Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్New Delhi: భారత్ లో ల్యాండ్ అయిన అపాచీ..!

New Delhi: భారత్ లో ల్యాండ్ అయిన అపాచీ..!

USA: భారత సైన్యం మరింత బలపడుతుంది. ఈరోజు అమెరికాకు చెందిన అత్యాధునిక మూడు అపాచీ AH-64E అటాక్ హెలికాఫ్టర్లు భారత దేశానికి చేరుకున్నాయి. ఇవి ఘజియాబాద్ లోని భారత వాయుసేనకు చెందిన హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో  ల్యాండ్ అయ్యాయి.

- Advertisement -

ఈ హెలికాఫ్టర్ల కోసం భారత సైన్యం ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. వీటి ద్వారా భారత సైన్యం మరింత సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. వీటిని భారత సైన్యం యొక్క జోధ్‌పూర్ లోని మొదటి అపాచీ స్క్వాడ్రన్‌లో చేర్చనున్నారు. ఇవి శత్రువులపై దాడులకు, గూఢచర్యానికి ఉపయోగపడతాయి. ఈ అపాచీ హెలికాప్టర్లను పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఉంది. 

Readmore:https://teluguprabha.net/international-news/gaza-ceasefire-demand-israel-isolated/

ఇది వరకే 2015లో భారత వాయుసేన అమెరికా నుంచి 22 అపాచీ హెలికాప్టర్‌లను కొనుగోలు చేసింది. 2020లో మరో 6 అపాచీ హెలికాప్టర్‌ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్ వచ్చినప్పుడు జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా తొలి విడత మూడు హెలికాప్టర్‌లు ఇపుడు వచ్చాయి. ఇవి 2024 లోనే భారత్‌కు రావాల్సి ఉంది ఉండగా అనివార్య కారణాల వలన ఈ అపాచీ హెలికాప్టర్‌లు భారత్‌కు ఆలస్యంగా చేరుకున్నాయి.

Readmore: https://teluguprabha.net/international-news/ready-to-extend-support-pm-modi-to-bangladesh/

రెండో దశ హెలికాప్టర్లు ఈ ఏడాది ఆఖరు నాటికి రాబోతున్నాయి. ఈ అపాచీ ఏహెచ్‌–64ఈ హెలికాప్టర్లు భారత వైమానిక దళంలో కీలకం కాబోతున్నాయి. ఈ హెలికాప్టర్లు శత్రు దేశాలపై దాడులకు, గూఢచర్యానికి రెండింటికీ ఉపయోగపడతాయి. మొదటి దశలో వచ్చిన మూడు, రెండో దశలో రానున్న మూడు అపాచీ హెలికాప్టర్‌లను అపాచీ హెలికాప్టర్‌లను దాడులతో పాటు గూఢచర్యానికి వినియోగిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad