Friday, September 20, 2024
Homeహెల్త్Teeth whitening: ముత్యాల్లాంటి దంతాల కోసం

Teeth whitening: ముత్యాల్లాంటి దంతాల కోసం

మీ పళ్లు పచ్చగా ఎందుకు మారాయో గుర్తించి ఈ చిట్కాలు ప్రయోగించండి

దంతాలను మెరిసేలా చేసే సహజమైన కిటుకులు కొన్ని ఉన్నాయి. దంతాలు పసుపుపచ్చగా కనిపించడానికి వయసు మీద పడడం ఒక కారణమైతే,  యాపిల్స్, బంగాళాదుంపలు వంటివి కూడా దంతాలను పసుపుపచ్చ రంగు వచ్చేలా చేస్తాయి. దంతాల పరిశుభ్రతను పాటించకపోయినా అవి పసుపుపచ్చ రంగులోకి మారతాయి. ఫ్లోసింగ్ చేయడం, మౌత్ వాష్ ఉపయోగించకపోవడం వల్ల కూడా దంతాలు పసుపుపచ్చగా కనిపిస్తాయి. అలాగే టీ, కాఫీలు బాగా తాగడం వల్ల కూడా దంతాలు పసుపుపచ్చగా కనిపిస్తాయి. ఇవి కాకుండా తల, మెడ రేడియేషన్, కిమోథెరపీల వంటి మెడికల్ థెరపీల వల్ల కూడా పండ్లు పసుపుపచ్చగా అవుతాయి. నీళ్లల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటే ఆ నీటిని తాగడం వల్ల కూడా దంతాలు పసుపుపచ్చగా అవుతాయి. కారణం ఏదైనా పసుపు పచ్చరంగులోకి మారిన మీ దంతాలను తళ తళ మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.

- Advertisement -

కొబ్బరినూనెతో నోటిలో ఆయిల్ పుల్లింగ్ చేస్తే దంతాల ఆరోగ్యం బాగుంటుంది. ఇలా చేయడం వల్ల దంతాలు గారపట్టవు. దీంతో దంతాలు తెల్లగా మెరస్తాయి. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ని రెడీ పెట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ను నోట్లో పోసుకుని పది పదిహేను నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేయాలి. తర్వాత దాన్ని ఉమ్మేసి యథావిధిగా పండ్లను రోజూ వాడే టూత్ పేస్టుతో శుభ్రం చేసుకోవాలి.  దంతాలను తోముకోవడానికి ముందు ఉదయం పూట ఆయిల్ పుల్లింగ్ చేస్తే పంటి ఆరోగ్యం బాగుంటుంది. బేకింగ్ సోడాతో పండ్లు తోముకుంటే కూడా చాలా మంచిది. ఒక టీస్పూను బేకింగ్ సోడా, సరిపడినన్ని నీళ్లు, ఒక టూత్ బ్రష్ రెడీ పెట్టుకోవాలి. కొద్దినీళ్లల్లో బేకింగ్ సోడా వేసి చిక్కటి పేస్టులా చేయలి. ఆ పేస్టును టూత్ బ్రష్ పై పెట్టుకుని రెండు నిమిషాల పాటు దంతాలను బాగా తోమాలి. తర్వాత నీళ్లతో నోరును శుభ్రంగా కడుక్కోవాలి. ముత్యాల్లాంటి పండ్ల కోసం రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేయాలి. బొగ్గుపొడితో పండ్లు తోముకున్నా కూడా దంతాలు తళ తళ మెరుస్తాయి. ఇందుకు ఒక టూత్ బ్రష్, యాక్టివేటెడ్ చార్కోల్, సరిపడినన్ని నీళ్లు తీసి పక్కన పెట్టుకోవాలి. తడి బ్రష్ ను నల్లని బొగ్గుపొడిలో పెట్టి దానితో దంతాలను రెండు నిమిషాల పాటు శుభ్రంగా తోముకుని నీళ్లతో నోటిని కడుక్కోవాలి. రోజుకు ఒకసారి ఇలా చేస్తే మీ దంతాలకు స్క్రబ్బింగ్ అయి, వాటికున్న గార పోయి తళ తళ మెరుస్తాయి. హైడ్రోజన్ ఫెరాక్సైడ్ వల్ల కూడా దంతాలు బాగా మెరుస్తాయి. దంతాలు తళ తళలాడాలంటే ఇధి ఒక మంచి ఇంటి చిట్కా. ఇందుకు అరకప్పు 3-5%  హైడ్రోజన్ పెరాక్సైడ్, అరకప్పు నీళ్లు, రెడీ పెట్టుకోవాలి. అరకప్పు నీళ్లల్లో అరకప్పు హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని అర సెకను నుంచి ఒక నిమిషం పాటు బాగా పుక్కిలించాలి. తర్వాత దాన్ని ఉమ్మేసి, నిత్యం మీరు వాడే టూత్ పేస్టుతో దంతాలను శుభ్రంగా తోముకోవాలి. తర్వాత నీళ్లతో నోటిని బాగా పుక్కిలించాలి. ఇలా రోజుకు ఒకసారి చేస్తే చాలు మీ దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి. అయితే ఎక్కువ గాఢత కలిగిన హైడ్రోజన్ పెరాక్సైడ్ ను వాడితే దంతాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే దీన్ని వాడేటప్పుడు వైద్యుల సూచనలను తప్పనిసరిగా తీసుకోవాలి.

