ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. బయటికి వెళ్తే చాలు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నేపథ్యంలోనే ఎక్కువగా శీతల పానీయాలకు, కర్బూజ, దోస, తాటి ముంజలకు, నీటిని చల్లగా ఉంచే కుండలకు భలే గిరాకీ ఉంటుంది. ఇందులో మరి ముఖ్యంగా టెర్రకోట మట్టి కుండలకు భలే గిరాకీ పెరిగింది. ఇక్కడ తయారయ్యే మట్టి కుండలు నాణ్యతగా ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. ఇక్కడ తయరయ్యే కుండలు దేశ, విదేశాలకు ఎగుమతులు అవుతుంటాయి. దీంతో భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. ఇక్కడి తయారీదారులను దేశ ప్రధాని మోదీ సైతం మెచ్చుకున్నారు.
మట్టి పాత్రలకు ప్రాధాన్యం
మనిషి జీవన శైలీ మారటంతో మట్టి పాత్రల వాడకం తక్కువ అయిపోయింది. వీటి స్థానంలో అల్యూమినియం పాత్రలు, ఇనుము, నాన్ స్టిక్ వాడుకలోకి వచ్చాయి. ఇప్పుడు ఎవరి ఇంట్లో చూసిన ఈ పాత్రలే వంటగదిలో దర్శనమిస్తున్నాయి. వీటి వాడకంతో అనారోగ్య సమస్యలు కూడ వస్తున్నాయి. దీంతో మనిషి తిరిగి మట్టి పాత్రలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇక్కడ తయారయ్యే కుండలు పలు రాష్ట్రాలకు ఎగుమతి
పలమనేరులోని బెంగళూర్ టూ చెన్నై వెళ్లే జాతీయ రహదారి సమీపంలో గంటావురు కాలనీలో తయారయ్యే కుండలకు బెంగళూరు, కర్ణాటక ,చెన్నై ,పాండిచ్చేరి వ్యాపారస్తులు క్యూ కడుతున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో సుమారు 40 కుటుంబాలు ఈ కుండలు తయారీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు మట్టి కుండల తయారీలో నాణ్యత విషయంలో ఎక్కడ రాజీపడరు. దీంతో టెర్రకోట కుండలు ఎర్రకోటకు పాకే విధంగా పేరు సంపాదించుకున్నారు.
అన్ని రకాల మట్టి పాత్రలు
వీరి వద్ద అన్ని రకాల మట్టి కుండలు, బొమ్మలు ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా చల్లదనం ఇచ్చే నీళ్ల కుండలు, వాటర్ బాటిల్స్, మగ్గులు, మట్టి కూజాలు, ముంతలు, చిన్న కుండలు, పెద్ద కుండలు తక్కువ ధరకే లభిస్తాయన్నారు. మట్టి కడవలోని నీరు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మట్టి కుండలే ఆరోగ్యం
దీంతో వేసవి కాలం వచ్చేయటంతో చల్లదనం కోసం కొంత మంది మట్టి కుండలకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ప్రత్యేకంగా మట్టి వాటర్ బాటిల్స్, జగ్, కడవలు, కూజాలు రూ.20 నుండి రూ.250 వరకు ఇక్కడ అమ్మకాలు చేస్తున్నారు. వీటిలో నీరు నిల్వ చేసుకుని తాగటం వల్ల దప్పిక తీరటమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయని అంటున్నారు ఇక్కడి వ్యాపారులు.
Terracotta pots: ఇక్కడ తయారయ్యే కుండలకు ఎందుకంతా గిరాకీ అంటే..?
- Advertisement -