Friday, November 22, 2024
Homeహెల్త్Tea to Slim: మిమ్మల్ని స్లిమ్ చేసే టీ

Tea to Slim: మిమ్మల్ని స్లిమ్ చేసే టీ

పుదీనా ఆకులు కూడా..

బరువు పెరుగుతున్నారని ఆందోళన పడొద్దు. దాన్ని తగ్గించే సింపుల్ చిట్కా ఒకటి ఉంది. ఇంతకూ అది శరీరంలోని ఫ్యాట్ ను కరిగించే స్పెషల్ టీ . దీన్ని వారంలో మూడు రోజుల పాటు రోజుకు మూడు కప్పులు చొప్పున తాగితే మీ ఒంట్లో కొవ్వు తగ్గుతుంది. ఈ టీని వంటింట్లో లభించే పదార్థాలతో ఇట్టే చేసుకోవచ్చు. ఇది ప్రకృతిసిద్ధమైన టీ.

- Advertisement -

దీన్ని తయారు చేయడానికి రెండు టీస్పూన్ల తురిమిన అల్లం, ఒక టీ స్పూన్ దాల్చిన చెక్కపొడి, ఒక కప్పు నీళ్లు, ఒక ప్యాకెట్ గ్రీన్ టీ, రెండు టీస్పూన్ల నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె, వేడి టీపై చల్లడానికి కొన్ని పుదీనా ఆకులు రెడీగా పెట్టుకోవాలి. నీళ్లల్లో అల్లం తురుము, దాల్చిన చెక్కపొడి వేసి ఐదు నిమిషాలు స్టవ్ మీద మరగనివ్వాలి. ఆతర్వాత అందులో తేనె, రెండు టీస్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని వడపోయాలి. అందులో గ్రీన్ టీ ప్యాకెట్ ను ముంచి రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. అంతే ఊబకాయాన్ని తగ్గించే వేడి వేడి టీ రెడీ. అలా రెడీ అయిన వేడి టీ పై తాజా పుదీనా ఆకులు కొన్ని చల్లుకుని తాగండి. ఈ టీ నుంచి పూర్తి స్థాయి ఫలితాలు పొందాలనుకుంటే మాత్రం పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ చాయ్ తాగితే చాలా మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News