Saturday, October 5, 2024
Homeహెల్త్What to do for Black hair?: బ్లాక్ హెయిర్ కోసం ఈ ట్రిక్

What to do for Black hair?: బ్లాక్ హెయిర్ కోసం ఈ ట్రిక్

ఇటి ట్రై చేస్తే రిజల్ట్ సూపర్ గా ఉంటుంది

నల్లటి కురుల కోసం…

- Advertisement -

శిరోజాలు చిట్లకుండా, తెల్లబడకుండా నల్లగా నిగ నిగ లాడాలని ఉంటుంది. ఇందుకు మీ హెయిర్ కేర్ రొటీన్ లో మందారపువ్వును కూడా చేరిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీని వల్ల జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు సమస్య నివారింపబడుతుంది. ఇలాంటి మరెన్నో లాభాలు పొందుతుంది.
అదెలా అంటే..
హెయిర్ రిన్స్:
మందారం పువ్వు నీళ్లను వెంట్రుకలపై అప్లై చేస్తే మంచి ప్రభావం కనిపిస్తుంది. డల్ గా ఉన్న జుట్టు నల్లగా నిగ నిగ లాడుతుంది. ఆ మందార నీళ్లు ఎలా తయారుచేయాలంటరా? పావు కప్పు ఎండిన మందారరెక్కలు, ఒకటిన్నర కప్పు నీళ్లు, ఒక టీస్పూను గ్లిజరిన్, ఒక టీస్పూను ఆలివ్ ఆయిల్, ఐదు చుక్కల లవండర్ ఆయిల్ లను తీసుకోవాలి. మొదట అరకప్పు నీళ్లు తీసుకుని అందులో ఎండిన మందార రెక్కలను వేసి ఐదునిమిషాలు బాగా ఉడికించాలి. మరిగిన ఆ పువ్వు నీళ్లను స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. తర్వాత అందులో టీస్పూను గ్లిజరిన్, ఒక స్పూను ఆలివ్ ఆయిల్, ఐదు చుక్కల లవండర్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆ మందార నీటిని వడగట్టి శుభ్రంగా ఉన్న స్ప్రే బాటిల్ లో పోయాలి.

అంతే మందార హెయిర్ రిన్స్ రెడీ. దాన్ని వెంట్రుకలపైనే కాకుండా కుదుళ్ల వరకూ చేరేలా స్ప్రే చేసుకోవాలి. పొడుగైన వెంట్రుకల కొసళ్ల వరకూ మందారనీళ్లను స్ప్రే చేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు తలను మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత షవర్ క్యాప్ వెంట్రుకలపై పెట్టుకుని ఒకటి నుంచి రెండు గంటలపాటు అలాగే ఉంచుకోవాలి. అనంతరం షాంపుతో తలను రుద్దుకోవాలి. స్పెషల్ హెయిర్ కేర్ కోసం మరోపద్ధతిలో కూడా మందార పువ్వులతో మందారనీటిని తయారుచేయొచ్చు. రెండు మందార పువ్వులను, ఐదారు మందార ఆకులను, ఒక పెద్ద బౌల్ నిండా నీటిని తీసుకోవాలి. మందార పువ్వులను, ఆకులను నీళ్లల్లో ముందురోజు రాత్రే వేసి ఉదయం వరకూ నానబెట్టాలి. పొద్దున్న లేచిన తర్వాత ఆ నీళ్లల్లోని మందార పువ్వులను, ఆకులను మెత్తగా చిదమాలి. తర్వాత ఆ నీటిని ఒడగొట్టాలి. తలకు షాంపు పెట్టుకుని స్నానం చేసిన తర్వాత ఈ మందారపువ్వుల నీటిని వెంట్రుకలకు ఉపయోగించాలి. ఇది

వెంట్రుకలకు నేచురల్ కండిషనర్ గా పనిచేస్తుంది. వెంట్రుకల్లో నూనె ఉంటే ఈ నీటిని వాడడం వల్ల ప్రయోజనం ఉండదు. తలకు షాంపు పెట్టుకుని స్నానం చేసిన తర్వాత మందార నీటిని మాడుకు, వెంట్రుకలకు పట్టించి మర్దనా చేసుకున్నట్టు రాసుకొని వెంట్రుకలు పొడారిపోయేవరకూ అలాగే ఉంచుకోవాలి. జుట్టు ఆరడానికి హీటింగ్ ప్రొడక్టులేవీ వెంట్రుకలపై ఉపయోగించొద్దు.
మందార పువ్వులను జుట్టుకు ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

మందారపువ్వులో విటమిన్ సి ఉంది. మందార నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్ల వెంట్రుకలు రాలిపోవు. చుండ్రు తగ్గుతుంది. మందార పువ్వులో యాంటిఫంగల్ సుగుణాలు ఉండడం వల్ల ఈ నీటితో తలను రుద్దుకోవడం వల్ల మాడుపై ఎలాంటి ఇన్ఫక్షన్లు తలెత్తవు. ఈ పువ్వులో యాంటీ ఫంగల్ తో పాటు యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకే చుండ్రు సమస్య కూడా తలెత్తదు. మందారనీటితో జుట్టు రుద్దుకోవడం వల్ల వెంట్రుకలకు కావలసిన హైడ్రేషన్ సైతం అందుతుంది. వెంట్రుకలు పొడారినట్టు అవవు. జుట్టు నల్లగా నిగ నిగలాడుతుంటుంది. మందారనీళ్లను దీర్ఘకాలం వాడితే వెంట్రుకలపై మంచి ఫలితాలు కనిపిస్తాయి.

మందారపువ్వులతో హెయిర్ మాస్కు:
వెంట్రుకలు ద్రుఢంగా ఉండాలంటే మందారపువ్వులతో హెయిర్ మాస్కు చేసుకుని దాన్ని రాసుకుంటే మంచి ఫలితాలు చూడొచ్చు. ఈ మాస్కు తయారీ సింపుల్. ఒక మందారపువ్వు, మూడు లేదా నాలుగు మందార ఆకులు, నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి. మందారపువ్వను, ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఆ పేస్టులో పెరుగు వేసి కలపాలి. అంతే వెంట్రుకలకు ఆరోగ్యకరమైన, సహజసిద్ధమైన మందార హెయిర్ మాస్కు రెడీ. ఈ హెయిర్ మాస్కును మాడుకు, వెంట్రుకలకు బాగా పెట్టుకోవాలి. అరగంట వరకూ దాన్ని అలాగే వదిలేస్తే ఈ మాస్కును వెంట్రుకల కుదుళ్లు సైతం గ్రహిస్తాయి. తర్వాత షాంపుతో తలను రుద్దుకోవాలి. తలరుద్దుకోవడానికి గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలని మరవొద్దు. ఈ మాస్కును వారానికి రెండుసార్లు జుట్టుకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టు నల్లగా నిగనిలాడుతూ మెరుస్తుంటుంది.

జుట్టురాలిపోకుండా:

జుట్టు రాలిపోయే సమస్య కూడా మందారపువ్వు వాడకం వల్ల తగ్గుతుంది. మందారపువ్వు జ్యూసును జుట్టుకు, మాడుకు రాసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకూ అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలను, వెంట్రుకలను శుభ్రం చేసుకోవాలి. ఇలా మందారపువ్వులతో మీ వెంట్రుకలను అందంగా…ఆరోగ్యంగా మలచుకోండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News