Fatty Liver Drinks: నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. అందులో ఫ్యాటీ లివర్ సమస్య ఒకటి. ఇప్పుడు ఈ సమస్య సాధారణమైంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం. క్రమంగా ఇది తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ఈ ఫ్యాట్య్ లివర్ సమస్యను లైట్ తీసుకుంటే లివర్ సిర్రోసిస్, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, జీవనశైలిలో మార్పులు చేసుకుని కొన్ని పానీయాలను ఆహారంలో చేర్చుకుంటే ఫ్యాటీ లివర్‌ను పూర్తిగా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉండే డ్రింక్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
గ్రీన్ టీ:
గ్రీన్ టీ ఆరోగ్యానికి ఒక వరంలా పరిగణిస్తారు. ఇందులో కాటెచిన్లు ఉంటాయి. ఇవి చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇది కాలేయంలో కొవ్వు జీవక్రియను ప్రోత్సహిస్తుంది. కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రీన్ కాలేయ వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. తరచుగా గ్రీన్ టీ తీసుకుంటే కాలేయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
also read:Banana: రోజూ రెండు అరటి పండ్లు తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
బ్లాక్ కాఫీ:
పాలు, చక్కెర లేకుండా ఉండే బ్లాక్ కాఫీ కొవ్వు కాలేయ వ్యాధి ఉన్న రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఫైబ్రోసిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కాలేయ వాపును కూడా తగ్గిస్తుంది. లివర్ లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
బీట్‌రూట్ జ్యూస్:
బీట్‌రూట్ రసం పోషకాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల నిధి. ఇది బీటైన్, బెటాలైన్ వంటి సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. అన్తకేకాకుండా ఆక్సీకరణ ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అదనంగా, ఇందులో ఉండే నైట్రేట్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఇది కాలేయ పనితీరుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బీట్‌రూట్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ ఇందులో సహజ చక్కెరలు కూడా ఉంటాయి. కాబట్టి, దీనిని మితంగా త్రాగాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


