Beet Root Benefits: మనం ఆరోగ్యంగా ఉండాలంటే తరచుగా డైట్ లో పండ్లు, తాజా కూరగాయలు చేర్చుకోవాల్సిందే. ఇవి ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, కూరగాయలలో భాగంగా చాలామంది బీట్ రూట్ తినడానికి అంత ఆసక్తి చూపించారు. కానీ ఇది ఒక సూపర్ ఫుడ్ అని మీకు తెలుసా? బీట్ రూట్ లో పొటాషియం, ఐరన్, విటమిన్ b6, సి, ఏ, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుతాయి కూడా! బీట్ రూట్ శరీరంలో రక్తాన్ని పెంచడమే కాకుండా పేగులను శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా చర్మ సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ నేపథ్యంలో బీట్ రూట్ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బీట్ రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ సంబంధిత సమస్యల నుండి రక్షిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి కొలాజెన్ ను తయారు చేయడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది మన చర్మాన్ని బిగుతుగా, మృదువుగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
2. శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటే విటమిన్ తీసుకోవడం ఎంతో మంచిది. ఇందుకోసం బీట్ రూట్ ఒక సులభమైన ప్రభావంతమైన నివారణ. బీట్ రూట్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
3. వాతావరణం మార్పుల కారణంగా చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ సమయంలో బీట్ రూట్ తినడం ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
4. ఇందులో ఉండే నైట్రేట్లు మెదడు కు రక్తప్రసరణను పెంచుతాయి. ఇది మెదడును పదునంగా చేయడంలో సహాయపడుతుంది.
Also Read: Thyroid Health: థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ డ్రింక్స్ ట్రై చేయండి..
5. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కడుపున శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దీని వినియోగం వల్ల కడుపు సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు.
6. బీట్ రూట్ లో బిటానిక్ అనే మూలం ఉంటుంది. ఇది క్యాన్సర్ తో పోరాడడానికి ఎంతో సహాయపడుతుంది. దీని రసం బ్రీస్ట్, పేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదని పలు పరిశోధనలో తేలింది.
7. బరువు తగ్గాలనుకునే వారు బీట్ రూట్ ను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని తింటే చాలా సమయం కడుపు నిండిన భావన కలుగుతుంది.
బీట్‌రూట్‌లో ఉండే పోషకాలు
విటమిన్ సి: 6%
పొటాషియం: 8%
మాంగనీస్: 14%
ఫోలేట్: 20%
ఫైబర్: 3.4 గ్రాములు
కార్బోహైడ్రేట్లు: 6.7 గ్రాములు
ప్రోటీన్: 1.7 గ్రాములు
Also Read: Liver Health: లివర్ ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్..!
బీట్‌రూట్‌ను ఎలా తినాలి?
1. బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి తినవచ్చు
2. బీట్ రూట్ ను పిండిలో కలిపి రోటి లాగా చేసుకొని ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
3. బీట్‌రూట్ చిన్నగా కట్ చేసి జ్యూస్ చేసి చేసుకొని తాగొచ్చు.