నిమ్మ, కమలాపండు తొక్కలు కూడా దంతాలను మెరిసేలా చేస్తాయి. వీటి తొక్కల్లో సిట్రిక్ యాసిడ్ బాగా ఉంటుంది. ఇది దంతాలపై ఏర్పడ్డ మరకలను  పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. దంతాలను తెల్లగా మెరిసేలా చేస్తుంది. నిమ్మ, కమలాపండు తొక్కలు రెండింటిలోనూ యీంటీబాక్టీరియల్ గుణాలు బాగా ఉన్నాయి. అవి నోటిలోని బాక్టీరియాతో ఎంతో శక్తివంతంగా పోరాడతాయి. నోటి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి కూడా. ఇందుకు నిమ్మ లేదా కమలాపండు తొక్కలు దేనితోనైనా దంతాలను బాగా రుద్దుకొని రెండు నిమిషాలు వాటిని అలాగే వదిలేయాలి. తర్వాత రోజూ మీరు ఉపయోగించే పేస్టుతో దంతాలను బ్రష్ చేసుకోవాలి. ఆతర్వాత నీళ్లతో నోటిని శుభ్రంగా పుక్కిలించాలి. నోరు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండడానికి నిత్యం ఒకసారి ఇలా చేస్తే చాలు. ఇంకొక చిట్కా యాపిల్ సిడార్ వెనిగర్.

ఇందులో బ్లీచింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అవి మీ దంతాలను మెరిసేలా చేస్తాయి. దంతాలపై ఏర్పడ్డ మరకలను పోగొడతాయి కూడా. ఇందుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్, ఒక కప్పు నీళ్లను రెడీ పెట్టుకోవాలి. ఒక కప్పు నీళ్లల్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ ని కలపాలి. ఆ నోటిని నోట్లోపోసుకుని ఒక నిమిషం పాటు బాగా పుక్కిలించి ఆ తర్వాత ఉమ్మేయాలి. అనంతరం నోటిని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. దంతాలు శుభ్రంగా ఉండాలంటే పండ్లు తోముకోవడానికి ముందు రోజుకు ఒకసారి ఇలా చేస్తే చాలు. దంతాలను మెరిసేలా చేసే మరో మంచి చిట్కా ఉంది. స్ట్రాబెర్రీలు, బొప్పాయి, పైనాపిల్, కమలా, కివిస్, క్యారట్ల వంటి కూరగాయలలో దంతాలను తళ తళ మెరిపించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దంతాలపై ఉండే ఎనామిల్ పై ఏర్పడ్డ మరకలను ఇవి పోగొడతాయి. వీటిని తరచుగా తింటే దంతాలకు ఎంతో మంచిది.

Homemade teeth whitening recipe made out of coconut oil, turmeric and baking soda – White background

దంతాలను తళ తళలాడేట్టు చేసే సహజ గుణాలు వీటిల్లో ఉన్నాయి. ఇవి కాకుండా దంతాలను తెల్లగా చేసే రెడీమేడ్ ఉత్పత్తులు కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వైటనింగ్ టూత్ పేస్టు, ట్రే బేస్డ్ టీత్ వైట్నర్స్, వైటనింగ్ స్ట్రిప్స్, మౌత్ రిన్స్ వంటివి సైతం మార్కెట్ లో దొరకుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News