Thursday, July 4, 2024
Homeహెల్త్Silky skin: సిల్కీ స్కిన్ కావాలంటే..

Silky skin: సిల్కీ స్కిన్ కావాలంటే..

ఈ ప్యాక్స్ అన్నీ ఖర్చు లేనివి పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు

సిల్కులాంటి చర్మానికి…

- Advertisement -

చలికాలంలో చర్మ సంరక్షణ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలొవిరా, ఆరంజ్ జ్యూసు, తేనె, మీగడ, పెరుగు, బాదం నూనె, తెల్ల సొన అన్నిరకాల చర్మాలకు సరిపడే నేచురల్ మాయిశ్చరైజర్లు. వీటితో చేసిన ఫేస్ మాస్కులను ముఖానికి రాసుకుంటే చర్మం పట్టులా మెరుస్తుంది. అన్నిరకాల చర్మాల
సంరక్షణకు కలబంద బాగా పనిచేస్తుంది. అలొవిరా జెల్ లేదా జ్యూసును నేరుగా ముఖానికి రాసుకుని 20
నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇది చర్మానికి సహజసిద్ధమైన తేమను అందిస్తుంది.

అన్ని రకాల చర్మాలపై పనిచేసే ఇంకొక నేచురల్ ఫేస్ మాస్కు హనీ ఫేస్ మాస్కు. ఒక చిన్న గిన్నెలో ఒక టీ స్పూన్ తేనె వేసి అందులో అర టీ స్సూన్ బాదం ఆయిల్, ఒక టీస్పూన్ పాలపొడి వేసి ఆ మిశ్రమాన్ని మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే
ఉంచుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఆరంజ్ జ్యూస్ ఫేస్ మాస్కు కూడా అన్ని రకాల చర్మాలపై బాగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో తేనె, ఆరంజ్ జ్యూను వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మం ఎంతో మ్రుదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. ఇంకొకటి రోజ్ ఫేస్ ప్యాక్.

గుప్పెడు గులాబిరేకులు తీసుకుని వాటిని మెత్తగా పేస్టులా చేయాలి. అందులో ఒక టీ స్పూన్ పెరుగు, ఒక
టీస్పూను తేనె వేసి బాగా కలపాలి. అందులో కమలాపండు తొక్కల పొడిని కూడా వేసి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాలు అలాగే ఉంచుకున్న తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఈ పేస్టు పెదవులకు, కళ్లకు తగలకుండా ముఖానికి పట్టించుకోవాలి. ఆయిలీ, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్లు బంతిపూల ఫేస్ ప్యాక్ ముఖానికి రాసుకోవాలి. దీనికి చేయాల్సిందేమిటంటే రాత్రి గోరువెచ్చని నీటిలో బంతిపూలు నానబెట్టాలి. తర్వాత బ్లెండర్ లో పెరుగు, శాండల్ వుడ్ పౌడర్, నానిన బంతిపూలను వేసి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. మేరిగోల్డ్ ప్యాక్ చర్మానికి సాంత్వననివ్వడమే కాదు చర్మంపై చేరిన బాక్టీరియాను పోగొడుతుంది.

ఇకపోతే అన్నిరకాల చర్మాలకు అరటిపండు ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. అరటిపండును మెత్తగా చేసి ఒక గిన్నెలో వేసి అందులో రోజ్ వాటర్ ని కలిపి పేస్టులా చేయాలి. దానిని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. అరటిపండులో శరీరానికి కావలసిన తేమనందించే గుణం ఉంది. దీనివల్ల చర్మం మెరవడమే కాదు జారినట్టు అవకుండా బిగువుగా ఉంటుంది. రోజ్ వాటర్ స్కిన్ టోన్ ను బాగుంచడమే కాకుండా చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది.

రెడ్ వైన్ ఫేస్ ప్యాక్ కూడా అన్ని రకాల చర్మాలపై బాగా పనిచేస్తుంది. ఒక గిన్నె తీసుకుని అందులో రెడ్
వైన్, పెరుగు, తేనె వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాలు అలాగే
ఉంచుకుని ఆతర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇది చర్మంపై ఉండే ట్యాన్ ని పోగొట్టడంతో పాటు సహజసిద్ధమైన మెరుపును చర్మానికి ఇస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు, యాక్నేతో బాధపడేవారికి
గుడ్డులోని తెల్లసొన ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది.

జిడ్డు చర్మం, యాక్నేతో బాధపడేవారు సహజంగా శీతాకాలంలో తేమ లోపంతో ఎక్కువగా బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్లు ఒక గిన్నెలో అర టీస్పూను తేనె, గుడ్డులోని తెల్లసొన, ఒక టీస్పూను
పెరుగు వేసి అందులో సరిపడినంత ముల్తానీ మట్టి కూడా చేర్చి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు, మొటిమలతో బాధపడేవాళ్లు లెమన్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచిది. దీనికి చేయాల్సిందల్లా ఒక బౌల్ లో నిమ్మరసం, చల్లటి పాలు, రెండు టీస్పూన్ల ఓట్స్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ఆ పేస్టును చర్మంపై రంధ్రాలు ఉన్న చోట రాయాలి. 20 నిమిషాల తర్వాత నీళ్లతో దాన్ని కడిగేసుకోవాలి. అయితే ఇవన్నీ సహజసిద్ధమైనప్పటికీ ముందుజాగ్రత్తగా ఎలాంటి ఇరిటేషన్లు చర్మంపై రాకుండా ఇవి వేసుకునే
ముందు ప్యాచ్ టెస్టు చేసుకోవడం మరవొద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News