Health Benefits Of Dates: ఖర్జూరం ఒక అద్భుతమైన డ్రై ఫ్రూట్. దీని మనం సలాడ్, స్వీట్, నేరుగా తింటాము. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు అనేక రకాలు పోషకాలను కలిగి ఉంటుంది. ప్రతిరోజు ఒకటి లేదా రెండు ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఖర్జూరం తినడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు:
జీర్ణవ్యవస్థను పెంచుతుంది:
ఖర్జూరంలో అధిక శాతం ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగపరుచడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖర్జూరాని నేరుగా లేదా సలాడ్‌లో కలిపి తినవచ్చు.
తక్షణ శక్తి:
ఖర్జూరంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇది వ్యాయామం చేసేవారికి మంచి ఎంపిక. అలసిపోయినప్పుడు ఖర్జూరం తింటే వంటే శక్తి లభిస్తుంది. నీరసంతో బాధపడేవారు కూడా రోజుకు రెండు ఖర్జూరాలు తినడం మంచిది.
ఎముకలను దృఢంగా:
కీళ్ళ సమస్యలతో బాధపడేవారు కూడా ఖర్జూరాన్ని తినవచ్చు. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్, మాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎముకల నొప్పులను,ఆస్టియోపొరోసిస్ వ్యాధి తగిస్తుంది.
గుండె ఆరోగ్యం:
ప్రతిరోజు ఒక ఖర్జూరం తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఖర్జూరంలో ఉండే యాంటీఆక్సిడెంట్‌లు, మెగ్నీషియం, పొటాషియం రక్తపోటు నియంత్రిస్తుంది. మీ ఆహారంలో ఖర్జూరాని చేర్చుకోవడం మంచిది.
రక్తహీనతను తగ్గిస్తుంది:
ఖర్జూరంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతతో బాధపడేవారికి చాలా ఉపయోగ పడుతుం. ముఖ్యంగా మహిళలలు నెలసరి సమస్కలో కలిగే సమస్యలను తగ్గిస్తుంది.
మెదడు పనితీరు:
మతిమరుపుతో బాధపడేవారు ఖర్జూరం తినడం వల్ల జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుచుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్‌లు అల్జీమర్స్, న్యూరోడిజెనరేటివ్ వ్యాధులను తగ్గిస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
మనలో చాలా మంది తరుచుగా జర్వం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వారు ఖర్జూరం తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యం:
ఖర్జూరంలో విటమిన్‌లు, యాంటీ ఆక్సిడెంటు ఉండటం వల్ల ఇది జుట్టు రాలే సమస్యలను, చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఖర్జూరం ఆరోగ్యకరమైన డ్రైఫ్రూట్ అయినప్పటికి కొన్ని ఆరోగ్యసమస్యలతో బాధపడేవారికి మంచిది కాదు. ఎలాంటి వారు ఖర్జూరానికి తినకూడదు అనేది తెలుసుకుందాం.
Read more: Dates Benefits: వందల రోగాలను పోగొట్టే ఈ డ్రై ఫ్రూట్ గురించి తెలుసా?డయాబెటిస్ ఉన్నవారు:
ఖర్జూరంలో సహజంగా షుగర్ లెవల్స్ ఉండటం వల్ల ఇది డయాబెటిస్ తో బాధపడేవారికి మంచిది కాదు ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది షుగర్ లెవల్స్‌ను వెంటనే పెంచుతుంది.
కిడ్నీ సమస్య ఉన్నవారు:
ఖర్జూరం కిడ్నీ సమస్యలు ఉన్నవారికి మంచిది కాదు దీని వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని తినకూడదు.