Tuesday, September 17, 2024
Homeఇంటర్నేషనల్Sri Chaitanya won many prices in NASA-NSS-ISDC too: వల్డ్ ఛాంపియన్ గా శ్రీ...

Sri Chaitanya won many prices in NASA-NSS-ISDC too: వల్డ్ ఛాంపియన్ గా శ్రీ చైతన్య, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కొల్లగొట్టిన చైతన్య విద్యార్థులు

మరే ఇతర విద్యాసంస్థ ఈ ఘనత సాధించ లేదు

అమెరికా నాసా-ఎన్ఎస్ఎస్-ఐసీడీసీ కాన్ఫరెన్స్- 2024లో శ్రీ చైతన్య స్కూల్ విజయకేతనం ఎగరవేస్తూ సరికొత్త రికార్డు సృష్టించటం విశేషం.

- Advertisement -

అంతర్జాతీయ స్థాయిలో, అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్డీసీ కాన్ఫరెన్సుకు ప్రపంచం నలుమూలల నుండి, సుమారు 30 దేశాలకు చెందిన అనేక వందల మంది విద్యార్థులు హాజరవగా, వీరిలో 167 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉన్నారని శ్రీ చైతన్య స్కూల్ అకాడెమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. ప్రపంచంలో ఏ ఇతర విద్యాసంస్థ నుండి ఇంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఈ కాన్ఫరెన్సుకు ఎంపిక కాలేదు.

స్పేస్ సెటిల్మెంట్ కంటెస్ట్ లో ..

ఇటీవల అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కంటెస్ట్ లో ఒక్క భారతదేశం నుండే 25,000 మంది విద్యార్థులు పాల్గొనగా, ఒక్క శ్రీ చైతన్య మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో 638 మంది విద్యార్ధుల భాగస్వామ్యంతో, 62 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని వరుసగా 11వ సారి వరల్డ్ నంబర్ 1గా, వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ 62లో వల్డ్ ఫస్ట్ ప్రైజులు7 కాగా, వల్డ్ థర్డ్ ప్రైజులు 15 ఉన్నాయని సంస్థ సగర్వంగా వివరించింది. వల్డ్ సెకెండ్ ప్రైజుల్లో 11, 28 హానరబుల్ మెన్షన్ ఉన్నాయని ఆమె మీడియాకు వెల్లడించారు.

13 ఏళ్లుగా..ఇదో రికార్డు..

ఈ కాన్ఫరెన్సులో లిటరరీ మెరిట్ కేటగిరీలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ప్రపంచంలోని ఏకైక సంస్థ శ్రీ చైతన్యనే. శ్రీ చైతన్య స్కూల్ గ్రూప్ మాత్రమే గత 13 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అమెరికా వారి నాసా-ఎన్ఎస్ఎస్-ఐసీడీసీ కాన్ఫరెన్సుకు హాజరవుతూ ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. భారతదేశంలో లేదా ప్రపంచంలోని మరే ఇతర విద్యాసంస్థ ఈ ఘనత సాధించ లేదు.

కాన్ఫరెన్స్ జరిగిన రోజులలో, మా స్కూల్ విద్యార్థులు ప్రసిద్ధ నాసా వ్యోమగాములు, జోస్ ఎం, హెర్నాండెజ్, బ్రాన్ వెర్స్టూగ్-కాన్సెప్చువల్ డిజైనర్ స్పేస్హ్యాబ్ డాట్ కాంతో కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఎడ్యుకేషనల్ టూర్లో..

శ్రీ చైతన్య బృందం గ్రిఫిత్స్ అబ్జర్వేటరీ, కాలిఫోర్నియా సైన్స్ సెంటర్, యాపిల్ పార్క్, శాన్ ఫ్రాన్సికోలోని సిలికాన్ వ్యాలీలోని ఐబీఎం మ్యూజియంను సందర్శించి, ఎస్టీఈఎం వర్క్ షాపుకు సైతం హాజరై, అనేక ఇంజినీరింగ్ నైపుణ్యాలు, అధునాతన సాంకేతిక పోకడల గురించి సమాచారాన్ని తెలుసుకున్నారు. పర్యటనలో, విద్యార్థుల బృందం అమెరికా గురించి అపారమైన జ్ఞానాన్ని, ఆ దేశం సాంకేతిక, సామాజిక- ఆర్ధిక పురోగతి గురించి తెలుసుకున్నారు. తమ కోసం ఇంత మంచి ఎడ్యుకేషనల్ టూర్ను ఏర్పాటు చేసినందుకు శ్రీ చైతన్య యాజమాన్యానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్, సీఏలో జరిగిన ఐసీడీసీ కాన్ఫరెన్స్ కు హాజరైన విజేతలైన విద్యార్థులందరినీ, వారి తల్లిదండ్రులు, బోధన, బోధనేతర సిబ్బందిని డైరెక్టర్ సీమ ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News