Sunday, September 8, 2024
Homeహెల్త్Skin probs: చెమటలా? మీ స్కిన్ పరిస్థితి ఏంటి?

Skin probs: చెమటలా? మీ స్కిన్ పరిస్థితి ఏంటి?

సుతారమైన చర్మానికి జాగ్రత్తలు చాలా అవసరం

ఉక్కబోతగా ఉందా? చర్మానికి ఇవి అవసరం

- Advertisement -

ఉక్కబోత వాతావరణంతో ఇబ్బంది పడుతున్నారా? చర్మ సంరక్షణ ఎలాగో తెలియడం లేదా? ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. ఉక్కబోత వాతవరణంలో చర్మంపై ఇన్ఫెక్షన్లు, ఫంగస్, బాక్టీరియా దుష్ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా అక్టోబర్ హీట్ ను తట్టుకునేందుకు, చర్మాన్ని సంరక్షించుకునేందుకు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చర్మ నిపుణులు చెపుతున్నారు.

వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి. వీటి వల్ల శరీరానికి గాలి బాగా తగులుతూ చెమట పట్టకుండా హాయిగా ఉంటుంది. అలాగే చెమట పట్టిన దుస్తులు ఎక్కువసేపు శరీరంపై ఉంచుకోకుండా తీసేయడం మంచిదని కూడా చర్మ నిపుణులు సూచిస్తున్నారు. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల ప్రభావం కళ్ల మీద పడకుండా కూలింగ్ గ్లాసులు, ఎండ వేడి తలకు తగలకుండా టోపీ తప్పనిసరిగా పెట్టుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చర్మం రేడియేషన్ కు గురికాదు. ఆయిల్ లేని, నాన్ కోమ్డోజెనిక్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ మాత్రమే చర్మంపై వాడాలి.

ముఖ్యంగా జెల్ లేదా వాటర్ బేస్డ్ ఫార్ములాను వాడడం వల్ల చర్మానికి కావలసిన హైడ్రేషన్ అందుతుంది. అలాగే చల్లటి వాతావరణం ఉన్నా కూడా రోజూ తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఎస్ పిఎఫ్ 30 కనీసంగా ఉండే సన్ స్క్రీన్ వాడితే మంచిది. సూర్యరశ్మి పడే శరీర భాగాలన్నింటిపై సన్ స్క్రీన్ అప్లై చేయాలి. చెమటబట్టిన శరీరం ఉన్నప్పుడు వేడినీటితో స్నానం చేయాలనిపిస్తుంది. కానీ వేడినీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉండే నేచురల్ ఆయిల్స్ హరించుకుపోతాయి. దీంతో చర్మం పొడారిపోయినట్టు అయి ఇరిటేషన్ వస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. అది కూడా ఎక్కువ సేపు స్నానం చేయకుండా ఉంటే చర్మం యొక్క మాయిశ్చరైజర్ గుణం పోదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News