Friday, November 22, 2024
Homeహెల్త్Vinegar wonders: వెనిగర్ తో మెరుపులు

Vinegar wonders: వెనిగర్ తో మెరుపులు

వెనిగర్ వంటకాల తయారీలో రారాణి. వంటకాలకు ఎంతో రుచిని ఇచ్చే వెనిగర్ వంటింటితో పాటు వంటపాత్రలను, అలాగే టాయ్లెట్లను సైతం శుభ్రంగా ఉంచడంలో శక్తివంతమైన క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. పైగా వెనిగర్ నాన్ టాక్సిక్ మరియు ఎకోఫ్రెండ్లీ కూడా. వైట్ వెనిగర్ క్లీనింగ్ కు ఎంతో బాగా ఉపకరిస్తుంది. ఇందులో కలరింగ్ ఏజెంట్ ఉండదు కాబట్టి దీన్ని వాడినపుడు పాత్రలపై ఎలాంటి మచ్చలు,

- Advertisement -

మరకలు ఏర్పడవు. ముదురు రంగు ఉన్న వెనిగర్ తో పాత్రలను శుభ్రం చేస్తే ఆ రంగు మరకలు పాత్రలపై పడే అవకాశం ఉంటుంది.క్లీనింగుకు వాడే డిస్టిల్డ్ వైట్ వెనిగర్ లో ఐదు శాతం మాత్రమే ఎసిడిటీ ఉంటుంది. నిత్యం మనం వాడే బహుళ ప్రయోజనాలున్న క్లీనర్స్ లో కూడా ఎసిడిటీ ఐదు శాతం ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అయితే వైట్ వెనిగర్ కు కొద్దిగా వాసన వచ్చే గుణం ఉంది. ఆ వాసన పడని వాళ్లు క్లీనింగుకు యాపిల్ సిడార్ వెనిగర్ ని వాడొచ్చు. వైట్ డిస్టిల్డ్ వెనిగర్ లో ఉన్న క్లీనింగ్ గుణాలే ఇందులోనూ ఉంటాయి. అయితే యాపిల్ సిడార్ వెనిగర్ ముదురు రంగులో ఉంటుంది కాబట్టి దీన్ని క్లీనింగ్ ఏజెంటుగా ఉపయోగించే ముందు అందులో కొన్నినీళ్లు పోసి పలచగా చేసి వాడాల్సి ఉంటుంది.

వెనిగర్ ను క్లీనర్ గా ఉపయోగించేటప్పుడు వెనిగర్, నీళ్లు కలిపిన మిశ్రమంలో ఎసెన్షియల్ ఆయిల్ అంటే లెమన్ ఆయిల్ లేదా, లవండర్ ఆయిల్ లేదా పెప్పర్ మెంట్ ఆయిల్ చుక్కలు కొన్నివేస్తే వెనిగర్ వాసన రాదు. రెండు పాళ్లు వెనిగర్, ఒక పాలు నీళ్లు కలిపిన మిశ్రమాన్ని గ్లాసు సర్ఫేసులపై చల్లి పొడి గుడ్డతో తుడిస్తే అవి తళ తళ మెరుస్తాయి. గ్రెనైట్, పాలరాయి తో వేసిన గచ్చుపై మాత్రం వెనిగర్ ని వాడకూడదు. వంటింట్లోని వంటపాత్రల దగ్గర చీమలు చేరకుండా కూడా వెనిగర్ అడ్డుకుంటుంది. బాత్రూముల్లోని షవర్

వాల్స్, టబ్స్ శుభ్రంగా ఉండాలంటే నీరు కలపని వైట్ వెనిగర్ చల్లి కొద్దిసేపు అలాగే ఉంచి ఆ తర్వాత నీటితో కడిగితే చాలు. టాయిలెట్ పిట్ లో నీళ్లు కలపని వైట్ వెనిగర్ పోసి మూడు గంటలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత టాయిలెట్ బ్రష్ తో, ఫ్లష్ తో పిట్ ను కడిగితే అది తెల్లగా మెరుస్తుంది. అలాగే డిష్ వాషర్ లో ఏర్పడ్డ సర్ఫ్ పౌడర్ మరకలు పోవాలంటే ఒక కప్పు వెనిగర్ డిష్ వాషర్ లో పోసి ఆన్ చేస్తే చాలు ఆ మరకలు శుభ్రంగా పోతాయి. పాత్రలపై ఏర్పడిన నల్లటి మొండి మరకలు పోవడానికి వైట్ వెనిగర్, వంటసోడా, ఉప్పు, నిమ్మరసం కలిపిన మిశ్రమంతో తోమి కాసేపు అలాగే వదిలేయాలి. ఆతర్వాత లిక్విడ్ వాష్ తో వాటిని తోమి శుభ్రంగా కడగాలి. ఇలా చేస్తే పాత్రలు మిల మిల మెరిసిపోతాయి. కొంతకాలం వాడిన తర్వాత వంటింట్లో ఉండే బండపై జిడ్డు, మొండి మరకలు ఏర్పడతాయి. వైట్ వెనిగర్, లిక్విడ్ డిటర్జెంట్, ఉప్పు, నిమ్మరసం కలిపి తయారుచేసిన ద్రావకాన్ని బండపై, స్టవ్ ను ఆనుకుని గోడపై

చల్లి కాసేపు అలాగే ఉంచి ఆ తర్వాత పొడిగుడ్డతో తుడిస్తే మొండి మరకలు పోతాయి. కాఫీ మేకర్లు, మైక్రోవేవ్, ఫ్రిజ్ లను శుభ్రం చేయడానికి వైట్ వెనిగర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి చేయాల్సిందల్లా వైట్ వెనిగర్ లో కొద్దిగా గోరువెచ్చని నీళ్లు, ఉప్పు, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంలో స్పాంజిని ముంచి దానితో ఫ్రిజ్, మైక్రోవేవ్ లను తుడవాలి. వాటిని కాసేపు ఆరనిచ్చిన తర్వాత పొడి

గుడ్డతో తిరిగి ఫ్రిజ్, మైక్రోవేవ్ లను తుడవాలి. ఇలా చేస్తే వాటిపై ఎన్నో రోజుల నుంచి పేరుకున్న దుమ్ము, బంక పోయి శుభ్రంగా ఉంటాయి. వంటింటి గట్టుతో పాటు జిడ్డుగా ఉన్న స్టవ్ ను, పాన్, స్టెయిన్ లెస్ స్టీలు పాత్రలు, టీ కెటల్స్ వంటి వాటిని కూడా వెనిగర్, నీళ్లు కలిపిన ద్రావకంతో శుభ్రం చేయొచ్చు. వెనిగర్ లో కొన్ని నీళ్లు పోసి పలచగా చేసి స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి. దానితో సింకు కడిగితే దుర్వాసన

రాదు. వెనిగర్ వాసన రాకూడదనుకుంటే సోపు నీళ్లతో సింకు కడిగితే చాలు. అలాగే వెనిగర్, నీళ్లు కలిపిన మిశ్రమంతో నేలను తుడిస్తే శుభ్రంగా ఉంటుంది. నేలపై ఉండే జిడ్డు మరకలను, దుమ్మును వెనిగర్ పోగొడుతుంది. ఎనామిల్ పాత్రలు శుభ్రంగా ఉండడానికి వెనిగర్, నీళ్లు రెండింటినీ కలిపి ఉడికించి ఆ నీటితో ఆ పాత్రలను తోమితే తళ తళ మెరుస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News