Tuesday, July 15, 2025
Homeఇంటర్నేషనల్Pope Francis: పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత

Pope Francis: పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత

పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) కన్నుమూశారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కొంతకాలంగా వాటికన్ సిటీలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

1936 డిసెంబర్‌ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్‌(Pope Francis) 2013 మార్చి 13న 226వ పోప్‌గా ఎన్నికయ్యారు. అలాగే అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా ఖ్యాతి గడించారు. పోప్ మృతితో యావత్ క్రైస్తవ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల దేశాధినేతలు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News