Kiwi Fruit Benefits: కివి అనేది పోషకాలతో సమృద్ధిగా ఉండే పండు. ఇది తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. అధిక విటమిన్ సి కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది. కివి ఒక అద్భుతమైన మూలం పీచు పదార్థం. కివి పండ్ల పోషణలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి ఖనిజాలు ఉంటాయి. ప్రతిరోజూ కివీ తినడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. కివీ జీర్ణ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అనేక ఇతర విధాలుగా కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఇప్పుడు రోజువారీ రెండు కివీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురుంచి తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థ
కివీలో సహజంగా ఆక్టినిడిన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి ఎంతో సహాయపడుతుంది. దీనితో పాటు ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగులు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. రోజూ రెండు కివీలు తినేవారికి మలబద్ధకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
Also Read: Cardamom Tea: యాలకుల టీ తాగుతున్నారా..? నిపుణులు ఏం చెప్తున్నారంటే..
రోగనిరోధక శక్తి
కివీ విటమిన్ సి అద్భుతమైన మూలం. ఒక కివీలో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది వ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యాన్ని బలపరుస్తుంది. రెండు కివీలను క్రమం తప్పకుండా తినడం వల్ల జలుబు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
గుండె ఆరోగ్యం
కివీ పండులో పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో ఎంతో సహాయపడుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
నిద్ర
కివీలో సెరోటోనిన్ ఉంటుంది. ఇది మంచి నిద్ర పొందడానికి హెల్ప్ చేస్తుంది. కివీలు తినడం వల్ల నిద్రలేమి నుండి బయటపడవచ్చు.
Also Read: Cool Water Bath: ప్రతిరోజు చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా..?
చర్మం, జుట్టు
ఇందులో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాం వల్ల చర్మ మెరుపును పెంచుతుంది. అలాగే, ముడతలను తగ్గించి ఇతర చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా దీని వినియోగం ఇది జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తుంది.
బరువు
కివిలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దీంతో కివి పండు తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఇది జీవక్రియను పెంచడం ద్వారా బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


