How many steps for weight loss: అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా బరువు పెరగడం చాలా సాధారణం అయిపోయింది. అయితే కొన్ని సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా బరువును ఎంతో సులభంగా తగ్గించవచ్చు. ఇందులో నడక ఒకటి. బరువు తగ్గడానికి నడక సులభమైన, అత్యంత ప్రభావంతమైన మార్గాలలో ఒకటి. అయితే, చాలామందికి బరువు తగ్గడానికి ప్రతి రోజు వాకింగ్ లో ఎన్ని అడుగులు నడవాలి అనే ప్రశ్న తలెత్తుతోంది. బరువు తగ్గాలనుకునే వారు పరిమిత సంఖ్యలో అడుగులు వేయాలి. అయితే ఇప్పుడు బరువు తగ్గడానికి ప్రతి రోజు వాకింగ్ లో ఎన్ని అడుగులు నడవాలో ఇక్కడ తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి వాకింగ్ లో ఎన్ని అడుగులు నడవాలి?
సాధారణంగా బరువు తగ్గడానికి 10,000 అడుగులు ఉత్తమంగా పరిగణిస్తారు. కానీ చాలామందికి ఈ లక్ష్యం చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఈ సమయంలో 7- 8 వేల అడుగులు కూడా నడవవచ్చు.
Also Read: Migraine: వాతారవరణ మార్పుల వల్ల మైగ్రేన్ అటాక్స్..ఎలా తగ్గించుకోవాలంటే..?
వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు
1. ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం 7- 8 వేల అడుగులు నడవడం వల్ల దాదాపు 250- 400 కేలరీలు బర్న్ అవుతాయి. ఇది క్రమంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
2. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది కొవ్వును కరిగించడాన్ని వేగవంతం చేస్తుంది.
3. ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
4. నడక వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వాకింగ్ చేసేటప్పుడు ఎండార్పిన్ హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి మానసిక స్థితిని బాగా ఉంచుతుంది.
తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహించడం
బరువు తగ్గడానికి కేవలం నడక మాత్రమే సరిపోదు. తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. బరువు తగ్గడానికి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి. ఇవి ఆకలిని నియంత్రించి, కండరాలను బలోపేతం చేస్తాయి. కావున బరువు తగ్గడానికి ప్రతి రోజు వాకింగ్ మాత్రమే కాకుండా తీసుకునే ఆహారంలో గుడ్లు, చికెన్, చేపలు, పప్పులు, చీజ్, పెరుగు, సోయాబీన్ వంటివి భాగం చేసుకోవాలి.
వాకింగ్ చేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు
1. బరువు తగ్గాలనుకునే వారు వాకింగ్ లో క్రమంగా అడుగులు పెంచాలి. మొదట 5000 అడుగులతో ప్రారంభించి, క్రమంగా 7000- 8000 వేల అడుగులు నడవాలి.
2. వాకింగ్ చేస్తున్నప్పుడు సాధారణ వేగం కంటే వేగంగా నడవడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు.
3. బరువు తగ్గడానికి ఉదయం ఖాళీ కడుపుతో నడవడం ఉత్తమం. ఎందుకంటే ఇది కొవ్వును కరిగించడాన్ని వేగవంతం చేస్తుంది.
4. వాకింగ్ మధ్యలో హైడ్రేట్ గా ఉండడానికి నీరు త్రాగుతూ ఉండాలి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది.


