Sunday, July 7, 2024
Homeహెల్త్Tea to burn belly fat: కడుపు కొవ్వును తగ్గించే టీ

Tea to burn belly fat: కడుపు కొవ్వును తగ్గించే టీ

పొత్తికడుపు చుట్టూ ఉన్న కొవ్వును అల్లం టీ కూడా కరిగిస్తుంది

పొత్తికడుపు దగ్గర పేరుకున్న కొవ్వును కరిగించే టీలు కొన్ని ఉన్నాయి. వీటిల్లో ఒకటి గ్రీన్ టీ. ఒక టీ స్పూను గ్రీన్ టీ ఆకులు తీసుకోవాలి. ఉడకబెట్టిన నీళ్లల్లో ఈ గ్రీన్ టీ ఆకులు వేసి ఐదు నిమిషాలు నాననిచ్చి ఆ తర్వాత ఆ నీటిని వొడగట్టాలి. ఆ గ్రీన్ టీని తాగితే పొట్ట చుట్టూ చేరిన కొవ్వు కరుగుతుంది. పొత్తికడుపు చుట్టూ ఉన్న కొవ్వును అల్లం టీ కూడా కరిగిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక అంగుళం సైజు తాజా అల్లం ముక్క, అర టీస్పూను నిమ్మరసం, రెండు కప్పుల నీళ్లు రెడీపెట్టుకోవాలి. రెండు కప్పుల నీళ్లల్లో అల్లం ముక్కను వేసి బాగా ఉడికించి అందులో తేనె, నిమ్మరసం కలిపి అల్లం టీ చేసుకుని తాగితే పొత్తికడుపు కొవ్వు కరుగుతుంది.

- Advertisement -

ఇంకొకటి దాల్చిన చెక్కతో చేసే డిటాక్స్ టీ. దీనికి ఒక కప్పు గ్రీన్ టీ తీసుకుని అందులో ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క, ముడితేనె, నిమ్మరసం, కెయెన్నె వేసి కలిపి తాగితే ఎంతో మంచిది. శరీరంలోని మలినాలను ఇది బయటకు పోగొడుతుంది. పసుపు, దాల్చినచెక్క టీ కూడా పొత్తికడుపు దగ్గర పేరుకున్న కొవ్వును కరిగించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందుకు రెండు కప్పుల నీరు, ఒక టేబుల్ స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూను దాల్చినచెక్క, రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ముడితేనె వీటన్నింటినీ కలిపి ఈ టీ తయారుచేస్తారు. మరొకటి బ్లాక్ టీ. ఒక కప్పు ఉడికించిన నీళ్లల్లో తేయాకుపొడి వేసి ఉడికించిన తర్వాత దాన్ని వొడగొట్టాలి. అందులో తేనె వేసి కలిపి తాగితే చాలా బాగుంటుంది. పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వును కూడా ఈ టీ బాగా కరిగిస్తుంది.

ఇంకొకటి పిప్పర్మింట్ టీ. దీనికి ఏడు నుంచి పది పిప్పర్మింట్ టీ ఆకులు, ఎనిమిది ఔన్సులు నీళ్లు, తేనె, నిమ్మరసం కావాలి. పిప్పర్మింట్ టీలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే పొత్తికడుపు దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది. ఆరోగ్యానికి కూడా ఈ టీ చాలా మంచిది. మరొక టీ ఒలాంగ్ టీ. ఒక కప్పు నీటిలో మూడు ఊలాంగ్ టీ బ్యాగ్స్ ముంచి కాసేపైన తర్వాత వాటిని బయటకు తీయాలి. అందులో పలచగా తరిగిన మూడు నిమ్మ చెక్కలతో పాటు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ట్రువియా (స్వీట్నర్) వేసి కలిపి తాగితే కూడా శరీరానికి చాలా మంచిది. ఈ టీలు ఏవి తాగినా పొత్తికడుపు దగ్గర పేరుకున్న కొవ్వు బాగా కరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News