Monday, December 9, 2024
Homeహెల్త్Yashoda hospitals: ఊపిరితిత్తుల స్ట్రోక్ ఎటాక్ పేషెంట్ కు కొత్త జీవితాన్నిచ్చిన యశోద హాస్పిటల్స్

Yashoda hospitals: ఊపిరితిత్తుల స్ట్రోక్ ఎటాక్ పేషెంట్ కు కొత్త జీవితాన్నిచ్చిన యశోద హాస్పిటల్స్

బ్రెయిన్-హార్ట్ స్ట్రోక్ లానే లంగ్స్ లోనూ

తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో ఇప్పటికే ఎన్నో అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చి ఎంతో మంది పేషెంట్ల ప్రాణాలను కాపాడిన యశోద హాస్పిటల్స్, ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు చెందిన 20ఏళ్ల విద్యార్ది మాలి రిషికేష్ కు గుండె నుండి ఊపిరితిత్తులకు ఆక్సిజన్ లేని రక్తాన్ని తీసుకువెళ్లే రక్త నాళాలు పల్మనరీ ఆర్టరీ (పుపుస ధమనుల)లో ఏర్పడ్డ బ్లడ్ క్లాట్స్ వల్ల ఊపిరితిత్తులకు రక్తప్రవాహం ఆగిపోవడంతో “పల్మనరీ ఎంబోలిజం” ఏర్పడి తీవ్రమైన అస్వస్థతతో ప్రాణాపాయ స్థితిలో యశోద హాస్పిటల్ కు వచ్చిన రిషికేష్ కు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక ఇనారీ మెడికల్ డివైస్ “పల్మనరీ థ్రోంబెక్టమీ”తో బ్లడ్ క్లాట్స్ ని తొలగించి రిషికేష్ కి కొత్త జీవితాన్నిచ్చిన యశోద హాస్పిటల్స్ వైద్యులు.

- Advertisement -

గుండె పోటు లాంటిదే ఇది కూడా
ఈ సందర్బంగా యశోద హాస్పిటల్స్ గ్రూప్, డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి, మాట్లాడుతూ పల్మనరీ ఎంబోలిజం (PE) అనేది గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ లాంటిదే, పల్మనరీ ఎంబోలిజంలో సాధారణంగా కాళ్ల లోతైన సిరలలో ఏర్పడే బ్లడ్ క్లాట్స్(డీప్ వెయిన్ థ్రాంబోసిస్, DVT) రక్తప్రవాహం ద్వారా ఊపిరితిత్తులకు ప్రయాణించి, ఊపిరితిత్తుల ధమని అడ్డుకుంటుంది. బ్లడ్ క్లాట్స్ ఊపిరితిత్తుల ధమనులను అడ్డుకోవడం వల్ల గుండె ఆగిపోవడం, పల్మనరీ ఇన్ఫార్క్షన్ (ఊపిరితిత్తుల స్ట్రోక్), గుండె వైఫల్యం, క్రానిక్ థ్రోంబోఎంబాలిక్ పల్మనరీ హైపర్‌టెన్షన్ (CTEPH), పల్మనరీ ఎంబోలిజం షాక్ వంటి తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితులకు దారితీయవచ్చు. సరిగ్గా రిషికేష్ విషయంలో ఇదే జరిగింది. USAలో అభివృద్ధి చేసిన అత్యాధునిక ఇనారీ మెడికల్ డివైస్ “పల్మనరీ థ్రోంబెక్టమీ” భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా యశోద హాస్పిటల్స్ లో అందుబాటులోకి తేవడం చాలా సంతోషంగా ఉందని, డాక్టర్. పవన్ గోరుకంటి, తెలిపారు.


