ఢిల్లీ మాజీ సీఎం.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం అందరికీ తెలిసింది. ఈ ఘటనపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీని గురించి మీడియాతో మాట్లాడిన ఢిల్లీ సీఎం అతిశీ.. కేజ్రీవాల్ ను అడ్డు తొలగించుకోవడానికి బీజేపీ కుట్ర చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఈ కేజ్రీవాల్ కాన్వాయ్ పై దాడి జరిగిందని ఆమె ఆరోపించారు.
అయితే ఎన్ని కుట్రలు చేశానా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బీజేపీ ఓడించలేదని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేసి, ఆయన కారుపై రాళ్లు రువ్విన వారిపై ఇంతకుముందే కేసులు ఉన్నాయని, వారు తీవ్రనేరాలకు పాల్పడిన వారని అతిశీ అన్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేమని ఆయనను తమ దారి నుంచి తప్పించడానికి బీజేపీ ఇటువంటి వ్యూహాలను రచిస్తోందని విమర్శించారు.
దాడి చేసిన వారిలో ఒకరు బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ సహచరుడని అతిశీ ఆరోపించారు. పర్వేశ్ వర్మ ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్నారని తెలిపారు. రాహుల్ అలియాస్ శాంకీ అనే ఆ వ్యక్తిపై చోరీ, హత్యాయత్నం వంటి అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని ఢిల్లీ సీఎం అన్నారు. జ్రీవాల్పై దాడి చేయడానికి ఆ నేరస్తుడిని మరికొందరితో పాటు పంపారని అతిశీ తెలిపారు. ఆ నేరస్థుడు ప్రచార కార్యక్రమాల సమయంలో వర్మతో కలిసి తరచూ కనిపించాడని ఆరోపించారు.