Sunday, July 7, 2024
Homeఇంటర్నేషనల్Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి వర్ధంతికి చైనాలో 'ఇంగ్లీష్ వింగ్లీష్' రిలీజ్

Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి వర్ధంతికి చైనాలో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ రిలీజ్

అతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఈనెల 24వ తేదీకి ఐదేళ్లు కావస్తుంది. ఈసందర్భంగా ఆమె నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ ను చైనాలో రిలీజ్ చేయనున్నారు. గౌరీ షిండే డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు రావటమే కాక కమర్షియల్ హిట్ గానూ నిలిచింది. చైనాలో ఇంగ్లీష్ వింగ్లీష్ ను 6,000 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. మంచి కథనం, సంస్కృతి-భారతీయ సంప్రదాయం ఉన్న సినిమాలు చైనాలో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద సినిమా మార్కెట్ ఉన్న చైనాలో ఇండియన్ సినిమాలను విరగబడి చూడటం ట్రెండ్ గా మారింది. ఇక ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా విషయానికి వస్తే ఇది టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రీమియర్ మూవీగా ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News