పల్మనరీ థ్రోంబెక్టమీ అంటే

యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్. సి. రఘు, మాట్లాడుతూ… కరీంనగర్ జిల్లాకు చెందిన 20ఏళ్ల విద్యార్ది రిషికేష్ అక్టోబర్ 28న తీవ్రమైన ఛాతి నొప్పి, ఊపిరి తీసుకోలేని స్థితిలో అత్యంత విషమపరిస్థితిలో వచ్చిన రిషికేష్ ను అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ కి తరలించి పరీక్షలు చేసిన తరువాత రిషికేష్ తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజంతో బాధపడుతున్నట్లు గుర్తించి అదే విషయాన్ని రిషికేష్ కుటుంబసభ్యులకు వివరించి, వారి ఆమోదంతో అత్యాధునిక “పల్మనరీ థ్రోంబెక్టమీ” నిర్వహించి రిషికేష్ ను ప్రాణాపాయస్థితి నుండి కాపాడడం జరిగింది. పల్మనరీ ఎంబోలిజం(PE) సాంప్రదాయిక చికిత్స, థ్రోంబోలిటిక్స్ అని పిలువబడే బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్స్, రక్తం మరింత గడ్డకట్టడాన్ని నిరోధించడానికి, కొత్త గడ్డలు ఏర్పడకుండా నిరోధించడానికి, ఇప్పటికే ఉన్న గడ్డ పెరగకుండా ఆపడానికి సహాయపడుతుంది. అయితే రక్తం గడ్డ కట్టడం అది అతుక్కొని గట్టిగా మారే ప్రారంభ దశలో కొన్ని రోజులలో మాత్రమే థ్రోంబోలిటిక్స్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజం(PE) కేసులలో, సర్జికల్ ఎంబోలెక్టమీ, ఓపెన్ సర్జరీ లేదా పల్మనరీ ధమనుల నుండి నేరుగా గడ్డను తొలగించడానికి ఒక ఇన్వాసివ్ ప్రక్రియ నిర్వహిస్తారు. కానీ ఈ ఇన్వాసివ్ ప్రక్రియలో అధిక సంక్లిష్టతలు ఉన్నందున ఈ శస్త్రచికిత్సను ఎంపిక చేయడం రిస్క్. USAలో అభివృద్ధి చేసిన అత్యాధునిక ఇనారీ మెడికల్ డివైస్ “పల్మనరీ థ్రోంబెక్టమీ” (PT) అనేది ఊపిరితిత్తుల నుండి బ్లడ్ క్లాట్స్ ను తొలగించడం ద్వారా పల్మనరీ ఎంబోలిజం పేషెంట్లకు చికిత్స చేయడంలో సహాయపడే అతితక్కువ ఇన్వాసివ్ ప్రక్రియ. ఇది ప్రస్తుతం గుండెపోటు మరియు బ్రెయిన్ స్ట్రోక్‌కి ఇచ్చే చికిత్సకు సమానంగా ఉంటుంది, ఇది కాథెటర్ ఆధారిత బ్లడ్ క్లాట్ రిమూవల్, అత్యుత్తమ ఫలితాల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అత్యుతమ హై-ఎండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, రిస్క్ స్ట్రాటిఫైయింగ్ టూల్స్ ద్వారా క్లాట్స్ ను గుర్తించడం, హై-రిస్క్ పల్మనరీ ఎంబోలిజం పేషెంట్ల కోసం ఈ అత్యాధునిక ఇనారీ మెడికల్ డివైస్ “పల్మనరీ థ్రోంబెక్టమీ” ఒక అద్బుత వరం. మెకానికల్ థ్రోంబెక్టమీ ద్వారా ఊపిరితిత్తుల నుండి బ్లడ్ క్లాట్స్ ను తొలగించడం వలన పేషెంట్ వేగంగా కోలుకోవడం, తక్కువ సమయం ICU, ఆసుపత్రిలో ఉండడం, రక్తస్రావం సమస్యలు, పల్మనరీ హైపర్‌టెన్షన్ అభివృద్ధి వంటి దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయని, డాక్టర్. సి. రఘు, తెలియజేసారు.

తక్కువ టైంలోనే రీకవరీ
యశోద హాస్పిటల్ సికింద్రాబాద్‌లోని బహుళ విభాగాల వైద్యులు, డాక్టర్. సి. రఘు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్. హరి కిషన్ గోనుగుంట్ల, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, డాక్టర్. విక్రమ్ నాయుడు కార్డియో-థొరాసిక్ అనస్తీటిస్ట్, డాక్టర్. హేమలత కార్డియాక్ ఇంటెన్సివిస్ట్ కలిసి టీమ్ లీడ్ చేశారు. యశోద హాస్పిటల్స్ లో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందం 24 గంటల పర్యవేక్షణతో రిషికేష్ చాలా తక్కువ సమయంలో అద్భుతమైన రికవరీ సాధించి కేవలం ఐదు రోజులలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయగలిగామని, డాక్టర్. సి. రఘు, తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News