Japan PM: జపాన్ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు. పార్టీలోని అంతర్గత వ్యవహారాల వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ క్రమంలోనే లిబరల్ డమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనై తకైచి ఎన్నికయ్యారు. దీంతో, తదుపరి ప్రధానిగా తకైచి బాధ్యతలు తీసుకునేందుకు మార్గం సుగమమైంది. దీంతో జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన ఘనత సాధించనున్నారు. జపాన్‌ను పాలించిన ఎల్‌డీపీ.. ఇషిబా నాయకత్వంలో పార్లమెంటు ఉభయ సభల్లోనూ తన మెజారిటీని కోల్పోయింది. ప్రస్తుతం తకైచి నాయకత్వం వహించనున్న ఈ పార్టీ చీలిపోయిన స్థితిలో ఉంది. పెరిగిన ధరలు, ఉదారమైన ఉద్దీపన కార్యక్రమాలు, కఠినమైన వలస నిబంధనలు అందించే ప్రతిపక్షాల వైపు ఆకర్షితులవుతున్న ప్రజలు.. ఈ అంశాలన్నీ ఆమె ముందు సవాళ్లుగా నిలిచాయి. తన విజయోత్సవ ప్రసంగంలో తకాయిచి.. ఓటర్ల ఆందోళనలను ఆశగా మార్చాలనుకుంటున్నానని ప్రకటించారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌ను ఆమె తరచుగా తన రాజకీయ ఆదర్శంగా పేర్కొంటారు. ఆర్థిక కార్యక్రమం ‘అబెనొమిక్స్’ (భారీ ప్రభుత్వ వ్యయం, సులభతర ద్రవ్య విధానం)కు ఆమె గట్టి మద్దతుదారు. ఇటీవల బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల పెంపుదలపై కూడా ఆమె విమర్శలు చేశారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కుదిరిన వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాన్ని సమీక్షించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.
Read Also: Viral Video: ఏనుగు తొండంలో బీరు పోసిన వ్యక్తి.. సోషల్ మీడియాలో ఈ విషయంపైనే చర్చ
1993లో తొలిసారిగా..
64 ఏళ్ల తకైచి 1993లో నారాలోని తన స్వస్థలం నుంచి పార్లమెంటుకు తొలిసారి ఎన్నికైన తకైచి.. ఆర్థిక భద్రతా మంత్రి వంటి ఉన్నత పదవుల్లో పని చేశారు. యవ్వనంలో హెవీ మెటల్ బ్యాండ్‌లో డ్రమ్మర్‌గా, మోటార్ సైకిల్ ఔత్సాహికురాలిగా ఉన్న తకైచి.. సంప్రదాయ పార్టీ అభిప్రాయాలను బలంగా సమర్థించడం ద్వారా రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నారు. ఎల్‌డీపీలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రితో సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు. ఈ గెలుపు తనకు సంతోషం ఇవ్వడం కంటే.. బాధ్యతను పెంచిందని ఈసందర్భంగా తకైచి పార్టీ సభ్యులతో పేర్కొన్నారు.
Read Also: Diwali : అదృష్టం అంటే వీరిదే.. దీపావళి తర్వాత లక్కు మామూలుగా ఉండదు
రాజకీయ ఒత్తిళ్లకు..
ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార పార్టీ మెజార్టీని సాధించలేకపోయింది. దీనికి ముందు దిగువ సభలో కూడా మెజార్టీ కోల్పోయింది. దీంతో ఇషిబాపై ఒత్తిడి పెరగ్గా.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈక్రమంలోనే శనివారం పార్టీలో ఎన్నికలు జరగ్గా.. మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమితో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఓడించి తకైచి విజయం సాధించారు. ఇక, దేశ తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు జపాన్ పార్లమెంటు అక్టోబరు 15న ఓటింగ్ నిర్వహించనున్నట్లు రాయిటర్స్ తెలిపింది. తాజాగా మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమిని ఆమో ఓడించారు.


