Sunday, July 14, 2024
HomeతెలంగాణGarla: మలిదశ ఉద్యమకారుడు శీలంశెట్టి ప్రవీణ్ కుమార్ ఆవేదన

Garla: మలిదశ ఉద్యమకారుడు శీలంశెట్టి ప్రవీణ్ కుమార్ ఆవేదన

ఉద్యమకారులకు పలు విధాల అండ..

మా పాలన మాకు కావాలని ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తెలంగాణ వచ్చుడో లేక సచ్చుడో అనే నినాదంతో ఉద్యమంలో పోరాడి పోలీసుల లాఠీ దెబ్బలకు వెరవకుండా అనేక కేసుల పాలైనా బెదిరిపోకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు మారిపోతాయనే ఆశతో తమ జీవితాలను నాశనం చేసుకొని భార్యా పిల్లలను తల్లిదండ్రులను వదిలి నేలల తరబడి జైలు జీవితాన్ని అనుభవించి సాధించిన తెలంగాణ ఉద్యమ ప్రభుత్వం లో ఉద్యమకారులకు ఒరిగిందేమిటనే చర్చ జోరుగా ప్రారంభించారు శీలంశెట్టి.

- Advertisement -

కనీస గౌరవం గుర్తింపు కూడా లేకుండా పోయిందని మలిదశ ఉద్యమకారుడు శీలంశెట్టి ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే పరిస్థితి మారుతుందని గట్టిగా ప్రచారం చేస్తున్న శీలంశెట్టి, కాంగ్రెస్ అధికారంలోెకి వస్తే ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయింపు తెలంగాణ ఉద్యమంలో అమరులైన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నెలవారి పెన్షన్ 25 వేల రూపాయల తో పాటుగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇలా అనేక సదుపాయాలు కల్పిస్తామని మేనిఫెస్టో ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News