Tuesday, July 2, 2024
Homeహెల్త్Slimming tips: బరువు తగ్గాలంటే ఇలా చేయద్దు

Slimming tips: బరువు తగ్గాలంటే ఇలా చేయద్దు

ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గటం ముఖ్యం

బరువు తగ్గాలంటే ఇవి మరవొద్దు…

- Advertisement -

బరువు తగ్గాలంటే జీవనశైలికి సంబంధించి కొన్ని మార్పులు తప్పనిసరిగా  అనుసరించాలి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నిత్యం వ్యాయామాలు చేయాలి. ఇవి రెండూ చాలా ముఖ్యమైనవి. అంతేనా అనుకుంటే పొరబడ్డారన్నమాటే. ఇవి పాటించడం మీరు అనుకున్నంత సులువు కాదు. దీనికి పట్టుదల, ఓర్పు చాలా అవసరం. అంతేకాదు మోటివేషన్ చాలా అవసరం.

బరువు పెరుగుతామని చాలామంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. అది చాలా తప్పు. రోజు మొత్తంలో మనం తీసుకునే ఆహారంలో బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యమైనదని మరవొద్దు.  ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ చేస్తే శరీరంలోని గ్లూకోజ్ ప్రమాణాలు సరిగా ఉంటాయి. షుగర్, జంక్ కార్బోహైడ్రేట్లు, ట్రాన్స్ ఫాట్స్ ఉండే వాటిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల ఏ విధమైన లాభం ఉండదు. బింజ్ ఈటింగ్ మానాలి. వారంలో ఎప్పుడో ఒకసారి బింజ్ ఈటింగ్ ఫరవాలేదు కానీ తరచూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. బరువు కూడా పెరుగుతారు. కాలరీలు ఎంత తీసుకోవాలనేది కూడా మీ వయసు, ఆడ లేదా మగ, ఎలాంటి పని చేస్తారు, బరువు ఎంత తగ్గాలనుకుంటున్నారన్న  విషయాలపై ఆధారపడి ఉంటుంది.

అలాగే డ్రింకుల ద్వారా వెళ్లే కాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయని మరొవొద్దు. క్రుత్రిమ తీపిదనం ఉండే సోడా, పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింకులు, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా నీటిని బాగా తాగాలి. నీళ్లు తాగలేని వాళ్లు అందులో నిమ్మ లేదా తాజా బెర్రీలు, కీరకాయ వంటి వాటిని కలిపి తీసుకుంటే మంచిది. నిద్ర సరిపడినంత లేకపోయినా కూడా బరువు పెరుగుతారు. రోజూ రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి.

నిద్ర సరిగా లేకపోతే జ్ఘాపకశక్తి సమస్య తలెత్తుతుంది . సరిపడినంత నిద్ర లేకపోతే జీర్ణశక్తి సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. అంతేకాదు కోర్టిసాల్ ప్రమాణాలు పెరుగుతాయి. ఫలితంగా అతిగా తినడం మొదలెడతాం. అందుకే నిత్యం నిద్ర పోవడానికి నిర్దిష్టమైన టైమును పెట్టుకోవాలి. పడుకునేముందు పక్కన సెల్ఫోన్, ఐపాడ్, కంప్యూటర్ లాంటివి ఉంచుకోకూడదు. నిత్యం ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది. అలాగే తినే ఆహారంలో ఫ్యాట్ ఉండకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే బరువు సమస్య తలెత్తుతుంది.

హైడ్రోజనరెటెడ్ ఫ్యాట్స్ కు దూరంగా ఉండాలి. మోనోఅన్ శాచ్యురేటెడ్,  పోలిఅన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ వంటివి ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడానికి కూడా ఇవి సహకరిస్తాయి. ఆరోగ్యవంతమైన శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కొబ్బరినూనె వంటి వాటిల్లో ఉంటాయి. అందుకే కొబ్బరినూనె బరువు తగ్గడంలో ఎంతో ఉపయోగపడుతుంది. మోనోఅన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కొలస్ట్రాల్ ను తగ్గిస్తాయి. గుండెజబ్బుల రిస్కు బారిన పడకుండా సంరక్షిస్తాయి కూడా. పోలీఅన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అవకెడో వంటి వాటిల్లో ఉంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెజబ్బులు రాకుండా సంరక్షించడమే కాకుండా టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా కాపాడతాయి కూడా.

