నేపాల్ లో ఈరోజు మధ్యహ్నం 2:28 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. నేపాల్ వచ్చిన భూకంపం ధాటికి ఢిల్లీలోనూ కొన్ని సెకెన్ల పాటు భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఈమేరకు ప్రకటన చేసింది. ఉత్తరాఖండ్ కు తూర్పున నేపాల్ లో ఉన్న పిథోరాగఢ్ అనే ప్రాంతానికి 148 కిలోమీటర్ల సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీలో భూకంపం రావటంతో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంత వాసులు భయంతో పరుగులు పెట్టారు. సీలింగ్ ఫ్యాన్లు, సామాన్లు కదలటాన్ని రాజధాని ప్రజలు స్పష్టంగా గుర్తించారు. సుమారు ఒక నిమిషంపాటు దేశ రాజధానిలో ఈ ప్రకంపనలు సంభవించాయి.
Earth quake: ఢిల్లీలో భూకంపం, చుట్టు పక్కల కూడా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES