Friday, November 22, 2024
Homeనేషనల్Love Marriage : స్టూడెంట్ ని ప్రేమించి పెళ్లిచేసుకున్న టీచర్.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్

Love Marriage : స్టూడెంట్ ని ప్రేమించి పెళ్లిచేసుకున్న టీచర్.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్

అతనొక ఉపాధ్యాయుడు. స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పి.. వారికి మంచి భవిష్యత్ ను చూపించాల్సిన వయసులో.. ఓ స్టూడెంట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందులో వింతేముంది ఇలాంటివి చాలా జరిగాయిగా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వాళ్లిద్దరి మధ్య వయసు తేడా 30 సంవత్సరాలు. మీరు చదివేది నిజమే. అతని వయసు 50, ఆమె వయసు 20 సంవత్సరాలు. వీరిద్దరి పెళ్లి ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా నిలిచింది. వీరి పెళ్లివీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

- Advertisement -

ఈ విచిత్రమైన ప్రేమ పెళ్లి బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆ యువతి పేరు శ్వేతా కుమారి(20). ఆ టీచర్ పేరు సంగీత్ కుమార్(50). రోస్రా నివాసి అయిన శ్వేతా కుమారి.. ఇంగ్లీష్ నేర్చుకునేందుకు టీచర్ దగ్గరికి వచ్చేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మనసులు ఒక్కటయ్యాయి. బహుశా ప్రేమ గుడ్డిది. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదంటే ఇదేనేమో. ఇంకేముంది పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు. తనకన్నా 30 ఏళ్లు పెద్దవాడైన టీచర్ ను ఆ యువతి ప్రేమించి, పెళ్లిచేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ టీచర్ కు ఇది రెండో పెళ్లి కావడం మరో విశేషం. అతని మొదటి భార్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిందని సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News