Saturday, September 21, 2024
Homeహెల్త్Pappaya Seeds a super food: బొప్పాయి గింజలా..మజాకానా?

Pappaya Seeds a super food: బొప్పాయి గింజలా..మజాకానా?

బొప్పాయ విత్తనాలను తినే అలవాటు క్రమంగా చేసుకోండి

బొప్పాయి పండు అందానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు.కానీ బొప్పాయిలోని గింజలను కూడా తినొచ్చని తెలుసా? పైగా బొప్పాయి గింజలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా  ఉన్నాయని తెలుసా? ఉన్నాయనే అంటున్నారు పోషకాహార నిపుణులు, మరెందరో డైటీషియన్లు. ఈ పండు చిన్నవాళ్ల నుంచి వృద్ధుల వరకూ ఎంతో మంచిదంటున్నారు.

- Advertisement -

బొప్పాయిలో ఎన్నో పోషకాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. మలబద్దకాన్ని ఇది ఎంతో శక్తివంతంగా తగ్గిస్తుందని కూడా తెలుసు. ఇందులో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉండడమే కాదు ఈ పండులో యాంటాక్సిడెంట్లు, పీచుపదార్థాలు బోలెడు ఉన్నాయి. ఈ పండు గింజలు అందరికీ ఆరోగ్యాన్నందివ్వడంలో ముందుండడం విశేషం. నిత్యం తీసుకునే డైట్ లో బొప్పాయి గింజలను చేరిస్తే చాలా మంచిదని ఊబకాయ నిపుణులు చెప్తున్నారు. బొప్పాయి గింజల్లోని పోలిఫెనాల్స్, ఫ్లవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్,టానిన్స్, సెపొనిన్స్ వంటి యాంటాక్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ దెబ్బతినకుండా శరీరాన్ని కాపాడతాయి. బొప్పాయి గింజల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిల్లోని కార్పైన్ చిన్నప్రేవులోని బాక్టీరియా, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీవక్రియను పెంపొందించడంలో కూడా బొప్పాయి గింజలు బాగా సహకరిస్తాయి.

శరీరంలో ఫ్యాట్ నిల్వ ఉండకుండా నిరోధిస్తుంది.  చెడు కొలెస్ట్రాల్ ఎల్ డిఎల్ ను కూడా బొప్పాయి గింజలు నియంత్రిస్తాయి. ఈ గింజల్లో పోషకవిలువలతో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రొటీన్స్, విటమిన్లు, మినరల్స్ సైతం ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఈ గింజల్లో పోలీఫెనాల్స్,  ఫ్లెవనాయిడ్స్ తో పాటు ఒలిక్ యాసిడ్ లాంటి మరెన్నో మోనోఅన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు. బొప్పాయి గింజలు బరువు తగ్గించడంలో కూడా ఎంతో కీలకంగా పనిచేస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంది. ఇది జీవక్రియ బాగా జరిగేట్టు చేయడం ద్వారా బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. బొప్పాయి గింజలు కడుపునిండుగా ఉంచుతాయి. ఆకలి తొందరగా వేయదు. బహిష్టు సమయంలో వచ్చే నొప్పిని కూడా బొప్పాయి గింజలు తగ్గిస్తాయి. ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్లను సమతుల్యం చేయడంలో బొప్పాయి గింజల్లోని కెరొటెనె అనే యాంటాక్సిడెంట్ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. బొప్పాయి గింజల్లోని పీచు కొలెస్ట్రాల్ ను క్రమబద్ధీకరిస్తుంది. వీటిల్లోని ఓలిక్ యాసిడ్, ఇతర మోనోఅన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ (చెడు కొలెస్ట్రాల్) ని తగ్గిస్తయి. బొప్పాయి గింజల్లోని సి విటమిన్ శక్తివంతమైన రోగనిరోధకవ్యవస్థను శరీరంలో పెంపొందిస్తుంది. ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడుతుంది. బొప్పాయి గింజల్లోని పోలిఫెనాల్స్ శక్తివంతమైన యాంటాక్సిడెంట్. ఇది అన్ని రకాల కాన్సర్ల నుంచి రక్షణనిస్తుంది. బొప్పాయి గింజలను రోజుకు ఒక టేబుల్ స్పూన్ అంటే 15 గ్రాములు తింటే వాటి నుంచి లభించే ఆరోగ్య లాభాలన్నీ పొందుతారు. బొప్పాయి గింజలను మెల్లమెల్లగా పెంచుతూ చెప్పిన పరిమాణం దాటకుండా వినియోగించడం ముఖ్యమని ఆరోగ్యనిపుణులు చెప్తున్నారు.

ఈ గింజలు రుచిలో కాస్త చేదుగా ఉంటాయి. పాతకాలంలో వీటిని ఇకోలీ, ఇతర వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వాడే మందుల్లో ఉపయోగించేవారట. ఈ గింజలను ప్రధానంగా ఎండబెట్టి, పొడిచేసి ఉపయోగిస్తారు. అంతేకాదు ఉదయమే గ్లాసుడు నీళ్లల్లో ఈ గింజలు వేసుకుని నేరుగా కూడా తాగొచ్చు. లేదా జ్యూసులు, స్మూదీలు, ఓట్మీల్ లలో వీటిని చల్లుకుని తినొచ్చు. అయితే వీటిని ముందే చెప్పిన పరిమాణాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ దాటకుండా తినాలని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. లేకపోతే ఇవి దుష్ప్రభావాలను కలగజేస్తాయని చెప్తున్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేసేలా కూడా బొప్పాయి గింజలు సహకరిస్తాయని డైటీషియన్లు చెప్తున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పకుండా ఇవి నిరోధిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా ఇవి సంరక్షిస్తాయిట. వీటిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు సైతం అత్యధికంగా ఉన్నాయి. అంతేకాదు చర్మాన్ని కాంతివంతం చేయడంలో కూడా బొప్పాయి గింజలు బాగా పనిచేస్తాయి. ఇక బరువు తగ్గడానికి అనుసరించే డైట్ లో డైటీషియన్లు వీటిని తప్పనిసరిగా చేరుస్తున్నారు. జీర్ణవ్యవస్థను బాగా ఉంచడం ద్వారా శరీరంలోని మలినాలను బయటకు పంపేయడంలో కూడా బొప్పాయి గింజలు బాగా పనిచేస్తాయని డైటీషియన్లు చెప్తున్నారు. ఊబకాయంపాలు కాకుండా బొప్పాయి గింజలు కాపాడతాయి. లివర్ సిరోసిస్ నుంచి కూడా  రక్షణ కల్పిస్తాయిట. బొప్పాయి పండుతోపాటు గింజలు కూడా తలలోని చుండ్రును తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తాయిట. ఈ గింజలతో గుజ్జు చేసి హెయిర్ ప్యాక్ గా కూడా ఉపయోగిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News