Friday, November 22, 2024
Homeహెల్త్Proteins is must: ప్రోటీన్ లోపంపై నిర్ల‌క్ష్యం వ‌ద్దు

Proteins is must: ప్రోటీన్ లోపంపై నిర్ల‌క్ష్యం వ‌ద్దు

హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్ అవసరం. కండరాల కణజాలంలో ప్రోటీన్ ఒక ముఖ్యమైన భాగం, కెరాటిన్ ఉత్పత్తికి ప్రోటీన్ అవసరమవుతుంది

ఉరుకుల ప‌రుగుల జీవితం.. ఆధునిక జీవ‌న శైలి…అనారోగ్య‌మైన ఆహారం … రోగాల‌కు కార‌ణ‌మ‌వుతున్నదిన‌చ‌ర్య‌, అల‌వాట్ల కార‌ణంగా వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ లేక‌పోవ‌డం .. పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహారంపై అవ‌గాహ‌నాలేమితో రోగాల బారిన ప‌డుతున్నాం. మ‌నం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్‌కు అధిక ప్రాధాన్య‌త ఉంది, ప్రోటీన్స్.. మన కండరాలను బలంగా ఉంచుతాయి. అలాగే ఇన్ఫెక్షన్స్, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంటాయి. శరీరానికి అత్య‌వ‌స‌ర‌మైన ప్రోటీన్‌లు లోపం కార‌ణంగా ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ప్రోటీన్స్ లోపం వ‌ల‌న ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు .. వాటిని అధిగ‌మించ‌డానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి తెలుసుకుందాం. ఎండ్

- Advertisement -

ప్రోటీన్ ప్రాధాన్య‌త‌
మ‌నిషి ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు ప్రోటీన్లు చాలా అవసరం.మాంసకృతుల వృద్ధి, ఆరోగ్యమైన చర్మం, హార్మోన్ సమతుల్యత కోసం ప్రోటీన్లు అవసరమైన మోతాదులో ఉండాల్సిందే. మానవ శరీరం పెరుగుదల, జీవ‌క్రియ‌ల‌ నిర్వహణలో కీలక పాత్ర పోషించే ముఖ్యమైన పోషకం కూడా ప్రోటీన్‌. కండరాల పెరుగుదల, హార్మోన్ల ఉత్పత్తి, ఆరోగ్యకరమైన శరీరంతో సహా అనేక రకాల విధులకు అమైనో ఆమ్లాలు అవసరమవుతాయి. హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్ అవసరం. కండరాల కణజాలంలో ప్రోటీన్ ఒక ముఖ్యమైన భాగం, కెరాటిన్ ఉత్పత్తికి ప్రోటీన్ అవసరమవుతుంది. ఇది జుట్టు, గోళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ,శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రోటీన్ అవసరం. కొల్లాజెన్ ఉత్పత్తికి ప్రొటీన్ అవసరం, ఇది చర్మాన్ని సాగేలా మరియు మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థకు ప్రోటీన్ చాలా అవసరం,

ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు
శరీరంలో ప్రోటీన్ల లోపం కారణంగా ప‌లు వ్యాధులు చుట్టుముట్టే ప్ర‌మాదం ఉంది. ప్రోటీన్ లోపం వల్ల కండరాలు క్షీణించడం, రోగనిరోధక పనితీరు బలహీనపడడం, పిల్లల్లో ఎదుగుదల తగ్గడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ప్రోటీన్ లోపం స‌మ‌స్య దారితీస్తుంది. ప్రోటీన్ లోపాన్ని పోషకాహారలోపం అని కూడా పిలుస్తారు, ప్రోటీన్ లోపం కార‌ణంగా ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి.
వాపు

