Thursday, May 9, 2024
Homeహెల్త్Nalugu: నలుగు ఇలా పెట్టుకుంటే..

Nalugu: నలుగు ఇలా పెట్టుకుంటే..

అతిగా స్క్రబ్ చేయకండి

చర్మం మెరయడానికి ఎక్స్ ఫొయిలేషన్ బాగా పనిచేస్తుంది. చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. చర్మాన్ని ఎక్స్ ఫొయిలేషన్ చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు
గుర్తుపెట్టుకోవాలంటున్నారు చర్మ నిపుణులు. సరైన పద్ధతిలో చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేసుకోకపోతే దానివల్ల విపరీత పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని వాళ్లు అంటున్నారు. ఈ పని చేసేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయంటున్నారు.

- Advertisement -

ఎక్స్ ఫొయలేషన్ అంటే అచ్చతెనుగులో నలుగుపెట్టుకోవడం అనొచ్చు. దీనివల్ల చర్మం పైభాగంలో చేరిన మ్రుతకణాలు పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇది చేసుకోవడం వల్ల చర్మ రంధ్రాలు విశాలం అయి గాలి బాగా తగులుతుంది. కొత్త కణాలు పెరుగుతాయి. స్కిన్ టెక్స్చెర్ మెరుగుపడుతుంది. తరచూ ఎక్స్ ఫొయిలేషన్ చేసుకోవడం వల్ల స్కిన్ అబ్సార్ఫ్షన్ పెరుగుతుంది. ఎక్స్ ఫొయిలేషన్ వల్ల చర్మం తాజాగా , ఎంతో మ్రదువుగా తయారవుతుంది. చర్మాన్ని ఎక్స్ ఫొయిలేషన్ చేసుకునేటప్పుడు తెలియక కొన్ని పొరబాట్లు చేస్తుంటాం. ముఖ్యంగా మీ చర్మ స్వభావాన్ని బట్టి సరైన ఎక్స్ ఫొయలెంట్ ను ఎంపికచేసుకోవాలి.

అలాగే చర్మం స్వభావాన్ని బట్టి కూడా ఎక్స్ ఫొయిలెంట్స్ ప్రక్రియ మారుతుంటుంది. మీకు సున్నితమైన లేదా పొడి చర్మం ఉన్నట్టయితే మైల్డ్ ఎక్స్ ఫొయిలెంట్స్ ను ఎంపికచేసుకోవాలి. అంటే పోలీహైడ్రాక్సీ యాసిడ్స్ (ఎహెచ్ఎ) లేదా పిహెచ్ఎల ను వాడాలి. జిడ్డు చర్మం లేదా యాక్నే సమస్య ఉన్న చర్మ స్వభావం వాళ్లు బిహెచ్ఎ ను అంటే గ్లైకోలిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన ఎక్స్ ఫొయిలెంట్ ను వాడాలి.
చర్మ స్వభావాన్ని బట్టి వీటిని వాడడం వల్ల చర్మం దెబ్బతినదు. ఎలాంటి ఇరిటేషన్ కు గురవరు. కొత్త ఎక్స్ ఫొయిలెంట్ ఉత్పత్తులు వాడేటప్పుడు ప్యాచ్ టెస్టు చేసుకోవాలి. చేతిపై ఆ ఉత్పత్తిని కొద్దిగా పూసుకుని ఏదైనా ఇరిటేషన్ కలిగిస్తుందేమో గమనించాలి. కొత్త ఎక్స్ ఫొయిలెంట్ ను అప్లై చేసిన చోట ఎర్రగా అవడం, దురదగా అనిపించడం, ఇరిటేషన్ గా ఉంటే ఆ ప్రాడక్టును వాడొద్దు. 24 గంటల్లో చర్మంపై ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తకపోతే ఆ ప్రాడక్టు సురక్షితం అని భావించవచ్చు. తరచూ
చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేసుకుంటుండాలి.

