Ginger Water Benefits: అల్లం మాత్రమే కాదు..అల్లం నీరు కూడా మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని మీకు తెలుసా? ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అయితే, ఔషధ గుణాలతో నిండిన ఈ పానీయం తాగడం వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో అనేక రోగాల బారిన పడుతూ ఉంటాం. ఈ సమయంలో గొంతు నొప్పి లేదా జలుబు, దగ్గు సమస్య తరచుగా మనల్ని ఇబ్బంది పెడుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉపశమనం పొందడానికి అల్లం నీటిని తాగవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీ బాక్టీరియల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
ఈ సీజన్ లో మన రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఈ సమయంలో మన డైట్ లో అల్లం నీటిని సరైన పరిమాణంలో, సరైన మార్గంలో చేర్చుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ డ్రింక్ మన జీవక్రియను పెంచడమే కాకుండా బరువును నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. అల్లం నీరు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో నిల్వ ఉన్న కేలరీలు త్వరగా కరిగిపోతాయి.
Also read: August Horoscope: గ్రహాల కాలగతిలో పెను మార్పులు.. ఆగస్టులో ఈ రాశులకు అన్నీ శుభవార్తలే..
పేగు ఆరోగ్యానికి కూడా ఈ డ్రింక్ ఎంతో మేలు చేస్తుంది. అల్లం నీటిలో కనిపించే అంశాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్లం నీరు మన గుండెకు ఎంతో మంచిది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం..అల్లం నీరు డయాబెటిస్ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని తాగడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
అల్లం నీటిని ఎలా తయారు చేయాలి?
ముందుగా, ఒక పాన్‌లో ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. ఇప్పుడు దానిలో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి దాదాపు ఈ నీటిని 5 నుండి 10 నిమిషాలు పాటు మరిగించాలి. అనంతరం ఈ నీటిని వడకట్టాలి. మెరుగైన ఫలితాలను కోసం ఈ నీటిని ఉదయం తాగాలి. ఈ పానీయం రుచి కోసం దీనిలో తేనె లేదా నిమ్మకాయను కూడా జోడించవచ్చు.