బరువు తగ్గాలంటే నిత్యం కార్డియో వ్యాయామాలు చేయాలి. అంతేకాదు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు, గుండె, కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ లకు ఇవి చాలా అవసరం. కార్డియో జీవక్రియను ఉత్తేజపరుస్తుంది.  దీంతో బరువు తగ్గుతారు. అలా అని గంటలకు గంటలు ఈ వ్యాయామాలు చేస్తే, చెమటోడిస్తే సన్నబడతాం, బరువు తగ్గుతాం, ఫ్యాట్ కరుగుతుందని భావిస్తే మాత్రం మీరు పొరబడ్డరన్నమాటే. అతిగా కార్డియో చేస్తే ప్రతికూల ఫలితాలు తలెత్తే ప్రమాదం ఉంది.

కండరాల మాస్ పెరగడానికి నిత్యం వెయిట్ ట్రైనింగ్ చేస్తే ఉపయోగం ఉంటుంది. దీనివల్ల వ్యాయామాలు చేయకపోయినా కాలరీలు బాగా కరుగుతాయి. ఈ విషయంలో పర్సనల్ ట్రైనర్ పర్యవేక్షణ, సలహాలు చాలా అవసరం. మనిషి మనిషికి మధ్య శరీర తేడాపాడాలు ఉంటాయి కాబట్టి మనిషి మనిషికి వెయిట్ ట్రైనింగ్ లో తేడా కూడా అంతే ఉంటుంది.

బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ ఇది తప్పుడు  అభిప్రాయం. పిండిపదార్థాలు శరీరానికి మంచివే. కానీ జంక్ కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచివి కావని గుర్తుంచుకోవాలి. మన శరీరం సరిగా పనిచేయాలంటే కార్బోహైడ్రేట్లు చాలా అవసరం. ఇవి శరీరానికి ప్రధాన ఇంధనమని చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కార్బోహైడ్రేట్లను అతిగా తినకుండా సరైన పాళ్లల్లో తగిన మేర మాత్రమే తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లల్లో కూడా సింపుల్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఉదాహరణకు షుగర్ లాంటివి. వీటికి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వీటిల్లో పీచుపదార్థాలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు వేగంగా రక్తంలో ఇవి కలుస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ ప్రమాణాలు బాగా పెరుగుతాయి. ఇంకా క్యాండీలు, రిఫైన్డ్ బ్రెడ్, పాస్తా, వైట్ రైస్, సోడా, చక్కెర వంటివన్నీ సింపుల్ కార్బ్స్ కిందకు వస్తాయి. రెండవ రకం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు. ఇవి మంచి కార్బోహైడ్రేట్లు. వీటిల్లో పీచుపదార్థాలు బాగా ఉంటాయి. శరీరంలో కలిసిపోవడానికి ఇవి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అంతేకాదు ఇవి శరీరానికి గట్టి శక్తిని అందిస్తాయి. వీటిని తినడం వల్ల బ్లడ్ షుగర్ ప్రమాణాలు వేగంగా పెరగవు.

బరువు తగ్గడానికి చాలామంది చేసే మరో పొరబాటు ఏమిటంటే ఏమీ తినకుండా ఉంటారు. లేదా బాగా తిండి తగ్గించేస్తారు. ఇది శరీరంపై దుష్ప్రభావం చూపుతుంది. అందుకే ఈ అభిప్రాయం చాలా తప్పుడు అభిప్రాయం. తినడాన్ని బాగా తగ్గించడం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు సరిగా అందకపోయే ప్రమాదం ఉంది. దీంతో శరీరం ద్రుఢంగా, పటుత్వంగా ఉండదు. బలంగా పనిచేయలేము. సరిగా తినకపోవడం వల్ల ప్రారంభంలో కొద్దిగా బరువు తగ్గినట్టు మీకు అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మళ్లా తినడం ప్రారంభిస్తారో బరువు కూడా అంతే వేగంగా పెరుగుతారు. అందుకే అలాంటి పనులు చేయకుండా పోషకాలతో కూడిన త్రుణధాన్యాలు, చిరుధాన్యాలు, పళ్లు, కూరగాయలు, ప్రొటీన్ ఫుడ్స్ సరైన పాళ్లల్లో తీసుకోవాలి. సలాడ్ డ్రెస్సింగ్, కెచప్, గ్రనోలా బార్స్, బ్రెడ్, పాస్తా సాస్, ఫ్లేవర్డ్ కాఫీ డ్రింక్సు వంటివాటికి దూరంగా ఉండాలి. ఇలా ఉంటే బరువు  

తగ్గడమే కాదు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గే విషయంలో ఫిట్ నెస్  నిపుణులను, వైద్యులను సంప్రదించి తదనుగుణంగా వ్యవహరించాలని మరవొద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News