సినిమా-పాప్ కార్న్ ఈ రెండూ ఎంత పవర్ఫుల్ కాంబినేషనో, అందుకే ఎంటర్టైన్మెంట్ వల్డ్ లో ఇవి ఎవర్ గ్రీన్ బిగ్గెస్ట్ స్టార్ కాంబో. అందుకే ఫ్యాషన్ డిజైనర్స్ కూడా చాలా మంది పాప్ కార్న్ డ్రెస్సెస్ డిజైన్ చేస్తుంటారు. లేటెస్ట్ గా అలాంటి పాప్ కార్న్ డ్రెస్ ఫ్యాషన్ సర్కిల్ లో ట్రెండింగ్ గా మారింది.

అమెరికన్ యాక్ట్రెస్ ఎమ్మా స్టోన్ వేసుకున్న ఈ పాప్ కార్న్ డ్రెస్ చాలామందికి తెగ నచ్చేసింది. ఫన్ ఫ్యానష్ స్టేట్మెంట్ లా ఉన్న ఈ డ్రెస్ ఇంప్రెస్సివ్ లుక్స్ ఇస్తోంది. రెడ్ కార్పెట్ పైకి వచ్చేప్పుడు ఎమ్మా డ్రెస్ కి ఉన్న రెండు పాకెట్లలో పాప్ కార్న్ నింపుకోవటమే కాక చేతిలో కూడా పాప్ కార్న్ పాకెట్ పట్టుకుని తింటూ వచ్చారు. లూయిస్ విట్టన్ బ్రాండ్ వేర్ అయిన ఈ పాప్ కార్న్ ఫ్లోర్ లెంత్ గౌన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది కూడా.

గతంలోనూ రెడ్ కార్పెట్ పై చాలామంది ఇలాంటి ప్రయోగాలు చేశారు. చిప్స్ బ్యాగ్ అని, ఆనియన్-చీజ్ అని పలు ఫుడ్ స్టెట్మెంట్స్ ఇస్తూనే ఫ్యాషన్ ను కొత్త పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేశారు.