Age specific Symtoms of Diabetes: మధుమేహం లేదా డయాబెటిక్, ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించే సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, ఇతర అనేక అలవాట్లు. అయితే ఈ వ్యాధి లక్షణాలు తెలియక చాలామంది గుర్తించలేకపోతున్నారు. వయసును బట్టి ఎవరిలో ఎలాంటి డయాబెటిస్ లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నారులు, కౌమార దశలో ఉన్న వారు
చిన్నారులు, బాల బాలికల్లో టైప్-1 డయాబెటిస్ సాధారణం. ఈ వయసు వారిలో అధిక దాహం, తరచుగా మూత్ర విసర్జన, పరువు ఎక్కువగా తగ్గిపోవడం, తరచుగా అలసట, దృష్టిలోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.
Also Read: Health: ఫిట్ గా ఉండాలా..?అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!
యువకులు, మధ్య వయసు వారు
యువత, మధ్య వయసు ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తాయి. అయితే వీరిలో అంత త్వరగా లక్షణాలు కనిపించవు.
స్థూల కాయం, గాయాలు త్వరగా మారకపోవడం, చర్మం, మూత్రపిండాల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావడం ఆకలి ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైద్యుడుని సంప్రదించి డయాబెటిస్ పరీక్ష చేయించడం మంచిది.
వృద్ధులు
వృద్ధులలో డయాబెటిస్ లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఎక్కువగా దాహం వేయడం, తరచుగా మూత్ర విసర్జన, ఎక్కువగా అలసట, దృష్టిలోపం, గాయాలు మానడం ఆలస్యం కావడం వంటి లక్షణాలు గమనించవచ్చు. డాక్టర్ సూచన మేరకు షుగర్ టెస్ట్ చేయించాలి. వ్యాధి ఉందని తెలిపే చికిత్స తీసుకోవాలి.
డయాబెటిస్ చికిత్స
మధుమేహం లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. గుర్తించినట్లయితే, సకాలంలో చికిత్స రోగి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ వల్ల కలిగే సమస్యలను నివారించవచ్చు. డయాబెటిస్ నివారణ నిర్వహణకు ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తేలికపాటి వ్యాయామం ఎంతో అవసరం. అలాగే, నిర్దిష్ట వైద్య పరీక్షలు తరచుగా చేయించుకోవాలి. ఈ విధానాలు డయాబెటిస్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


