Saturday, November 23, 2024
Homeఇంటర్నేషనల్Canada Durham Telugu club Diwali celebrations: కెనడా టొరంటో డుర్హం తెలుగు క్లబ్...

Canada Durham Telugu club Diwali celebrations: కెనడా టొరంటో డుర్హం తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు

టొరంటోలో దీపావళి వెలుగులు జిలుగుల మధ్య తెలుగు కుటుంబాల సంబరాలు

కెనడా టొరంటో డుర్హం తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. డుర్హం తెలుగు క్లబ్ వారు నిర్వహించిన గ్రాండ్ దీపావళి వేడుకలకు 800కు పైగా తెలుగు కుటుంబాలు విచ్చేసి అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆటపాటలతో చిన్నారులు అలరించారు.

- Advertisement -
  • నగరంలో ప్రసిద్ధి గాంచిన ‘గెట్ హోమ్ రియాల్టీ’ అధినేతలు ఆనంద్ పేరిచర్ల, రమేష్ గోల్లు, రఘు జూలూరి ఈ కార్యక్రమానికి చేయూత అందించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విత్బ్య్ నగర ఎంపీపీ లాన్ కాయ్, డిప్యూటీ మేయర్ మలీహా షాహిద్ విచ్చేశారు. ఇంత కన్నుల పండుగ వేడుకలు నిర్వహిస్తున్న డీటీసీ కార్యసభ్యులను, వాలంటీర్ లను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంటర్ ప్రెన్యూర్ అఫ్ ది ఇయర్ గా అవంత్ సొల్యూషన్స్ అధినేత శ్రీనివాస్ వర్మ అట్లూరి ఎంపిక అయ్యారు. వారికి ఎంపీపీలానే కాయ్ అవార్డును అందచేసి సత్కరించారు.

  • డుర్హం తెలుగు కెనడా క్లబ్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి గారు దీపావళి సంస్కృతిని చక్కగా వివరించి ఈ వేడుకలను విజయవంతం చేసిన తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వెంకట్ చిలువేరు మాట్లాడుతూ దీపావళి వేడుకలు ఖండాంతరాలు దాటి మన తెలుగు సంస్కృతిని ఇనుమడింప చేసిన ప్రతి తెలుగు వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
  • 800 మందికి పైగా తెలుగు కుటుంబాలు ఒక చోట కలుసుకొని పండగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అందరూ అభిప్రాయపడ్డారు. చివరగా డుర్హం తెలుగుకెనడా క్లబ్ స్పాన్సర్లకు ముఖ్యంగా ఈ కార్యక్రమం స్పాన్సర్లకు మరియు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, షడ్రసోపేతమైన వంటకాలతో అతిదులందరూ విందు ఆరగించాక కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా DTC EC టీమ్ ఫుడ్ డ్రైవ్ చేసి ఫుడ్ ఐటమ్స్ ని సాల్వేషన్ ఆర్మీ కమ్యూనిటీ సర్వీస్ టీమ్ కి అందచేసారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News