శరీరంలోని పలు అవయవాలలో వాపు రావడాన్ని వైద్య భాషలో ఎడెమా అంటారు. రక్తంలో ఉండే ప్రోటీన్ అయిన హ్యూమన్ సీరం అల్బుమిన్ లోపం వలన అవయవాలలో వాపు వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే శరీరంలో ఏ అవయవంలోనైనా వాపు వస్తే అశ్రద్ధ చేయకూడదు.
కాలేయ సంబంధిత వ్యాధులు
శరీరంలో ప్రోటీన్ లేకపోవడం వలన కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి. నిజానికి ప్రోటీన్ లేకపోవడం వలన కాలేయంలో కొవ్వు పెరుగుతుంది. ఇది కాలేయ వాపు, గాయాలు, కాలేయం పనిచేయకపోవడం వంటి సమస్యలు పెరుగుతాయి. స్థూలకాయం లేదా ఎక్కువగా మద్యం సేవించేవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంది.
చ‌ర్మంపై ప‌గుళ్లు
చర్మం, జుట్టు, గోళ్లపై క‌న‌బ‌డే కొన్ని లక్షణాలు ప్రోటీన్ లోపాన్ని సూచిస్తాయి. ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు చర్మంపై పగుళ్లు ఏర్పడతాయి. చర్మంపై ఎర్రటి మచ్చలు.. మచ్చలు కనిపించడం ప్రారంభమవుతుంది. జుట్టు బలహీనంగా అవడం.. జుట్టు రాలడం జరుగుతుంది. గోర్లు సన్నగా మారడం.. వాటి ఆకారం మారిపోవడం.. ప్రతీసారి విరిగిపోవడం జరుగుతుంది.


ఎముక‌లు పెళుసుబార‌డం
ఎముకలను దృఢంగా ఉంచడంలో ప్రోటీన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో మాంసకృత్తుల లోపం ఉంటే.. శరీర పనితీరు.. అవసరమైన కణజాలాల కోసం ఎముకల నుంచి ప్రోటీన్ తీసుకోవడం ప్రారంభిస్తుంది. దీంతో కండరాలు బలహీనపడడంతోపాటు.. ఎముకలు పగుళ్లు వచ్చే అవకాశం ఉంది.
ప్రోటీన్ లేకపోవడం వలన రోగ నిరోధక వ్యవస్థపై కూడా చెడు ప్రభావం చూపిస్తుంది. ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
క్వాషియోర్కర్
ఇది ప్రోటీన్ లోపం వ‌ల్ల ఎదుర‌య్యే స‌మ‌స్య‌. మ‌నిషి సాధారణంగా ఎద‌గ‌డానికి, అభివృద్ధికి శరీరానికి తగినంత ప్రోటీన్ లభించనప్పుడు క్వాషియోర్క‌ర్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ప్ర‌ధానంగా కాళ్లు, పొత్తికడుపులో వాపు, జుట్టు పల్చగా మారడం వంటి ప‌లుర‌కాల వ్యాధిల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. చర్మం పిగ్మెంటేషన్‌లో మార్పులు క‌నిపించే అవ‌కాశం ఉంది.
మరాస్మస్
ప్రోటీన్ లోపం తీవ్రంగా ఉన్న‌ప్పుడు మ‌నిషి మ‌రాస్మ‌స్‌కు గుర‌వుతారు. విపరీతమైన బరువు తగ్గడం, కండరాల క్షీణత క‌నిపిస్తుంది. తీవ్ర‌మైన బలహీనత, అలసట ఉంటుంది.
ఎడెమా
శరీరంలో ద్రవం పేరుకుపోయి చీలమండలు, కాళ్లు, పాదాలలో వాపు క‌నిపిస్తుంది.. ఇది ప్రోటీన్ లోపం వల్ల ఎదుర‌య్యే స‌మ‌స్య‌గా డాక్ట‌ర్లు గుర్తించారు. దీని కార‌ణంగా బరువు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఇతర లక్షణాలు కూడా క‌నిపిస్తాయి.
రక్తహీనత
ప్రోటీన్ లోపం రక్తహీనతకు దారి తీస్తుంది, శరీరంలో తగినంత ఎర్ర రక్త కణాలు లేని పరిస్థితి ఎదుర‌వుతుంది.
బలహీనమైన రోగనిరోధక పనితీరు
రోగనిరోధక వ్యవస్థకు ప్రోటీన్ చాలా అవసరం, ప్రోటీన్ లోపం కార‌ణంగా శ‌రీరంలోకి ప్ర‌వేశించిన ఇన్‌ఫెక్ష‌న్‌తో పోరాడే సామర్థ్యం తగ్గుతుంది.
పిల్లల్లో ఎదుగుదల తగ్గడం
సాధారణ పెరుగుదల‌, అభివృద్ధికి ప్రోటీన్ అవసరం, ప్రోటీన్ లోపం కార‌ణంగా పిల్లలలో పెరుగుదల, అభివృద్ధి త‌గ్గిపోతుంది. వారిలో ఎదుగుద‌ల ఆగిపోతుంది
ప్రోటీన్ రిచ్ ఫుడ్స్
మాంసం, పౌల్ట్రీ, చేపలు శ‌రీరానికి అత్య‌ధికంగా ప్రోటీన్‌ల‌ను అందిస్తాయి. గుడ్లు మంచి ప్రోటీన్‌ను అందిస్తుంది. ఒక పెద్ద గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పాలు, జున్ను, పెరుగు అన్నింటిలోనూ ప్రొటీన్‌లు సమృద్ధిగా ఉంటాయి, ఒక కప్పు పాలలో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
బీన్స్, ఇతర చిక్కుళ్ళలో ప్రోటీన్లు , ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలలో అధికంగా ఉంటాయి.
బాదం, వేరుశెనగ మరియు పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రోటీన్ ఆహారంగా గుర్తించాలి.

