షేవింగ్, ప్లక్కింగ్, ఎలక్ట్రోలిసిస్, స్పిరినోలాక్టోన్ వంటి పద్ధతుల్లో కూడా అవాంఛిత రోమాలను పోగొట్టుకోవచ్చు. రెటినాల్ వల్ల వయసుపైబడిన కణాల పనితీరు సైతం మెరుగుపడుతుంది.ఇది కణాలను వేగంగా పునరుత్పత్తి చేసి చర్మాన్ని పూర్వస్థితికి తీసుకురావడమే కాకుండా స్కిన్ టోన్ ని మెరిసేలా చేస్తుంది. యాక్నేను తగ్గిస్తుంది. అంతేకాదు కొల్లేజన్ ఉత్పత్తిని పెంచుతుంది. రెటినాల్ యాంటాక్సిడెంటుగా పనిచేయడమే కాకుండా ఫ్రీ రాడికల్ డ్యామేజిని అరికడుతుంది.

అలాగే సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. మెనోపాజ్ దశలో చర్మం తగినంత మాయిశ్చరైజింగ్ తో ఉండేలా చూసుకోవాలి. అందుకు నిత్యం మాయిశ్చరైజర్ ను చర్మానికి రాసుకోవాలి. అయితే పొడారినట్టు చేసే గుణం ఉన్న ఆల్కహాల్, సువాసన ద్రవ్యాలు లేని మాయిశ్చరైజర్లను మాత్రమే వీళ్లు వాడాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఇరిటేషన్, దురదలు తలెత్తవు. ఈ మాయిశ్చరైజర్లను రోజుకు రెండు సార్లు ముఖానికి, మెడకి, దవడలకు పట్టించాలి. అలాగే ఈ దశలో మహిళలు యంగ్ గా కనిపించాలంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి. ఈ వయసులో స్త్రీల శరీరంలోని హార్మోన్లలో తీవ్ర మార్పులు పొడసూపి చర్మంపై హాట్ ఫ్లాషస్ తలెత్తుతాయి. నిద్రలేమి సమస్యతో వీళ్లు బాధపడతారు. అందుకే మెనోపాజ్ లో ఉన్న మహిళలు హోల్-ఫుడ్స్ డైట్ తీసుకోవాలి. అంటే పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, త్రుణ ధాన్యాలు, నాణ్యమైన ప్రొటీన్లు ఉన్న ఫుడ్, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల మెనోపాజ్ లక్షణాలు మహిళల శరీరాన్ని బాధించవు. అలాగే ఈ వయసులోని స్త్రీలు నిత్యం చర్మం క్లీన్సింగ్ చేసుకోవడంతోపాటు సన్ స్క్రీన్ రాసుకుంటే మంచిదని చర్మ నిపుణులు చెప్తున్నారు. ఈ వయసులోని ఆడవాళ్లల్లో పొడారిపోయినట్టు కనిపించే చర్మానికి బాగా హైడ్రేటింగ్ గా అత్యావశ్యకం.

అలాగే జంటిల్, సోప్-ఫ్రీ క్లీన్సర్లను మాత్రమే వీళ్లు వాడాలి. మూసుకుపోయిన చర్మ రంధ్రాలు కూడా క్లీన్సింగ్ తో శుభ్రం అవుతాయి. చర్మం బాగా పొడారినట్టు అనిపిస్తే స్నానం చేసిన తర్వాత రోజంతా చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకుంటుండాలి. ఈ వయసువారికి హిలరోనిక్ ఆమ్లం, గ్లిజరిన్ మంచి మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. సలిసిలిక్ ఆమ్లం లేదా గ్లైకోలిక్ ఆమ్లం ఉన్న క్లీన్సర్లు కూడా మంచివంటున్నారు చర్మనిపుణులు. అయితే ఇవి అందరికీ సరిపడవని , అలాంటి వాళ్లు జంటిల్ క్లీన్సర్లను మాత్రమే వాడాలని కూడా వీరు హెచ్చరిన్తున్నారు. మెనోపాజ్ దశలో హార్మోన్లలో తలెత్తే మార్పుల వల్ల చర్మం రంగు తగ్గడంతోపాటు పిగ్మెంటేషన్ సమస్య కూడా తలెత్తుతుంది. స్కిన్ పిగ్మంటేషన్ ని పెప్టైడ్స్ తగ్గిస్తాయి. కాబట్టి ఇవి ఉన్న ప్రాడక్టులు వాడితే మంచిది. మెనోపాజ్ స్త్రీలు సీజన్లతో, వయసుతో, చర్మం టైపుతో సంబంధం లేకుండా నిత్యం చర్మంపై సన్ స్క్రీన్ రాసుకోవాలని చర్మ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వయసు స్త్రీలు తమ చర్మ రక్షణ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే ఈ సమయంలోనే కాన్సర్ లక్షణాలు ఆడవాళ్లల్లో తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు వీళ్లు స్కిన్ కాన్సర్ పాలబడే ప్రమాదం కూడా ఉంది. అందుకే మెనోపాజ్ దశలో ఉన్నవారు, దాన్ని దాటిన మహిళలు సైతం నిత్యం నిర్దిష్టమైన స్కిన్ కేర్ రేజీమ్ పాటించాలి. గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. సిరామైడ్స్,హెలురోనిక్ ఆమ్లం లేదా గ్లిజరిన్ ఉన్న క్లీన్సర్లను ఉపయోగించాలి. అలాగే ఈ మూడు రకాల మాయిశ్చరైజర్లను వాడాలి. ఎస్ పిఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ ను చర్మానికి రాసుకోవాలి.

సూర్యరశ్మిలో ఎక్కువ ఉండాల్సి వస్తే ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ ని చర్మానికి పట్టించుకోవాల్సి ఉంటుంది. రాత్రి పడుకోబోయేముందు పైన పేర్కొన్న క్లీన్సర్ , పెప్టైడ్స్ ఉన్న యాంటీ ఏజింగ్ ఉత్పత్తిని రాసుకుంటే మంచిది. రెటినాల్ ఉన్న ప్రాడక్టును రాత్రి పడుకోబోయేయుందు రాసుకోవడం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడవు. యాక్నే సమస్య కూడా రాదు. చర్మంపై తరచూ సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల చర్మం మెరుపు తగ్గకుండా ఉంటుంది. మెనోపాజ్ లో ఉన్న మహిళలు తమ స్కిన్ కేర్ రెజీమ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చర్మనిపుణులను సంప్రదించిన ఆతర్వాతే చర్మ సంరక్షణకు పూనుకోవడం మంచిదని మరవొద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News