నెటిల్ టీ, అది పంచే వైవిధ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసా? నిజంగానే అది అందించే ఆరోగ్య ప్రయోజనాలు తెలిసినపుడు ఆశ్చర్యం వేస్తుంది. నెటిల్ అనేది ఒక హెర్బ్. ఇందులో మెడిసెనల్ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
నెటిల్ టీ తాగడం వల్ల జీవక్రియ బాగా జరగడంతో పాటు రోగనిరోధక శక్తి బలపడుతుంది. మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. ఎలర్జీలు తగ్గుతాయి. ఇలాంటి మరెన్నో ఆరోగ్య లాభాలు నెటిల్ టీ వల్ల పొందుతాం. ఈ మూలికలో యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఇందులో కె, ఎ, బి, సి విటమిన్లతో పాటు కెరొటొనె, ఐరన్ లు కూడా బాగా ఉన్నాయి. మూత్రనాళంలోని ప్రమాదకర బాక్టీరియాను నెటిల్ టీ బయటకు పోయేలా చేస్తుంది. నొప్పులతో పాటు కండరాల బాధలను కూడా ఇది తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆర్త్రైటిస్ పై బాగా పనిచేస్తుంది.
ఆస్టియోపొరాసిస్ కు సంబంధించిన నొప్పులు, ఇన్ఫ్లమేషన్ ను సైతం నెటిల్ టీ నివారిస్తుంది. బ్లడ్ షుగర్ ప్రమాణాలను నియంత్రించడంలో కూడా నెటిల్ టీ ఎఫెక్టు బాగా కనిపిస్తుంది. నెటిల్ మొక్కలో పోలీఫెనాల్స్ అనే శక్తివంతమైన ప్లాంట్ కెమికల్స్ ఉన్నాయి. ఇవి ఇన్ఫమ్లేషన్ కు సంబంధించిన క్రానిక్ జబ్బులు అంటే కాన్సర్, డయాబెటిస్, గుండెజబ్బులు, ఊబకాయం వంటి వాటి ప్రివెన్షన్, మేనేజ్మెంట్లలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయి. నెటిల్ ఆకుల నుంచి తీసిన పోలీఫెనాల్స్ రొమ్ము కాన్సర్ చికిత్సలో, ప్రొస్టేట్ కాన్సర్ ట్రీట్మెంట్ లో బాగా తోడ్పడుతోంది. నెటిల్ మొక్కలో యాంటాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఏజింగ్ నుంచి, కణాలు దెబ్బతినకుండా కూడా మనల్ని సంరక్షిస్తాయి. అలాగే మలబద్దకం, డయేరియా వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. నెటిల్ టీ తాగితే కండరాల నొప్పులు తగ్గుతాయి. కీళ్లనొప్పులు తగ్గుతాయి. తలనొప్పి కూడా తగ్గుతుంది. మోకాళ్లు, చేతులు, వెన్నుముకలో ఉండే నొప్పుల బాధలను కూడా నెటిల్ టీ నివారిస్తుంది.
నెటిల్ టీ వల్ల చర్మం ఇరిటేషన్ కూడా తగ్గుతుంది. రకరకాల ఎలర్జీలను ఇది నివారిస్తుంది. ఇందులో యాంటిహిస్టామైన్స్, యాంటిఇన్ఫ్లమేటరీ, యాంటిమైక్రోబియల్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ టీ చర్మ సమస్యలైన యాక్నే , ఎగ్జిమా వంటివాటి చికిత్సలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో చేసిన ఒక స్టడీలో హేఫీవర్ అనేది ఎలర్జీ అని, దానికి నెటిల్ టీ బాగా పనిచేస్తుందని తేలింది. కిడ్నీ, ప్రొస్టేట్ ఆరోగ్యాలకు కూడా నెటిల్ టీ ఎంతో బాగా పనిచేస్తుంది. మూత్ర నాళంలోని ఇన్ఫెక్షన్లను పోగొట్టి మూత్రం బయటకు బాగా పోయేట్టు చేస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే కిడ్నీ స్టోన్స్ కు కారణమైన కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ను తగ్గించడంలో కూడా నెటిల్ టీ బాగా పనిచేస్తుందని ఒక స్టడీలో వెల్లడైంది. నెటిల్ టీ ఎముకలను దృఢంగా చేస్తుంది. నెటిల్ టీలో ఉండే వైవిధ్యమైన అమినోయాసిడ్స్, ప్రొటీన్స్, ఫ్లెవనాయిడ్స్, కండరాలను బలంగా చేసే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, పొటాషియం, జింకులే ఇందుకు కారణాలు.
ఒక అధ్యయనంలో నెటిల్ టీలో ఉండే ఖనిజాలు, విటమిన్ల వల్ల ఎముకల ఆరోగ్యం బాగా ఉంటుందని తేలింది. అలాగే నెటిల్ టీలోని యాంటాక్సిడెంట్లు, విటమిన్ ఎ, సిల కారణంగా రోగనిరోధక శక్తి పటిష్టం అవుతుంది. టి సెల్స్ ను నెటిల్ స్టిమ్యులేట్ చేయడం ద్వారా రోగనిరోధకశక్తిని బలహీనం చేసే శరీరం ఇన్ఫెక్షన్లపై, ఇతర జబ్బులపై బలంగా పోరాడేలా చేస్తుంది. నెటిల్ టీ ఇలా చేయాలి: శరీర ఆరోగ్యం కోసం తయారుచేసుకునే నెటిల్ టీ ని ఇంట్లో ఎంతో సులువుగా తయారుచేసుకోవచ్చు. సాస్ ప్యాన్ తీసుకని అందులో రెండు కప్పుల నీటిని ఉడికించాలి. అందులో నెటిల్ మొక్క ఆకులను వేసి సన్నని సెగపై ఐదు నుంచి పది నిమిషాల వరకూ ఆ నీళ్లను ఉడికించాలి. ఉడికిన ఆ నీళ్లను పొయ్యమీద నుంచి దించి కాసేపైన తర్వాత ఆ నీటిని వడగొట్టాలి. అందులో మీకిష్టమైతే చిటికెడు దాల్చినచెక్క పొడి, చుక్క తేనె వేసుకుని తాగాలి. అంతే. రోజుకు ఒక కప్పు నెటిల్ టీ తాగితే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే దీన్ని నిత్యం తాగడానికి ముందు ఒక కప్పు నెటిల్ టీ తాగి అది మీకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదని రూఢీ పరుచుకోవడం మాత్రం మర్చిపోవద్దంటున్నారు పోషకాహారనిపుణులు, వైద్యులు.