పుట్టగొడుగులు
ప్రోటీన్‌ లోపం ఉన్నవారికి పుట్టగొడుగులు మంచి ఆహారం. ముఖ్యంగా వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ అందుతుంది. అదేవిధంగా పుట్టగొడుగుల్లో పెద్ద మొత్తంలో ప్రొటీన్‌ ఉంటుంది.
బఠానీలు
బంగాళదుంపల మాదిరిగా బఠానీల్లో కూడా ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అల్జీమర్స్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులను దూరంగా ఇవి బాగా దోహదపడతాయి.
సోయాబీన్
గ్రీన్‌ సోయాబీన్లో ప్రొటీన్లు విరివిగా ఉంటాయి. అందుకే ప్రొటీన్ల లోపం ఉన్నవారు సోయాబీన్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. వీటితో పాటు సోయాబీన్ మిల్క్, టోఫు, సోయా సాస్, సోయాబీన్ పేస్ట్‌లో కూడా ఆరోగ్య పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
బంగాళదుంప
ప్రొటీన్లు పుష్కలంగా ఉండే కూరగాయల్లో బంగాళాదుంప కూడా ఒకటి. అందుకే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా బంగాళదుంప కూర, ఉడకబెట్టిన బంగాళదుంపలు తింటే శరీరానికి ప్రొటీన్లు సమృద్ధిగా శరీరానికి అందుతాయి.


క్యాబేజీ
క్యాబేజీని గోబీ అని కూడా అంటారు. చాలామంది దీనిని సలాడ్‌గా తీసుకుంటారు. ఇందులో ప్రొటీన్లతో పాటు పలు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల గోబీలో దాదాపు 1 నుంచి 2 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. దీనిని తరచూ తినడం వల్ల ప్రొటీన్‌ లోపం సమస్యలను అధిగమించవచ్చు. అదేవిధంగా జీర్ణక్రియ, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి.
పాలకూర
పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా ఆకు కూరలలో బచ్చలి కూర ఉత్తమమైనది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బ్రోకలీ
బ్రోకలీలో కూడా ప్రొటీన్లు విరివిగా ఉంటాయి. అందుకే దీన్ని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వంటల్లోనే కాకుండా బ్రోకలీని సలాడ్ రూపంలో కూడా తినవచ్చు.
ప్రోటీన్ల‌తో నిండిన పోషకాహారం, క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేస్తూ డాక్ట‌ర్ల స‌ల‌హా పాటిస్తే క‌నుక ప్రోటీన్ లోపంతో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News