కనీసం వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఈ ప్రక్రియ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రంగా ఉండడంతో పాటు కాంతివంతంగా తయారవుతుంది. చర్మం టెక్స్చెర్ దెబ్బతినదు. ఇరిటేషన్ తలెత్తదు.
ఎక్స్ ఫొయిలేషన్ చేసుకునేటప్పుడు మీ చర్మం ఎలా స్పందిస్తోందన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. మీ చర్మం మీకు ఏమిచెబుతోందన్నది గ్రహించాలి. ఎక్స్ ఫొయిలేట్ చేసేటప్పుడు చర్మం బాగా కందినట్టు అయినా, పొడిబారినట్టు అయినా, ఇరిటేషన్ అనిపించినా ఎక్స్ ఫొయిలేషన్ ను ఎక్కువగా చేయొద్దు. బలంగా చేయొద్దు . మీ చర్మం ఎక్స్ ఫొయిలేషన్ కు ఎలా స్పందిస్తుందన్న దాన్ని బట్టి ఆ ప్రక్రియను కొనసాగించాలి.అలాగే ఎక్స్ ఫొయిలేషన్ చేసుకునేటప్పుడు కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేసుకుంటే చర్మం కాంతివంతం అవుతుందన్న ఉద్దేశంతో కొందరు విపరీతంగా దీన్ని అనుసరిస్తుంటారు. అలా చేస్తే చర్మం ఇరిటేషన్ కు గురవుతుంది. చర్మం సున్నితత్వం
దెబ్బతింటుంది. అందుకే ఎక్కువసార్లు ఎక్స్ ఫొయిలేషన్ చేయకుండా మోడరేట్ మార్గాన్ని అనుసరించడం ఉత్తమం. విపరీతంగా చర్మాన్ని స్ర్కబ్బింగ్ చేయడం మంచిది కాదని చర్మ నిపుణులు కూడా సూచిస్తున్నారు.

ఎక్స్ ఫొయిలేటింగ్ ఉత్పత్తులకు చర్మం అతిగా ప్రభావితమైనా కూడా చర్మం దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఎక్స్ ఫొయిలేషన్ చేసుకునేటప్పుడు శరీరంపై గట్టి బ్రష్ లను గాని, స్క్రబ్బులను గాని వాడొద్దు. వీటివల్ల చర్మం సూక్ష్మస్థాయిలో చిట్లే అవకాశం ఉంది. ఫలితంగా చర్మం తీవ్ర సమస్యలకు గురవుతుంది. అందుకే మ్రదువైన ఎక్స్ ఫొయిలేషన్ ప్రక్రియను అనుసరించడం మంచిది. ఇలా చేయడం వల్ల చర్మం కూడా దెబ్బతినదు. ఇరిటేషన్ ఉన్న చర్మంపై, అలాగే దెబ్బతిన్న చర్మంపై ఎక్స్ ఫొయిలేషన్ ప్రక్రియ చేయొద్దు. అలా చేస్తే చర్మం తీవ్రంగా దెబ్బతినడమే కాదు దానివల్ల ఎక్కువ బాధ, నొప్పులు ఎదుర్కొంటారు. అవి తొందరగా తగ్గవు కూడా. మీకు సన్ బర్న్స్ , కట్స్, దద్దుర్లు, యాక్నే ఉంటే అవి
తగ్గేవరకూ ఎక్స్ ఫొయిలేషన్ ప్రక్రియకు దూరంగా ఉండాలి. కొందరు రకరకాల ఎక్స్ ఫొయిలెంట్ ప్రొడక్టులను కలిపి ఒకేసారి చర్మంపై అప్లై చేస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఇది చర్మాన్ని దెబ్బతీస్తుంది. దీంతో చర్మం బాగా సున్నితంగా తయారవుతుంది. అందుకే ఒక ఎక్స్ ఫొయిలెంట్ ప్రొడక్టును మాత్రమే చర్మానికి ఎప్పుడూ అప్లై చేసుకోవాలి.

ఎక్స్ ఫొయిలేషన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందంతో మెరిసేలా చేస్తుంది. మీ చర్మ స్వభావాన్ని బట్టి, అవసరాలను గమనించుకుంటూ తదనుగుణంగా ఎక్స్ ఫొయిలంట్స్ ను ఉపయోగించాలి. అలాగే చర్మానికి మాయిశ్చరైజర్ బాగా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యరశ్మి
బారిన చర్మం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News