Self-Confidence: మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కొందరు మనలను నిర్లక్ష్యంగా చూసేలా ప్రవర్తిస్తారు. ఇది ఆఫీసులోనైనా కావచ్చు, ఇంటి పక్కనున్న వారైనా కావచ్చు, లేదా స్నేహితులైన ఉండొచ్చు. వారి ఈ వైఖరిని అర్ధం చేసుకోవడం కష్టం కాని, దీని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుంటే మనం దానికి పాజిటివ్‌గా స్పందించవచ్చు. ఎదుటి వారు మిమ్మల్ని తక్కువగా చూడటం మీ బలహీనత కాదు. వారు మీ ఎదుగుదలని చూసి అసౌకర్యంగా ఫీలవుతుండవచ్చు. ఇది మీరు ఏదో మంచి దిశగా ముందుకు వెళ్తున్నారని సూచించే సంకేతం. కాబట్టి దాన్ని మనస్సులో పెట్టుకుని తల దించుకోవడం కాకుండా, దాన్ని ప్రేరణగా మార్చుకోవాలి.
సమస్యను ఎలా చూడాలనే దానిపైనే పరిష్కారం ఆధారపడి ఉంటుంది
ఒకరు మిమ్మల్ని చాలా తక్కువ చేసి చూస్తే, అది వారి ఆత్మవిశ్వాస లోపాన్ని ప్రతిబింబిస్తుందే తప్ప, మీ విలువను కాదు. ఎటువంటి సమస్య అయినా, దానిని మీరు ఎంతలా రెచ్చగొట్టుకుంటున్నారన్నదే ముఖ్యమైన విషయం. ఊహల్లో భయపడడం కాకుండా, ఆ సమస్యను నేరుగా ఎదుర్కోవడం నేర్చుకుంటే.. దాని తీవ్రత తక్కువగా అనిపిస్తుంది. సమస్యను పర్సనల్‌గా తీసుకోకుండా, ఒక జ్ఞానాన్ని అందించే పరిణామంగా చూడటం మంచిది.
నెగటివిటీని దాటేయండి
‘‘ఇది కుదరదు’’ అన్న నమ్మకం అన్నింటికన్నా పెద్ద ఆటంకం. మీ విలువ మీకు మాత్రమే స్పష్టంగా తెలిసి ఉంటుంది. ఇతరులు ఏం అనుకుంటున్నారు అన్నది అవసరం లేని భారం. నమ్మకంతో ముందుకు సాగండి. ఇతరుల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపనివ్వకుండా ఉండండి. అవసరమైతే వాటిని వినగానే వదిలేయడాన్ని అలవాటు చేసుకోండి. వాళ్లు పైకి ఉన్నట్టు అనిపించినా, మీరు కూడా ఆ స్థాయికి చేరే శక్తి కలవారు. ఓ దశలో మిమ్మల్ని తక్కువగా చూసినవారే, మీ విజయాన్ని చూసి మౌనంగా మారతారు. మీకు లోపాలు ఉన్నా, వాటిని అభివృద్ధి అవకాశాలుగా తీసుకోవాలి. ప్రతి రోజు కొద్దిగా మెరుగవుతూ, మీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకోండి.
తక్కువగా చూసేవాళ్లను ‘లైట్ తీస్కోండి’
వాళ్లు మాట్లాడిన ప్రతీ మాటమీద స్పందిస్తే, మీరు అభివృద్ధిలో ఆటకాయడమే అవుతుంది. అందువల్ల, తేలిగ్గా తీసుకోవడం నేర్చుకోండి. మనలోని మైండ్‌సెట్ ఎలా ఉంటే, మన ప్రయాణం అలా మలుపు తిరుగుతుంది. ఇతరుల నెగటివ్ కామెంట్లు మీ దారిని మార్చకూడదు. మీపై విమర్శలు వచ్చినా, హేళన జరిగినా, ప్రతిస్పందించకుండా మీ పని మీద కేంద్రీకరమవ్వండి. ఈ విధంగా మీరు ఎమోషనల్ బ్యాలెన్స్‌తో ముందుకు సాగితే, చివరకు విమర్శకులే మౌనంగా మారిపోతారు. మీ విజయమే వారికి సమాధానం అవుతుంది.
సంక్షిప్తంగా చెప్పాలంటే.. వాళ్లు తక్కువగా చూడడం అన్నది మీరు ఎదుగుతున్న సంకేతం. వారి దృష్టిలో మీరు పోటీగా కనిపిస్తున్నారన్న మాట. ఇది ఓ మంచి గుర్తింపు. కాబట్టి నెగటివిటీ నుంచి బయటపడండి, మీ విలువను మీరు గుర్తించండి, ప్రశాంతంగా, నమ్మకంగా ముందుకు సాగండి.


