రష్యాకు సాయం చేస్తోందన్న వంకతో.. హైదరాబాద్‌కు చెందిన లోకేష్ మెషీన్స్ సంస్థపై అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా తమ దేశంలో ఆయుధాలు తయారు చేసేందుకు అవసరమైన కొన్ని యంత్రాల విడిభాగాలను ఆ దేశానికి లోకేష్ మెషీన్స్ సంస్థ ఎప్పటి నుంచో సరఫరా చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఆయుధాల తయారీకి సాయం చేస్తోందని లోకేష్ మెషీన్స్ మీద అమెరికా ఆర్థిక శాఖ కొన్ని ఆంక్షలు విధించింది. అయితే, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో లోకేష్ మెషీన్స్ తయారు చేస్తున్న అస్మి అనే తరహా మెషీన్ పిస్టల్స్‌ను తాము కొనుగోలు చేస్తామంటూ భారత సైన్యం ముందుకొచ్చింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మన దేశంలోనే తయారు చేసిన ఈ మెషీన్ పిస్టల్స్ మొత్తం 550 తమకు కావాలని భారత సైన్యం ఆర్డర్ చేసింది.
Hyderabad Lokesh Machines: అమెరికా ఆంక్షలు పెట్టినా..ఆదుకున్న భారతసైన్యం
ఆత్మనిర్భర్ కింద..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES