Parenting Tips: నేటి బిజీ లైఫ్ లో అనేక కారణాల వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలతో సమయం గడపడం మానేశారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే భార్యాభర్తలు తమ పిల్లలతో సమయాన్ని గడపడానికి ఒక సవాలుగా మారిపోయింది. ఆఫీసు పనులు, ఇంటి పనులు, సోషల్ మీడియాలో బిజీ బిజీగా ఉండటం వల్ల కుటుంబం కోసం అందుబాటులో ఉన్న సమయం క్రమంగా తగ్గుతుంది. అయితే, మీరు రోజంతా ఎంత బిజీగా ఉన్నా కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. ఇది పిల్లల ఆత్మ విశ్వాసాన్నిపెంచడమే కాకుండా, మీకు పిల్లలకి మధ్య సంబంధాన్ని కూడా బలోపేతం చేస్తుంది. అయితే ఇప్పుడు జీవితంలో ఎంత బిజీగా ఉన్నా క్రింది ఉన్న ఐదు చిట్కాలను అనుసరిస్తే పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు.
1. రోజంతా మీకు ఎంత పని ఉన్నా, పిల్లలతో కలసి ఉండటానికి దాదాపు 15-30 నిమిషాల సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ సమయం కేవలం పిల్లల కోసం మాత్రమే అయ్యి ఉండాలి. ఈ సమయాన్ని పిల్లలతో గడిపేటప్పుడు టీవీ, ల్యాప్ ట్యాప్ లకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో పిల్లల దినచర్య గురించి అడగాలి. ఒక మంచి కథ కూడా చెప్పవచ్చు. కలిసి కూర్చుని ఏదైనా పెయింటింగ్ వేయవచ్చు. ఈ చిన్న క్షణాలు పిల్లల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. దీంతో తల్లిదండ్రులపై ప్రేమ పెరుగుతుంది.
2. ప్రతి వారంలో కుటుంబంతో కలిసి సమయం గడపడానికి ఏదైనా ఒక రోజును నిర్ణయించుకోవాలి. ఈ సమయంలో పార్క్ కు వెళ్లడం, సినిమా చూడటం, ఇంట్లోనే కలిసి వంట చేయడం వంటివి చేయాలి. ఈ చిన్న పనులు పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతాయి. వారు కూడా తమ కోసం సమయం కేటాయిస్తున్నారని కూడా భావిస్తారు.
Also Read: Onion Cutting: కిలో ఉల్లిపాయలు కోసినా కన్నీళ్లు రావద్దంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే!
3. తల్లిదండ్రులు పిల్లలకు పాఠశాలలో ఇచ్చే ప్రాజెక్టులు, హోంవర్క్, లేదా ఎగ్జామ్ ప్రిపరేషన్ లో పిల్లలకు కొంచెం సహాయం చేయాలి. ఇలా చేయడం వల్ల వారికి చదువులపై ఎక్కువ ఆసక్తిని కలిగిస్తుంది. ఇందులో భాగంగా పిల్లలతో సమయం కూడా గడపవచ్చు. మీ సపోర్ట్ వల్ల మీ పిల్లలు మానసికంగా ఎంతో బలంగా ఉంటారు.
4. సమయం ఉన్నప్పుడు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు మొబైల్, ల్యాప్ ట్యాప్ , టీవీ వంటి పరికరాలను పూర్తిగా దూరం ఉంచాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలు తమని అర్థం చేసుకుంటున్నారని, చెప్పేది వింటున్నారని, వారి భావాలకు విలువ ఇస్తున్నారని అనిపిస్తుంది. తల్లిదండ్రులకు తమపై ఎంతో ప్రేమ ఉంటుందని అనుకుంటారు.
5. కొన్నిసార్లు మార్కెట్ కు కూరగాయలు కొనడానికి వెళ్తున్నప్పుడు పిల్లలను వెంట పెట్ట్టుకొని వెళ్లాలి. ఇలా కూడా పిల్లలతో సమయం గడపవచ్చు. కొన్నిసార్లు ఇంట్లో వంటకాలు చేస్తుంటే ఇందులో పిల్లలు కొంచెం హెల్ప్ చేసే విధంగా అవకాశం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీతో సమయం కూడా గడుపుతారు


