Monday, May 20, 2024
Homeహెల్త్Walnuts benefits: వాల్నట్స్ నానబెట్టి తింటే..

Walnuts benefits: వాల్నట్స్ నానబెట్టి తింటే..

వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని నానబెట్టి తినడం వల్ల వాటిల్లోని పోషకాలను పూర్తి స్థాయిలో పొందగలం. వాల్నట్స్ లోని ప్రొటీన్లు, పీచుపదార్థాలు రక్తంలోని షుగర్ ప్రమాణాలను నియంత్రిస్తాయి. వాల్నట్స్ ను నానబెట్టి తినడం వల్ల జీర్ణక్రియ బాగా అవుతుంది. శరీరంలోని బ్లడ్ షుగర్ ప్రమాణాలు నిలకడగా ఉంటాయి. వీటిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒత్తిడి, డిప్రషన్, యాంగ్జయిటీలను తగ్గిస్తాయి. వాల్నట్స్ లో కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్ ఉంటాయి. ఇవి శరీర బరువును తగ్గించడంలో ఎంతో సహకరిస్తాయి. రోజూ వాల్నట్స్ ను నీళ్లల్లో నానబెట్టుకుని తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. కడుపులో గ్యాస్ సమస్య తలెత్తదు.

- Advertisement -

ఒక కప్పు నీళ్లల్లో రెండు నుంచి నాలుగు వాల్నట్స్ వేసి ఐదారు గంటల పాటు నానబెట్టి తినాలి. అలాగే రాత్రి నిద్రపోయే ముందు గ్లాసుడు పాలతో పాటు నానబెట్టిన వాల్నట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటి ద్వారా శరీరానికి న్యూట్రియంట్లు బాగా అందుతాయి. ఇవి శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ ని అందిస్తాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో సూక్ష్మపోషకాలు, విటమిన్లు, ఖనిజాలు బాగా ఉంటాయి కాబట్టి వీటిని తినడం వల్ల బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. వాల్నట్స్ ఆరోగ్యకరమైన స్నాక్ . వీటిని కొద్దిగా తింటే చాలు కడుపు నిండినట్టు ఉంటుంది. వాల్నట్స్ లోని పీచుపదార్థాల వల్ల తొందరగా మనకు ఆకలి వేయదు కూడా. చిరుతిళ్ల జోలికి పోము. ఫలితంగా శరీరం బరువు పెరగదు. ఊబకాయం బారిన పడము. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా చేరదు. ప్రొటీన్ షేక్స్, స్మూదీస్ లో వీటిని వేసుకొని తింటే శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ అధికప్రమాణాల్లో అందుతుంది. వాల్నట్స్ లోని ప్రొటీన్లు, పీచుపదార్థాలు రక్తంలోని షుగర్ ప్రమాణాలను ఆరోగ్యకరమైన రీతిలో నియంత్రిస్తాయి.

వాల్నట్స్ ఇలా తింటే ఆరోగ్యం

వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని నానబెట్టి తినడం వల్ల వాటిల్లోని పోషకాలను పూర్తి స్థాయిలో పొందగలం. వాల్నట్స్ లోని ప్రొటీన్లు, పీచుపదార్థాలు రక్తంలోని షుగర్ ప్రమాణాలను నియంత్రిస్తాయి. వాల్నట్స్ ను నానబెట్టి తినడం వల్ల జీర్ణక్రియ బాగా అవుతుంది. శరీరంలోని బ్లడ్ షుగర్ ప్రమాణాలు నిలకడగా ఉంటాయి. వీటిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒత్తిడి, డిప్రషన్, యాంగ్జయిటీలను తగ్గిస్తాయి. వాల్నట్స్ లో కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్ ఉంటాయి. ఇవి శరీర బరువును తగ్గించడంలో
ఎంతో సహకరిస్తాయి. రోజూ వాల్నట్స్ ను నీళ్లల్లో నానబెట్టుకుని తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. కడుపులో గ్యాస్ సమస్య తలెత్తదు. ఒక కప్పు నీళ్లల్లో రెండు నుంచి నాలుగు వాల్నట్స్ వేసి ఐదారు గంటల పాటు నానబెట్టి తినాలి. అలాగే రాత్రి నిద్రపోయేముందు గ్లాసుడు పాలతో పాటు నానబెట్టిన వాల్నట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

వీటి ద్వారా శరీరానికి న్యూట్రియంట్లు బాగా అందుతాయి. ఇవి శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ ని అందిస్తాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో సూక్ష్మపోషకాలు, విటమిన్లు, ఖనిజాలు బాగా ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News