Drumstick Benefits: మునగకాయ కాయలు మాత్రమే కాకుండా దాని ఆకులు, పువ్వులు, విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మునగకాయలో ప్రోటీన్, ఇనుము, కాల్షియం, విటమిన్ ఎ, సి, వంటి అనేక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక సస్థానం ఉంది. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉంటయి. మునగకాయను ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. దీనిని పొడి, కూరగాయలు, సూప్ లేదా కషాయాలను తయారు చేయడం ద్వారా తీసుకోవచ్చు. అయితే, ఇప్పుడు మునగకాయలు తినడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మునగకాయలో విటమిన్ సి, ఎ, వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఎంతో సహాయపడుతాయి. దీనిని తినడం ద్వారా వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండొచ్చు. వీటిని పిల్లలు, వృద్ధులకు ఎక్కువ మొత్తంలో తమ డైట్ లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి సహజ రోగనిరోధక శక్తిని పెంచేదిగా పనిచేస్తుంది.
మధుమేహ రోగులు మునగకాయ మేలు చేస్తుంది. మునగ ఇన్సులిన్‌ను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. దీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర శోషణ నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. దీనితో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
Also Read: Healthy Fruits: వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్లంతా తప్పక తినాల్సిన పండ్లు..
ఎముకలు బలహీనంగా ఉన్నవారు మునగకాయను తీసుకోవాలి. ఎందుకంటే మునగకాయలో కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో ఎంతో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా మునగకాయలు వృద్ధులకు, మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆస్టియోపోరోసిస్, కీళ్ల నొప్పుల వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
మునగకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రేగులను సైతం శుభ్రపరుస్తుంది. దీనితో పాటు, కడుపులో గ్యాస్, ఆమ్లత్వం, వాపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మునగకాయలో యాంటీ-ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ E, C చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. జుట్టును కుదుళ్ల నుండి బలపరుస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.


