Tuesday, January 7, 2025
Homeహెల్త్కిడ్నీలు ఫెయిల్ అయ్యే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే..!

కిడ్నీలు ఫెయిల్ అయ్యే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే..!

మానవ శరీరంలో గుండె తర్వాత అత్యంత కీలకంగా పనిచేసే అవయవాలలో కిడ్నీలు ఒకటి. మూత్రపిండాలు మన బాడీలో వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ప్రస్తుతం జీవనశైలి, ఆహారపు అటవాట్లలో మార్పుల కారణంగా ఇవి త్వరగా పాడైపోతున్నాయి. ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే.. డయాలిసిస్‌, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. అంతేకాదు ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే తిరిగి మామూలు స్థాయికి రావటం అసాధ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కిడ్నీ వ్యాధులను తొలిదశలో గుర్తిస్తే త్వరగా దెబ్బతినకుండా, జబ్బు ముదరకుండా చూసుకోవచ్చని అంటున్నారు వైద్యులు.

- Advertisement -

కిడ్నీ వ్యాధి లక్షణాలు: శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి… నిజానికి మూత్రపిండాలు అనారోగ్యంగా ఉంటే ప్రాణ ప్రమాదం పెరుగుతుంది. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు, మొదట కాళ్ళలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. మూత్రపిండాలలో సమస్య వచ్చినప్పుడు.. చీలమండపై మొదటి ప్రభావం పడటం ప్రారంభమవుతుంది. చీలమండలు ఉబ్బడం ప్రారంభమవుతాయి. అలాంటప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. లేదంటే ప్రమాదం తప్పదు. ఇక రక్తంలో విషతుల్యాలు పెరుగుతున్నా కొద్దీ ఆకలి సన్నగిల్లుతుంది. అలాగే వికారంగా అనిపిస్తుంది. దీనివల్ల ఏ ఆహారం తినాలని అనిపించదు. ఫలితంగా బరువు తగ్గుతారు.

మూత్రపిండాల సమస్య ఉంటే నడకలో కూడా సమస్య ఉంటుంది. నెమ్మదిగా కాళ్ళు ఉబ్బడం మొదలెట్టాయి. ఫలితంగా, మీ పాదాలను నేలపై ఉంచడం కష్టమవుతుంది. పాదాల నొప్పి కూడా చాలా భిన్నంగా ప్రారంభమవుతుంది. కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే మన శరీరంలో క్యాల్షియం, ఫాస్ఫేట్‌ వంటి ఖనిజాల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల చర్మం పొడి బారటం, దురద, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే శరీరంలోని వ్యర్థాలు బయటకుపోవు. దీనివల్ల మన బాడీలో ముఖ్యంగా కాళ్లు, మడమలు, పాదాలు, కళ్ల చుట్టూ వాపు వస్తుంది. అలాగే పాదాలు, కళ్లు ఉబ్బడం మొదలవుతాయంట.

కిడ్నీలు దెబ్బతింటే.. మూత్ర విసర్జనలోనూ మార్పులు కనిపించొచ్చు. దీనివల్ల నైట్‌ టైమ్‌లో అధికంగా మూత్రం రావడం, మూత్రం ఉత్పత్తి తగ్గటం, మూత్రంలో రక్తం పడటం, నురగ కనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే రక్తహీనతకు దారితీస్తుంది. దీనివల్ల శరీరంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పడిపోతుంది. దీంతో కండరాలు, కణజాలాలకు తగినంత ఆక్సిజన్‌ అందక నిస్సత్తువ, నీరసం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలసట, నీరసం వల్ల రోజంతా ఇబ్బందిగా ఉంటుంది.

బ్లడ్‌లో వ్యర్థాలు పోగవటం వల్ల మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల ఏకాగ్రత కుదరకపోవటం, తలనొప్పి, తల తేలిపోవటం లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య తీవ్రమైతే మూర్ఛలకూ దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. (గమనిక : ఇక్కడ అందించిన సమాచారం నిపుణులు చెప్పిన వివరాల ఆధారంగా రాసినది.. దీనిని అనుసరించే ముందు.. వైద్యుల సలహా తీసుకోండి.. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News