Saturday, October 5, 2024
Homeనేషనల్Grandma Makeup : మాజీ ప్రియుడి అంత్య‌క్రియ‌ల‌కు.. ఈ బామ్మ ఏం చేసిందో చూడండి

Grandma Makeup : మాజీ ప్రియుడి అంత్య‌క్రియ‌ల‌కు.. ఈ బామ్మ ఏం చేసిందో చూడండి

Grandma Makeup : సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌రువాత ఎక్క‌డ ఏం జ‌రిగినా క్ష‌ణాల్లో తెలిసిపోతుంది. ఇక ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైర‌ల్ అవుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. తాజాగా ఓ బామ్మ త‌న మాజీ ప్రియుడు అంత్య‌క్రియ‌లను హాజ‌రు అయ్యేందుకు అంద‌మైన డ్రెస్‌తో పాటు మేక‌ప్ వేసుకుని చ‌క్క‌గా ముస్తాబు అవుత‌న్న‌ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది.

- Advertisement -

ఈ బామ్మ పేరు డ్రోనియ‌క్‌. వ‌య‌స్సు 92 పై మాటే. ఆమె త‌న‌ను తాను సెల‌బ్రెటీగా చెప్పుకుంటుంది. ఇటీవ‌ల బామ్మ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తాను త‌న మాజీ బాయ్‌ఫ్రెండ్ బ్రూస్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రు కానున్న‌ట్లు తెలిపింది. ఇందుకోసం మేక‌ప్ వేసుకున్నట్లు చెప్పింది. త‌న ముఖానికి పౌడ‌ర్ రాసుకుని గులాబీ రంగు లిప్‌స్టిక్ పెట్టుకుంటూ కనిపించింది. ఈ రంగు అంటే త‌న మాజీ ల‌వ‌ర్‌కు చాలా ఇష్టం అని తెలిపింది. తాను మ‌రీ ఎక్కువ‌గా మేక‌ప్ వేసుకోవాల‌ని అనుకోవ‌డం లేద‌ని, అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాల‌ని అనుకోవడం లేద‌ని వీడియో చివ‌ర‌ల్లో చెప్పింది.

ఈ వీడియోను పోస్ట్ చేస్తూ బ్రూస్ అంత్య‌క్రియ‌ల‌కు రెడీ అయ్యా.. ఆర్ఐపి బ్రూస్ అని ఆ వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ వీడియోను 20 ల‌క్ష‌ల మందికి పైగా చూశారు. కేవ‌లం రెండు అంటే రెండు సెక‌న్ల‌లో బామ్మ లిప్‌స్టిక్ ఎలా వేసుకుందో అర్థం కావ‌డం లేదంటూ ఓ యూజ‌ర్ కామెంట్ చేయగా, ప్రతి ఒక్కరికి దీని తర్వాత వారి మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు అంత్యక్రియలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది అని మ‌రొక‌రు రాశారు. బామ్మ వేషాలు మామూలుగా లేద‌ని మ‌రొక‌రు కామెంట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News